వైకింగు శకం
ఈ నాడు మనం సెల్ ఫోన్ లలో సమాచార0 , ఫోటోలు ,డాక్యుమెంట్లు ,మెసేజస్ సరఫరా చేయటానికి వాడుతున్న ”బ్లూ టూత్ ”ను స్వీడన్ చెందిన ఎరిక్సన్ కంపెనీ మొదట తయారు చేసి 19 94 లో విడుదల చేసింది .ఈ టెక్నలాజికి ఆపేరు ఎందుకొచ్చిందో తెలుసా ఆ పేరు 10 వ శతాబ్దికి చెందిన హరాల్డ్ బ్లూటూత్ బ్లాటంట్ అనే డెన్మార్క్ ను 958-987 వరకు పాలించిన వైకింగ్ రాజు ఆ దేశాభి వృద్ధికి చేసిన విశేష కృషికి గౌరవ చిహ్నంగా పెట్టటం వలన . 8 వ శతాబ్దం నుంచి 11 వ శతాబ్ది వరకు వైకింగ్ యుగం ఉన్నది ఉత్తర యూరప్ ,స్కాండి నేవియన్ చరిత్ర తో సంబంధమున్నది .స్కాండినేవియన్ ” నా ర్సే మెన్ ”సముద్ర ,నదీ మార్గాలద్వారా యూరప్ అన్వేషణలో వ్యాపారం ,దాడి ,కాలనీ స్థాపన ,రాజకీయ పాలన లతో నార్జ్ గ్రీన్ లాండ్ ,న్యూ ఫౌండ్ లాండ్ ,ఈ నాటి ఫారో ఐలాండ్స్ ,ఐస్ లాండ్ ,నార్వే,స్కాట్లాండ్ ,ఇంగ్లాన్డ్ ఐర్లాండ్ ,నెదర్ లాండ్స్ ,జర్మనీ యుక్రెయిన్ ,రష్యా టర్కీలను వశపరుచుకొని రాజ్య పాలన చేసి విశాల వైకింగ్ సామ్రాజ్యాన్ని ఏర్పరచి చరిత్రలో వైకింగ్ యుగాన్ని స్థాపించారు . మొదట్లో ఆ యా దేశాల కరెన్సీ నే వాడినా తర్వాత సొంత కరెన్సీ ప్రవేశ పెట్టారు .సముద్ర ప్రయాణం వారికి వెన్న తో పెట్టిన విద్య కావటం వారి నౌకలు పొడవుగా ప్రత్యేక తరహాలో ఉండటం ధై ర్యం సాహసమే ఊపిరిగా బాహు బలంతో బాహుబలులు అయి యెంత దూరమైనా వెళ్లి అనుకొన్నది సాధించటం వీరి లక్షణం .ముందు వ్యాపారం కాకపొతే దాడి అవసరమైతే యుద్ధం లేక రాజులతో సంధి చేసుకొని వాళ్ళిచ్చే నగలు బంగారం వెండి ఆయుధాలు దంతపు సరుకులు , రాజ్య భాగాలు తీసుకొని క్రమంగా బలపడి సత్తా చూపించారు వైకింగ్ లు .అందితే జుట్టు అందకా పొతే కాళ్ళు . దాదాపు భూమి సరిహద్దుల వరకు ప్రయాణం చేశారు . హై ఆర్కిటిక్ నుంచి పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ ద్వారా బైజాన్టిన్ కాలపు కాంస్టాన్టి నొపిల్ దాకా వాళ్ళు వెళ్లారు . ఇండియా ,పర్షియా లనుంచి సిల్క్ బట్టలు సేకరించారు బాగ్దాడ్ సమర్ఖండ్ లనుంచి వెండి దీనారాలు సంపాదించారు .వీటిని తీసుకొని స్వదేశానికి వెళ్లేవారు . చరిత్ర వాళ్ళని క్రూరులు దుస్టు లు అన్నదికాని వారు దోచుకొన్నట్లు ఎక్కడా లేదు .వారిది ఎదురుదాడి మాత్రమే వారి భూముల్ని క్రిస్టియన్ మిషనరీలు ఆక్రమించటానికి వస్తే దేశ రక్షణ కోసం చేసినవే .చార్లె మాన్ అతని తర్వాత వారు చేసిన యుద్ధాలకు వైకింగులు చేసింది ప్రతీకారం మాత్రమే .
ఇంగ్లాన్డ్ లో వైకింగ్ యుగం 8-6-793 లో నార్త్ అంబర్ లాండ్ లోని విద్యా కేంద్రం లి0డి స్ ఫారినే అనే ఆబ్బె ను ధ్వంసం చేసి ,అందులోని మాంక్స్ ను చంపి ,లేక సముద్రంలోపడేసి లేక బానిసలుగా తీసుకు వెళ్లి ,చర్చిలో ఉన్న అమూల్య సంపద చేజిక్కించుకొని ఒక కొత్త సంప్రదాయానికి దారి చూపటం తోప్రారంభమైంది . బ్రిటన్ చరిత్రలో మునుపెన్నడూ ఇంతటి విధ్వంసం జరగలేదని చరిత్రకారులన్నారు ..దీని పని సాధనకు నాలుగేళ్లుగా ఓడలతో నార్త్ అంబర్ లాండ్ లో తిష్టవేసి ఈ నాటి రెక్కీలాంటివి నిర్వహించి అదును చూసి ఆ పని చేశారు అందుకే వాళ్ళను గొర్రెల్లో దాక్కున్నా నక్క అనేవారు వైకింగ్ లది నార్త్ జర్మన్ భాష దానినే ఓల్డ్ నార్జ్ అంటారు నార్వే లో సహజ పర్వత శ్రేణులు వారికి సురక్షిత ప్రదేశాలు .ఇక్కడినుంచి ఎక్కడికి వెళ్లాలన్నా వాళ్లకు సముద్రం చాలా అందుబాటులో ఉండటం వాళ్ళ సాహస యాత్రలకు బాగా కలిసి వచ్చింది
884 లో డేనిష్ వైకింగ్ సైన్యం నార్త్ సీ దగ్గర ఆర్చిబిషప్ రొంబర్ట్ఆధ్వర్యం లోని ప్రిషియన్ సైన్యం చేతిలో ఒడి పోయారు దీనితో ఈస్ట్ ప్రిషియానుంచి వైకింగులు శాశ్వతంగా వైదొలిగారు 911 లో ఫ్రెంచ్ రాజు చార్లెస్ సింపుల్ వైకింగ్ యుద్ధ వీరనాయకుడు రోలో తో ఒక ఒడంబడిక చేసుకొని ”డ్యూక్ ”బిరుదిచ్చి నార్మాండి ని కట్టబెట్టాడు రోలో అతనితో స్నేహం గా ఉంటానని ఉత్తర భాగం ప్పై ఏ ఇతర వైకింగ్ గ్రూపులు దాడి చేయకుండా రక్షిస్తానని ఒప్పుకున్నాడు అనేక తరాల తర్వాత ఇక్కడ స్థిరపడ్డ వైకింగులు నార్మన్ భాష సంస్క్రుతులకు అలవాటై నార్మన్ లు గా మారారు . 10 66 లో ఇంగ్లా0డ్ ను గెలిచిఆంగ్లో సాక్సన్ అరిస్టోక్రాసి రాజులయ్యారు .స్కాండినేవియాలో స్కాండినేవియన్ రాజ్య పాలన ఏర్పడ్డాక వైకింగుల 1030 లో సిక్ల్ స్టాడ్ యుద్ధం లో ఓడిపోవటం తో వైకింగుల యుగ పరి సమాప్తి అయింది ఇంగ్లాన్డ్ లో నార్వేజియన్ రాజు మూడవ హరాల్డ్ -1066 లో కింగ్ హెరాల్డ్ గాడ్ విన్సన్ చేతిలో స్తాంఫోర్డ్ బ్రిడ్జి యుద్ధం లో ఓడిపోయాక ,డాబులుం ను స్ట్రాంగ్ బౌ ఆక్రమించాక ఐర్లాండ్ ,,స్కట్లాండ్ మూడవ అలెక్సాఅండర్ చేతిలో హకాన్ హాకనోర్సన్ ఓడా కా ,గాడ్విన్సన్ ను నారండి వైకింగ్ సంతతికి చెందిన ద్యూక్ విలియం ఓడించాక నా ర్స్ నుండి స్కాట్ లాండ్ దాకా 13 -15 శతాబ్దాలలో విముక్తి చెందాక పూర్తిగా ఇంగ్లాండ్ లో వైకింగుల శకం సమాప్తి అయింది .
ఒక సారి వైకింగుల ప్రతాపాన్ని చారిత్రకంగా చూద్దాం 800 లో గ్రిమూర్ కంబన్ ఫారో ఐలాండ్ లో స్థిరపడ్డ మొట్టమొదటి సె ట్లర్ . 802 లో వైకింగ్ దండ యాత్రలవలన
అయోనా మొనాస్టరీ తర్వాత స్కాట్లాండ్ ఐర్లాండ్ మొనాస్టరీలు నాశనమయ్యాయి 806 లో మూడోసారి అయోనాకు వైకింగులు వచ్చారు కానీ వారిలో 70 మంది చచ్చారు 810 లో పెద్ద డేనిష్ నౌకలుదక్షిణ డెన్మార్క్ తీరప్రాంతం ప్రిసియాపై దండెత్తాయి 827 లో గాడ్ ఫ్రెడ్ కొడుకు హారిక ది ఎల్డర్ డేనిష్ రాజుగా క్రానికల్స్ పేర్కొన్నాయి 8 35 లో థేమ్స్ ముఖద్వారం దాడికి గురైంది 836-37 లో వైకింగ్ నౌకలు బాయని ,లీఫీ లగుండా ఐర్లాండ్ చేరాయి 840 వింటర్ లో ఐర్లాండ్లో ఉండిపోయారు . డబ్లిన్ రీంరిక్ ,ఆర్కులో వాటర్ ఫోర్డ్ ,వీక్లో నగరాలను చేరారు. 841 లో వైకింగ్ నావలు ఉత్తర ఫరాన్స్ లోని సీన్ వాలీ పై దాడి చేశాయి .డబ్లిన్ లో మొదటిసారి ఉండిపోయారు 841 లో వైకింగుల డబ్లిన్ వాసం చరిత్ర కెక్కింది 844 లో ఐర్లాండ్ లోని మిడీలాండ్ మొనాస్టరీ లపై దాడి చేశారు. 845 హోరిక్ ది ఎల్డర్ 600 నౌకలతో హంబర్గ్ పై దాడి చేసి ద్వాంసం చేసి హొలీ రోమన్ ఎంపరర్ లూయీ ది జర్మన్ వైకింగుల సహాయకులైన,యుక్రెయిన్ నుంచి జర్మనీ వచ్చిన స్లావిక్ ఆటవికులపై చేసిన దాడికి , ప్రతీకారం తీర్చుకున్నాడు వైకింగ్ నాయకుడు లగ్నర్ లార్డ్ బ్రోక్ పారిస్ పై దండెత్తుతానని బెదిరిస్తే సంధి చేసుకొని 7 వేల పౌడ్ల వెండి అప్పగించాడు 848 లో బోర్డరాక్స్ వశమైంది 850-60 లో నార్వేజియన్ అయిన నద్దేడ్ ఐస్ లాండ్ లో మొదటిసారిగా కాలుపెట్టాడు . లో వెల్ష్ తీరం పై మొదటి దాడి 853 లో డబ్లిన్ కు వొలాఫ్ ఫస్ట్ మొదటి రాజై 870 వరకు పాలించాడు ..తర్వాత 1052 లోపు 20 మంది 1072-74 వరకు మళ్లీ 1091-నుంచి 10 94 వరకు వైకింగ్ రాజులపాలన సాగింది 859 లో బార్న్ ఐరన్ సైడ్ ,తమ్ముడు హాస్టీన్ లోరీ రివర్ మీదుగా 60 నౌకలతో ఫ్రాన్స్ ,స్పెయిన్ తీరాలను జిబ్రాల్టర్ జలసంధి దాటి రోన్ చేరి స్థావరాలు ఏర్పరచుకొని , ఫ్రాన్స్ ఇటలీ ఉత్త్రర ఆఫ్రికాలకు చేరి స్థిరపడ్డారు . 860 లో రూరిక్ సోదరులు తూర్పు స్వీ డన్ లోని రోసాగ్లేన్ లో స్లావ్స్ ట్రైబల్ ఫెడరేషన్ కోరికపై పరిపాలన చేశారు నోల్ఖోవ్ నదిప్రక్కన నోవ్ గోరోడ్ ను కొత్త రాజధాని చేశారు తర్వాత రోరిక్ 200 షిప్పులతో సైనికులను తెప్పించి కాన్ స్టాన్టి నొపిల్ పై దండెత్తా లనుకొన్నాడు . నార్వే లోని ,కింగ్ హెరాల్డ్ ఫ్రీర్ తండ్రి వెస్ట్ ఫోల్డ్ రాజు హాఫ్ డన్ ది బ్లాక్ ను నార్వేజియన్ రాజ్య వంశ స్థాపకుడు గా భావిస్తారు.యితడు మరణించాడు. 865 లో ”ది గ్రేట్ హీడే న్ ఆర్మీ”ఇంగ్లాండ్ లో మొదట కాలు పెట్టి తర్వాత యార్క్ లో ప్రవేశించింది. 868 లో వెస్సెక్స్ ఏదెల్ రెడ్ డేనిష్ కు చెందిన ఇవ్వార్ ది బోన్ లెస్ సైన్యం చేతిలో ఓడింది . 869 లో ఈస్ట్ ఏంజెల్స్ రాజు ఎడ్మన్డ్ హీడే న్ ఆర్మ్ చేతిలో చంపబడ్డాడు. 8 71 లో ఏడాదిపాటు వెస్సెక్స్ లో డేన్స్ తో యుద్ధం సాగింది. సాక్సన్ రాజ్యాలన్నీ వైకింగుల హీడే న్ ఆర్మీకి దాసోహం అన్నాయి ఏధెల్రెడ్ చంపబడి ఆల్ఫ్రెడ్ రాజ్యానికి వారసుడయ్యాడు 8 71 లో హాఫ్డం రంగరెస్సన్ రాజై తన పేరుమీద మొదటిసారిగా వైకింగ్ నాణాలు ముద్రించాడు . 872 లో నార్వేవైకింగ్ మొదటి రాజుగా హరాల్డ్ ఫహార్ అంటే బ్లాక్ కొడుకు అయ్యాడు . 874 లో ఐస్ లాండ్ లోఇంగోఫర్ ఆర్నర్సన్ మొదటి సెటిలర్ .రేక్జవిక్ (పొగ మేఘాలు ) అని తానె పేరుపెట్టిన చోట నివాసమేర్పరచుకున్నాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-17 -కాంప్- షార్లెట్ -అమెరికా

