గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
74 –నాట్య శాస్త్ర నిధి –కమలేశ్ దత్త త్రిపాఠి (19 36
త్రిపాఠి అంటే నే మహా పండితుడు అనే అర్ధం లోకం లో ఉంది కమలేశ్ త్రిపాఠి నాటక నాట్య రంగ ప్రముఖుడైన సంస్కృత విద్వాంసుడు .బెనారశిండు విశ్వ విద్యాలయ౦ లో డిపార్ట్ మెంట్ ఆఫ్ రెలిజియన్స్ అండ్ ఆగమిక్ స్టడీస్ లో ఎమిరిటస్ ప్రొఫెసర్ . ఇందిరా గాంధి నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ కు 20 07 లో సలహాదారు .యూరప్ లో అనేక దేశాల యూని వర్సితీలలో విజిటింగ్ ప్రొఫెసర్ .జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ లో విస్తృతంగా ఫిలాసఫీ నాటకం సాహిత్యం లపై రచనలు చేశాడు .’’అమరు శతకాన్ని హిందీలోకి అనువదించాడు .చాలా సంస్కృత గ్రందాల ప్రచురణకు సంపాదకత్వం వహించాడు .సంస్కృత నాటక రంగం ఆయన కృషికి ఎంతో రుణ పది ఉంది.కమలేశ్ అంటే నాట్య నాటక రంగాలే గుర్తుకు వస్తాయి అంతటి విశిష్ట సేవ చేశాడు .ఆయన నాట్య వ్యాప్తి కుటియాట్టం నుంచి అస్సాం లోని అ౦కీయ నాట్ వరకు విస్తరించింది .సంప్రదాయం అన్నిటా కొత్త వచ్చి నట్లు దర్శనమిస్తుంది అదే ఆయన ప్రత్యేకత ,నిబద్ధత .
సంస్కృత నాటక రంగాన్ని ఆధునికం చేయటం లో గొప్ప కృషి చేయటానికి పండిట్ మధురా ప్రసాద్ దీక్షిత్ తోడ్పాటు పొందాడు . అభిజ్ఞాన శాకుంతలం ,మాలవికాగ్ని మిత్రం ,ఉత్తర రామ చరితం, ముద్రా రాక్షసం వేణీ సంహారం మొదలైన సంస్కృత నాటకాలను ప్రదర్శించటం లో ఎన్నో మెళకువలు తీసుకున్నాడు .డి.ఫిల్ పొంది ,వారణాసి లోని సంపూర్ణానంద యూని వర్సిటి నుంచి ఆచార్య బిరుదు అందుకొన్నాడు .అక్కడే తబలా వాయి౦చటమూ నేర్చాడు .
ఉజ్జైన్ కాళిదాస అకాడెమి చైర్మన్ గా సమకాలీన సంస్కృత గ్రంధ వ్యాప్తికి ప్రచురణకు అద్వితీయ కృషి చేశాడు .భాస ,కాళిదాస కవుల నాటకాలను పూర్తిగా అర్ధం చేసుకొని అంకిత భావం తో వందలాది ప్రదర్శనలను చేసిన సంస్కృత నాటక పరివ్యాప్తి దీక్షా తత్పరుడు .భాసుని నాటకాల గొప్ప తనాన్ని ఆధునికులు అర్ధం చేసుకోవటానికి వీలుగా ‘’బాల చరిత్ర ‘’మొదలైన వాటిని హిందీలో రాశాడు .ప్రొఫెసర్ కమలేశ్ దత్త త్రిపాఠి నాట్య శాస్త్ర నిదిగా గుర్తింపు పొందాడు . 2006 లో సాహిత్య అకాడెమి పురస్కారం 20 07 లో భారత రాష్ట్ర పతి ప్రశంసా పత్రం అందుకొన్నాడు .2008 లో స్వామి హరిహరానంద సరస్వతి సమ్మాన్ అందుకొన్నాడు .ప్రయాగ హిందీ సాహిత్య సంమేలన్ ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు ప్రదానం చేసి గౌరవించింది .నాటక ,నాటక రంగాలలో అపార అనుభవం, వైదుష్యం ఉన్నందున కైలాస్ నాధను సంగీత నాటక అకాడెమి ఫెలో ను చేసి గౌరవించింది .
75 –మహమ్మద్ ప్రవక్త చరితను సంస్కృతం లో రాసిన –కె .ఎస్.నీల కంఠన్ ఉన్ని( 1895 -1990)
మళయాళ ,సంస్కృతాలలో ఉద్దండ పండితుడు నీలకంఠన్ ఉన్ని 1895 లో కేరళలో కొట్టాయం జిల్లా కావిల్ మదం గ్రామం లో జన్మించాడు .ఈ వంశంవారు తెక్కునూర్ రాజ వంశానికి రాజ గురువులు .స్వగ్రామం లో కన్నం పల్లి మధు ఆసాన్ వద్ద ప్రాధమిక విద్య నేర్చి ,తిరువాన్కూర్ రాయల్ సంస్కృత కాలేజి లో చదివి శాస్త్రి, మహోపాధ్యాయ డిగ్రీలు సాధించాడు .మలయాలంమున్షి గా 35 ఏళ్ళు వివిధ విద్యా సంస్థలలో పని చేశాడు .కొట్టాయం లోని ఎం డి సేమినరి హైస్కూల్ లో రిటైర్ అయ్యాడు .
ఉన్ని ఎన్నో మళయాళ గ్రంథాలు రాశాడు .దేవాలయాలు ఉత్సవ సంప్రదాయాలు ,ప్రాచీన విధానాలపై విస్తృతంగా వ్యాసాలూ రాశాడు .కాళిదాస కవి శాకుంతలం మేఘ దూతం లను మలయాళం లోకి అనువాదం చేశాడు .ఆయన కూర్చిన ‘’పంచ మహా నిఘంటు ‘’చాలా ప్రఖ్యాతమైంది .కథాకలి లో వాడే మూడు అట్టకాలు రచించాడు .
మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను సంస్కృత కావ్యం గా రాసిన ఘనత ఉన్ని ది .దీనికి ‘’విశుద్ధ నబి చరితం ‘’అని సార్ధక నామం పెట్టాడు .అయోధ్య సంస్కృత పరిషత్ ఉన్ని సంస్కృత సేవకు ‘’సాహిత్య రత్న ,విద్యా భూషణ్ బిరుదులిచ్చి సత్కరించింది .1890లో ఉన్ని 95 వ ఏట మరణించాడు .ఆయన మరణానంతరం 4-4-2011 న ఆయన సంకలం చేసిన అద్భుత గాధలను ‘’ఐతిహ్య కదాకల్ ‘’పేరిట ప్రచురించారు .ఇది కొట్టారతి సంకున్ని సంకలం చేసిన ‘’ఐతిహ్య మాల ‘’తర్వాత అంతటి ప్రాచుర్యం పొందింది .
సశేషం
ప్రపంచ కవితా దినోత్సవ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-17 –ఉయ్యూరు

