గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
57-బ్రహ్మ సూత్ర భాష్య౦ లో పద భేద విచారణ చేసిన –వీరనారాయణ పాండు రంగి (1973)
4-7-1973నబెంగుళూర్ లో జన్మించి ,రాజస్థాన్ లో జైపూర్ లో సంస్కృత అధ్యాపకుడుగా పని చేసి కర్నాటక సంస్కృత సాయంకాల కాలేజి ప్రిన్సిపాల్ గా ఉన్న వీరనారాయణ పాండురంగి మహర్షి బాదరాయణ వ్యాస అవార్డ్ ను ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ నుండి 2011 లో అందుకొన్నాడు . ప్రస్తుతం రాజస్థాన్ జైపూర్ లోని జగద్గురు రామచంద్రాచార్య సంస్కృత యూని వర్సిటి దర్శన విభాగ డీన్ గా ఉన్నాడు .వీర నారాయణ దర్శన శాస్త్రం లో మహా ప్రసిద్ధుడు .
పాండు రంగి మార్తాండ దీక్షిత్ ,మాణిక్య శాస్త్రి ల వద్ద అధ్యయనం చేసి నవ్య న్యాయ ,ద్వైత వేదాంతాలలో విద్వాన్ డిగ్రీ ,పూర్వ మీమాంసలో విద్వాన్ మాధ్యమ డిగ్రీ ,,సాహిత్యం లో మాస్టర్ డిగ్రీ పొందాడు .ద్వైత వేదాంతం లో విద్యా వారధి (పి హెచ్ డి )ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి పొంది ,తిరుపతి సంస్కృత విద్యా పీఠం నుండి నవ్య న్యాయం లోనూ పి హెచ్ డిఅందుకొన్నాడు .బెంగుళూర్ లోని పూర్ణ ప్రజ్నవిద్యా పీఠ సంస్కృత కాలేజిలో 1995నుంచి 99వరకు నవ్య న్యాయ లెక్చరర్ గా ,1999నుండి 2005వరకు పాండిచేరి ఫ్రెంచ్ ఇన్ స్టి ట్యూట్లో రిసెర్చెర్ గా 20 05నుండి రామచంద్రా చార్య సంస్కృత విశ్వ విద్యాలయం లో దర్శన శాఖ అసిస్టంట్ ప్రొఫెసర్ గా 2007నుండి దానికి డీన్ గా పని చేస్తున్నాడు .
8 గ్రంధాలను 20 కి పైగా రిసెర్చ్ పేపర్లను పా౦డురంగి రచించాడు .2006లో సంస్కృతం లో ‘’సమవాయ విమర్శను ‘’,బ్రహ్మ సూత్ర భాష్యే పదభేద విచారః ‘’లను రచించి ప్రచురించాడు .హిందీలో సదాచార స్మృతి ,క్రష్ణామృతార్ణవహః ,అనే అనువాద రచనలు చేశాడు .సంస్కృతం లో న్యాయ సుధా ,తాత్పర్య చంద్రిక ముక్తితత్వం ,తర్కనవనీతం శక్తివాద గ్రంధాలను తన సంపాదకత్వం లో ప్రచురించాడు .
సశేషం
రధ సప్తమి శుభాకాంక్షలు
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -3-2-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

