ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5
11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ
26-10-18 96 న జన్మించి 18-8-1966 న చనిపోయిన 20 వ శతాబ్ది ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ లూయీ రెనౌ 1920 లో అగ్రిగేషన్ పాసై ,రోఎన్ లోని లైసీ లో ఒక ఏడాది ఉద్యోగించి ,సంస్కృత గ్రంధాలను చదవటం నేర్చి ,ఆంటోనీ మీలేట్ లో చేరాడు .తర్వాత పూర్తిగా సంస్కృత అధ్యాయనానికే అంకితమయ్యాడు .ఈకోల్ డేస్ హాట్స్ ఎత్యూడ్స్ లో జూల్స్ బ్రాచ్ ఇచ్చే ఉపన్యాసాలను శ్రద్ధగా విని ,అదే సమయం లో ‘’లెస్ మైత్రేస్ డీ లా ఫైలాలజి వేదిక్ ‘’పుస్తకం1928 లో రాశాడు .1925 లో డాక్ట టోరియల్ దీసేస్ ‘’లా వేలూర్ డుపార్ఫేట్ డాన్స్ లెస్ హిమ్స్ వేదిక్స్ ‘’ప్రచురించాడు .తరువాత మరి రెండు చోట్ల పని చేసి సార్బోన్నే చేరి ,.ఆల్ఫ్రెడ్ ఏ ఫౌచేర్ కు వారసుడుగా పదివి అధిష్టించాడు .1946 లో అకాడెమి డేస్ ఇన్స్క్రిప్షన్స్’’కు ఎన్నికయ్యాడు .
1948 -49 లాయిండియా ,1953 లో ఏల్స్ యూని వర్సిటి ,1954 నుంచి రెండేళ్ళు టోక్యో లలో పర్యటించి ‘’మాసన్ ఫ్రాంకో జపానీస్ ‘’కు డైరెక్టర్ అయ్యాడు .ఇండియా భాషలు తప్ప మరే దానిమీదా రాయనే లేదు చాలా కాలం .ఆర్కియాలజీ ,రాజకీయశాస్త్రం ,బౌద్ధం పై ఉన్న వ్యామోహాన్ని పూర్తిగా వదిలేసి ఋగ్వేదం పైన పూర్తిగా దృష్టి పెట్టాడు .40 ఏళ్ళు తన సృజనాత్మక పరిశోధనలను పెద్ద పెద్ద గ్రంధాలుగాఅత్యున్నత ప్రమాణాలతో రాస్తూనే ఉన్నాడు .ఆయన మనసులో సంస్కృత వ్యాకరణం పూర్తిగా నిండి పోయింది .అందుకే ‘’ఎత్యూడ్స్ వేదిక్ ఎట్ పాణినేస్’’రాసి 1955 -56 మధ్య ప్రచురించాడు .ఇది రెండు వేల పేజీలతో వేద మంత్రాలకు అనువాదం వ్యాఖ్య లతో ఉంది . ఋగ్వేదం లో రెండు వంతుల భాగం చనిపోయే లోపు పూర్తీ చేయ గలిగాడు .ఇన్ స్టి ట్యూట్డీ సివిలిజేషన్ఇండి యెన్నెకు డైరెక్టర్ అయి ,సొసైటీ ఏషియాటిక్ ,అకాడెమి ల మీటింగ్ లకు హాజరయ్యేవాడు .1 66 లో మహా విద్వాంసుడు లూయీ రెనౌ 70 వ ఏట చనిపోయాడు .
ఇంగ్లీష్ లో లూయీ రాసిన గ్రంధాలు –రెలిజియన్స్ ఆఫ్ ఎన్శేంట్ ఇండియా ,హిస్టరీ ఆఫ్ వేదిక్ ఇండియా ,హిందూయిజం ,ఏ హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ .ఫ్రెంచ్ భాషలో 13 పుస్తకాలు రాశాడు .
12-కాదంబరిని అనువదించిన –సి .ఎం .రిడ్డింగ్
కరోలిన్ మేరీ రిడ్డింగ్ 30-8-1832 న వెస్ట్ మిడ్లాండ్స్ లోని మెరిడన్ లో జన్మించి సంస్కృత ,పాళీ భాషలలో విద్వాంసురాలై భట్టబాణుని కాదంబరిని ఇంగ్లీష్ లోకి అనువదించింది ,తండ్రి విలియం రిడ్డింగ్ మెరిడన్ కు వికార్ ,క్రికెట్ ఆటగాడు .తల్లి కెరొలిన్ సేలిన కాల్డే కాట్ జార్జి రిడ్డింగ్ కు సమీప బంధువు .రిడ్డింగ్ సంస్కృతం నేర్చిన మొట్ట మొదటిమహిళా స్కాలర్ .ఇ .బి .కౌవేల్ శిష్యురాలు .ఆయన 1903చనిపోయాక ఆయన వద్ద ఉన్న 260గ్రంధాలు ఆమె అధీనం లోకి వచ్చాయి .ఈ పుస్తకాలను కేటలాగింగ్ చేసింది .కేంబ్రిడ్జి యూని వర్సిటి లైబ్రరీకి మొదటి మహిళా అధికారి ..ఎన్నో వేల గ్రందాల పట్టిక తయారు చేసిన ఘనత ఆమెది .
1923 లో కేంబ్రిడ్జి యూని వర్సిటి స్త్రీలకూ మొదటి సారిగా డిగ్రీ ని ప్రదానం చేసినప్పుడు ఆమె ఎం .ఏ డిగ్రీ పొందింది .సంస్కృత ,పాళీ భాషలలో ప్రావీణ్యాన్ని సంపాదిన్చాటమేకాక బెంగాలి హిందీ లనూ నేర్చింది .టిబెట్ భాష నేర్చి అ భాషా గ్రంధాలపై జర్నల్ ఆఫ్ ఏషియాటిక్ స్టడీస్ లో విమర్శలు రాసింది . షార్లెట్ మేరీ యాంగ్ పై ఆమెకు వల్లమాలిన అభిమానం .యాంగ్ రాసిన గ్రంధాలను గిరర్టన్ కాలేజి కి ప్రదానం చేసింది .రిడ్డింగ్ 9-11-1941 న మరణించింది. ఆమె గౌరవార్ధం ‘’రిడ్డింగ్ రీడింగ్ ప్రైజ్ ‘’ను ఏర్పాటు చేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-16 –ఉయ్యూరు
