గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
72 –మిలీనియం సంస్కృత పురస్కార గ్రహీత –పద్మశ్రీ దేవి దత్తశర్మ (1924 )
డోగ్రీ సాహిత్యాన్నీ హిమాలయ పర్వత ప్రాత సాహిత్యాన్ని పెంచి పోషించిన సంస్కృత పండితుడు కవి దేవీ దత్త శర్మ 23-10-1924 న ఉత్తరాఖండ్ లోని కుమాన్ జిల్లాలో జన్మించాడు .ఆగ్రా యూని వర్సిటి నుండి ఎం ఏ డిగ్రీపొంది ,బనారస్ ,పంజాబ్ యూని వర్సిటీల నుంచి రెండు డాక్టోరల్ డిగ్రీలు సాధించాడు .పంజాబ్ యూని వర్సిటి నుండి డి.లిట్ అందుకొన్నాడు .28 గ్రంధాలు ,200 పరిశోధనా పత్రాలు ,రచించాడు .56 రిసెర్చ్ గ్రంధాలలు వారి విద్వత్తును చాటుతాయి .ఆయన 8 భాగాలుగా రాసిన ‘’సోషియో కల్చర్ ఆఫ్ ఉత్తరాఖండ్ ‘’గొప్ప ప్రాచుర్యం పొందింది .మూడు భాగాల’’ జ్ఞాన కోశం ‘’ సంతరించాడు .
చండీగర్ లోని పంజాబ్ యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా దీర్ఘకాలం పని చేసిన అనుభవం దేవీ దత్త శర్మ ది .
ఆయన విద్వత్తు కు తగిన గౌరవ పురస్కారాలు లభించాయి .గర్వాల్ యూని వర్సిటి ‘’జీవిత సాఫల్య పురస్కారం ‘’,న్యు ఢిల్లీ లోని గ్యాన్ కళ్యాణ్ దత్వ్య న్యాస్ సంస్థ ‘’అఖిలభారత విద్వత్ సమ్మాన్ ‘’ను ,సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ‘’సంస్కృత విద్వత్ సమ్మాన్ ‘’,కేంబ్రిడ్జి లోని ఇంటర్నేషనల్ బయాగ్రాఫికల్ సెంటర్ ‘’2000 సంవత్సరం లో ‘’మిలీనియం అవార్డ్ ‘’ను ,అదే ఏడాది భారత ప్రభుత్వం ‘’మిలీనియం సంస్కృత పురస్కారం ‘’,2001 లోభారత రాష్ట్ర పతి గౌరవ సర్టిఫికేట్ ,2011 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసి సత్కరించాయి .
సశేషం
అంతర్జాతీయ కవితా దినోత్సవ శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-17 –ఉయ్యూరు

