వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -31
ఏకావలి లో అలంకార చర్చ
ఏకావాలి లో మరో ముఖ్య విషయం అలంకార నిర్వహణ .ఈ విషయం లో విద్యా దరుడు ,మల్లినాథుడు అత్యున్నత స్థాయి ప్రదర్శన చేశారు . పూర్వ ఆలంకారికుల విధానాన్ని అనుసరించి ,తమ వ్యాఖ్యానాలను జోడించారు .మల్లినాథుడు అలంకారాలతో ఉండే పోలికలను ఒక సామాన్య సిద్ధాంతాన్ననుసరించి వివరించాడు . ఇదే మల్లినాథుని ”తరల ”వ్యాఖ్యానం లో ప్రత్యేకత అందువలన అసలు ఏకావాలి లో ఉన్న వాటిని బహిర్గతం చేయటం సులువైంది . 5 వ ఉన్మేషం అంతా అలంకార చర్చకే కేటాయించాడు సూరి . కొన్ని అలంకారాలపై మల్లినాథుని అభిప్రాయాలేమిటో తెలుసుకొందాం .
కొన్ని అలంకారాలు ఆధారం లక్షణం
విద్యాధర ,మల్లినాధులిద్దరూ కొన్ని అలంకారాలు కొన్ని రకాల లక్షణాలపై ఆధార పడ్డాయని చెప్పి ,వివరించారు .దీనినేలాల్యే పండితుడు ఒక పట్టికలో పొందు పరచాడు .
లక్షణం ఉదాహరణ అలంకారానికి మూలం
1-జగత్స వార్యా సురధీర్ఘి కా అతిశయ పావనాపాది అప్రస్తుత ప్రశంస
2-విపరీత కిమివ నాపకృత మనేన వ్యాజ స్తుతి
3-అజహత్స్వార్యా కావ్యాదయహ -విదుషో లక్ష య0తి సమాసోక్త్యాది
ఉత్ప్రాదాన లక్షణ
-4-జహ దజ హాత్సవర్యా – వారణేంద్రస్య దేశకాల విశిష్టహ సమాసోక్త్యాది
త్వ మధునా నాస్తి
5-సారొపా అగ్నిర్మాణ వాకః
1- గౌణి
2- శుద్ధా ఉపచారవతీ ,ఉపచారః ,విద్యా విధి
కార్య కారణా భావః తాదాభ్యామ్ రూపకాది
శుద్ధా – యధా ఇంద్రార్ధ స్యూ ణాఇంద్రహ
స్వస్వామి భావా లక్షణా సంబంధః
6-సాధ్య వసనా విషయం నిర్జీణౌ విషయహ
6-సాధ్య వసనా విషయం నిర్జీణౌ విషయహ
1-గౌణి అయం పరిజాతః అతిశయోక్తి
2-శుద్ధా ఆయమానందః
మల్లినాథుని భావనలో ఆ రెండు అనుబంధాలు ఆరోప ,అధ్యారోపాల వలన భిన్నమైనవి ”సారొపా సాధ్యాయ వసనా శుద్ధాస్ ”ల మధ్య భేదం కూడా అలాంటిదే కారణం సంబంధం ,పోలిక .విద్యాధరుడు 7 లక్షణాలను కావ్యప్రకాశ లోని 6 లక్షణాలకు బదులు గా చెప్పాడు .జహదాది లో 3 రకాలు ,సారోపాధ్య వాసనం లో 4 రకాలు -2 గౌణాలు 2 శుద్ధాలు చెప్పాడు .అవి ఒకదానితో ఒకటి కలిసి మిళితమై ప్రాధమికంగా ,,ఆధీనకంగా సంబంధాలను తెలియ జేస్తాయి
విద్యాధరుడు ఏకావాలి 5 వ ఉన్మేషం లో గుణాలు ,అలంకారాల పనేమిటో వివరించాడు . గుణాలు తీపి లాంటివని మనోభావాలకు పూర్వ లక్షణాలకు లోబడి ఆ మనో భావ ఉత్కృష్టత ను వ్యక్త పరుస్తాయి .అలంకారాలు కవిత్వం లో పదం అర్ధాలు సంబంధం తో ఉత్కృష్టత ను వివరిస్తాయి . వాటిలోనే ఉండి కలయికలో మనో భావాలను ద్రవీ భూతం చేస్తాయి .ఏకావాలి లోని ఒక విషయం పై వ్యాఖ్యానిస్తూ మల్లినాథ సూరి అనుమానం వ్యక్తబరచి దాన్ని చర్చతో నివృత్తి చేస్తాడు కొందరు గుణాలు ఉత్కృష్టత కలిగిస్తాయని అంటే ,అలంకారాలతో కలిసి ఆ స్థాయి తెస్తాయి అంటూ మల్లినాథుడు –
”కావ్యాత్మ రస సమావేతా స్తుదుక్త ర్ష వేతవే ధర్మా గుణః -కావ్యా0గ సంయుక్త స్తదుక్త
ర్శ హేతవోలంకార ఇతి భేద ఇత్యర్ధహ్ ”అంటూ అంగిరసమా వేతా గుణాః ఆంగే స్సంయుక్త స్త్వలంకారా ఇత్యుక్తమ్ ”అన్నాడు .. దీని తర్వాత ఏకావాలి లో కొన్ని అలంకారాలను వాటిపై మల్లినాథుని భావాలను తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

