గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
73-జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత –సత్యవ్రత శాస్త్రి (1930 )
ఇంతింతై
29-9-1930 న సంస్కృత మహా పండితుడు చారుదేవ శాస్త్రి కుమారుడు గా జన్మించిన సత్యవ్రత శాస్త్రి తండ్రిని మించిన పాండిత్యం ఉన్నవాడు .వారణాసి వెళ్లి పండిట్ సుఖదేవ్ ఝా ,డా.సిద్దేశ్వర వర్మ ల వద్ద విద్య నేర్చాడు .పంజాబ్ యూని వర్సిటి నుండి సంస్కృతం లో బి. ఏ. ఆనర్స్ ఎం. ఏ. లను బెనారస్ హిందూ యూని వర్సిటి నుండి పి .హెచ్ .డి .పొందాడు .ఢిల్లీ యూని వర్సిటి లో సంస్కృత ఉపన్యాసకుడుగా చేరి హెడ్ గా పండిట్ మన్మోహన నాద దార్ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ గా డీన్ గా 45 ఏళ్ళు పనిచేశాడు .తర్వాత పూరీ జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయ వైస్ చాన్సెలర్ గా సేవలందించాడు .బాంగ్ కాక్ లోని చూల లొంగు కారన్ ,సిల్పకారన్ యూని వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు ,నార్త్ ఈస్ట్ బుద్ధిష్ట్ యూని వర్సిటి ,ధాయ్ లాండ్ , జెర్మని ,బెల్జియం లోని కేధలిక్ యూని వర్సిటి ,కెనడాలోని అల్బర్టా యూని వర్సిటి ,లకు కూడా విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .ధాయ్ లాండ్ ప్రిన్సెస్ మహా చక్రి సింధు కారన్ కు సంస్కృతం నేర్పాడు .
మహా రచన
శాస్త్రి సంస్కృతం లో 3 మహా కావ్యాలు ,3 ఖండ కావ్యాలు ,1 ప్రబంధం ,ఒక పత్ర కావ్యం ,5 విశ్లేషణాత్మక గ్రంధాలు రాశాడు .అందులో రామకృతి మహాకావ్యం ,బృహత్తర భారతం ,శ్రీ బోధి సత్వ చరితం ,వైదిక వ్యాకరణం ,శర్మణ్యా దేశ సూత్ర౦ విభాతి ముఖ్యమైనవి .అనేక భాగాలుగా ‘’డిస్కవరీ ఆఫ్ సాంస్క్రిట్ ట్రెజర్స్ ‘’ఒక గొప్ప ఉద్గ్రంధం .ధాయ్ లాండ్ రామాయణం రాయల్ ధాయ్ ను రాజు అభ్యర్ధనపై సంస్కృతీకరించి శ్రీ రామ కృతి మహాకావ్యంగా రాశాడు .దీనికి ముందుమాట మహారాణి రాసింది .ధాయ్ లాండ్ లోని హిందూ దేవాలయాలు ,వాటిలోని సంస్కృత లిపి పై పరిశోధన చేశాడు .కాళిదాస రచనలపై గొప్ప వ్యాఖ్యానం రాశాడు .యోగ వాసిస్టం కు వివరణ రాసి ప్రచురించాడు .ఈశాన్య ఆసియాలో సంస్కృత పదజాలం ,శ్రీరాముడు ల పై విస్తృత పరిశోధన చేశాడు .న్యు ఢిల్లీ లోని’’ జవహర్ లాల్ నెహ్రు స్పెషల్ సెంటర్ ఫర్ సాంస్క్రిట్ ‘’కు గౌరవ ప్రొఫెసర్ గా శాస్త్రి ఉన్నాడు .
అంతర్జాతీయ పురస్కార వైభవం
సత్య వ్రత శాస్త్రి కి రాయల్ నేపాల్ అకాడెమి గౌరవం ,బెల్జియం యూని వర్సిటి విశిష్టపతకం ,కెనడాలోని అట్టావా అంతర్జాతీయ ఫెలోషిప్ ,బాంగ్ కాక్ యూని వర్సిటి గౌరవ దాక్ట రేట్ ,ఇటలి లోని సివిల్ అకాడెమి అవార్డ్ ,కెనడా వారి కాళిదాస సమ్మాన్,ఇటలి లోని టోరినో వారి స్పెషల్ అవార్డ్, గోల్డెన్ ప్రైజ్ , ,ఇండొనీషియా ప్రభుత్వ అవార్డ్ ,ధాయ్ లాండ్ రాయల్ డెకరేషన్ ,రోమానియా ప్రభుత్వ ఎక్సెలెన్స్, అవుట్ స్టాండింగ్ టీచర్ అవార్డ్ లు ,, ఇటలి లోని అగ్రి గెంటో నుండి ఫెలోషిప్ ,డాక్టర్ ఆఫ్ ఆనర్ వంటివి లెక్కలేనన్ని అంతర్జాతీయ అవార్డ్ లు లభించాయి .
జాతీయ పురస్కార హేల
సాహిత్య అకాడెమీ పురస్కారం ,ఢిల్లీ లోని సాహిత్య కళా పరిషత్ గౌరవం ,సిఖ్ గురుద్వారా పురాస్కారం ,భారత రాష్ట్ర పతి పురస్కారం ,శిరోమణి సంస్కృత సాహిత్య కార్ ,విశిష్ట సాహిత్య పురస్కార ,గీతా రాణా పురస్కార ,సాంస్క్రిట్ సేవా సమ్మాన్ ,సాంస్క్రిట్ సాహిత్య పురస్కార ,ఇందిరా బెహరే గోల్డ్ మెడల్ ,పండిత జగన్నాధ పద్య రచన పురస్కార్,కాళిదాస పురస్కార ,పండిట్ క్షమా రావు పురస్కార ,వాగ్విభూషణ బిరుదు ,దేవ వాణీ రత్న సమ్మాన్ ,రాజస్థాన్ వారి అఖిలభారత సంస్కృత తొలి పురస్కార ,వాచస్పతి పురస్కార ,మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వ పురస్కారాలు, మహా మహోపాధ్యాయ బిరుదు ,జ్ఞాన పీఠ పురస్కారం ,పద్మ భూషణ్ వంటి జాతీయ పురస్కారాలు 76 వరకు అందుకొన్న సాహితీ మూర్తి శ్రీ సత్యవ్రత శాస్త్రి .ఆయన్ను సన్మానించి గౌరవించని సాహిత్య సంస్థ ,ప్రభుత్వం లేదు అంటే అతిశయోక్తి కాదు .
సాహిత్య సరస్వతి
పైన చెప్పిన గ్రంధాలే కాక హ్యూమన్ వాల్యూస్ డెఫినిషన్స్,సంస్కృత రైటింగ్స్ అండ్ యూరోపియన్ స్కాలర్స్ ,వర్డ్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ సాంస్క్రిట్ వంటి 15 ఎకడమిక్ రచనలు చేశాడు .’
బృహత్ భారతం శ్రీ బోధి సత్వ చరితం ,ఇందిరా గాంధి చరితం ,ధాయ్ దేశ విలాసం , న్యు ఎక్స్ పరి మెంట్స్ ఇన్ కాళిదాస ,చాణక్య నీతి ,భవి తవ్యనం ద్వారానీ భవంతి సర్వత్ర ‘’అనే స్వీయ చరిత్ర మున్నగు సాహిత్య పరమైన 12 రచనలు చేశాడు .
ప్రపంచ కవితా దినోత్సవ శుభా కాంక్షలతో

