ఘోరకలి -2

ఘోరకలి  -2

        మరో మృత్యుద్వారం -ఘెట్టో
నాజీ యుద్ధ తంత్రం యూరప్ అంతా మోహరించి జ్యుస్ ను అందరి లోనుంచి  వేరు చేయటం ప్రారంభించింది . వాళ్ళను తేలికగా గుర్తు పెట్టె వీలుగా జ్యులు ఎందరో ”ఎల్లో జ్యుఇష్ స్టార్ ”లను ధరించాలని ఆదేశించింది .వాళ్ళ ఐడెంటిటీ పేపర్లలో పెద్ద అక్షరం తో  ”j”ఉండేట్లు చేసింది వాళ్ళందరూ ప్రత్యేక నివేశన స్థలాలలోనే ఉండాలని శాసించింది .ఇవే ”ఘెట్టోలు ”.ఈ పనిని తాము ఆక్రమించుకున్న దేశాలనుంచి ముందుగా ప్రారంభించింది .వీటికోసం బాగా మురికి వాడలను ఎంపిక చేసింది దాని చుట్టూ గోడకాని బార్బెడ్ వైర్ ఫెన్స్ కానీ ఏర్పరచి ,,మైళ్ళ దూరాలలో ఉన్న జ్యు లను కాలినడకన నడిపించి ఇందులో పడేయించింది .అక్కడ అందరూ కిక్కిరిసిన గదులలో గాలి వెలుతురూ లేక సరైన మరుగుదొడ్లు లేక నీచ నికృష్ట జీవితం గడిపేట్లు చేసి అంటువ్యాధులు ప్రబలటానికి దోహదం చేసింది .చాలామంది టైఫాయిడ్ క్షయలతో బాధపడి చనిపోయారు .బొచ్చెలో ఇంత చాలీ చాలని రేషన్ కూడు పడేసి చావ లేక బతకా లేక త్రిశంకు స్వర్గం లో వేలాడేట్లు చేసింది ..డబ్బున్నవాళ్ళు ఇళ్ల నో  స్థలాలలో అమ్మి కానీ తనఖా పెట్టికానీ డబ్బు పొంది బయటినుంచి కావలసిన తిండి తెప్పించుకొనేవారు ..ఘెట్టో లో బతకాలీ  అంటే నాజీలు చెప్పిన ఏదో పని చేసిబతకాలి అదొక్కటే మార్గం ఇదీ బానిస బతుకే . విపరీతమైన ఎండా వానా చలి లో ఆడవ  చాకిరీ చేసి ,ఒళ్ళంతా గుల్ల చేసుకొని బతికారుపాపం .దీనితో నీరసం వచ్చి జబ్బులపాలయ్యేవారు .అక్కడ వాళ్లకు ఏమైందో తెలియదుకాని ఈ ఘెట్టోలనుంచి బతికి బయటపడిన వారు కనిపించనే లేదు .
          ఇంకో చావు తెలివి -ఆపరేషన్ బార్బరోస్సా
1941 స్ప్రింగ్ కాలం లో నియంత హిట్లర్ ”ఆపరేషన్ బార్బరోస్సా ”ప్రారంభించి సోవియట్ యూనియన్ పై దాడి చేశాడు .స్టాలిన్ తో అంతకు ముందు చేసుకున్న ఒడంబడికను గాలికొదిలేశారు హిట్లర్ ..ఇప్పుడుకూడా అతని సై నికాధికారులు వద్దనే వారించారు .ఇలా చేస్తే జర్మనీ సైన్యం చాలా చోట్ల మోహరించాల్సి వస్తుందని దానితో సైనిక పాటవం బలహీనమవుతుందని హెచ్చరించారు . రాజు కంటే మోండివాడు గొప్ప అన్నట్లు రాజూ చక్రవర్తి నియంత ఫురోర్ అయిన సర్వాధికారాలు చేతిలో ఉన్నహిట్లర్ మొండోడి కంటే గొప్పవాడై వాళ్ళమాట పట్టించుకోలేదు రుడాల్ఫ్ హెస్ కూడా వద్దన్నాడు .హిట్లర్ అతడిని విజయానికి తోడ్పడమన్నాడు .ఇంగ్లా0డ్ తో ఉన్న ఒప్పందం ప్రకారం పడమర భాగాలను అది కాపాడుతుందని తూర్పు వైపు జర్మన్ దాడికి ఇంగ్లాన్డ్ సహకరిస్తుందని నచ్చ చెప్పాడు .ఈ పని తానే  చేయాలని హెస్  రహస్యంగా పారాచూట్ లో ఇంగ్లాన్డ్ వెళ్లగా అతడు మానసికంగా బలహీనుడని భావించి జైల్లో పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం .జర్మనీ కి ఎంతో సేవ చేసి హిట్లర్ కు కుడిభుజంగా ఉన్న హెస్ ను హిట్లర్ తో నాజీలందరూ దేశద్రోహి అనే ముద్రవేసి అవహేళన చేసి అవమానించారు .అతడు చేసిన మంచి అంతా గాలిలో కలిసిపోయింది ..
  1941 జూన్ 22 న జర్మన్ సైన్యం రష్యా సరిహద్దులు దాటి లోపలి ప్రవేశించింది దీనితో ఆపరేషన్ బార్బరోస్సా ప్రారంభమైంది .వెంటనే స్టాలిన్ జర్మనీపై యుద్ధం ప్రకటించి కూటమిలో చేరాడు ..యుద్ధం లో రష్యా తో తలపడటమే కాదు హిట్లర్ మనసులో మరో ముఖ్య ఆలోచనా సుళ్ళు తిరుగుతోంది .బార్బరోస్సా నెపం తో జ్యుల సమస్యను పరిష్కరించాలని భావించాడు .కొన్ని యూనిట్లు ”Einsatzgruppen ”పేరుతొ సైన్యం వెంట వెళ్లాయి .ఈ యూనిట్లది  ఒకటే లక్ష్యం -జ్యులను ,పనికి మాలిన ,అక్కర లేని వాళ్ళను చంపేయటం . సరైన లక్ష్య నిర్దేశం తో ఈ యమభట యూనిట్లు  సామూహిక మరణాలను పకడ్బందీ గా చేసేశాయి .సెప్టెంబర్ 29 30 తేదీలలో యుక్రెయిన్ లోని ”బాబ యార్రవైన్  ”లో అత్యధిక సంఖ్యలో యూదులను ఊచ కోత  కోసేశారు ”Einsatzgruppen ”యూనిట్లు వేలాది యూదులను చుట్టు ముట్టి రవైన్ కుఅంటే లోయలోకి  ”తోలుకు ”వెళ్లారు . ఈ మృత్యు  దళాలన్నీ ఒకే రకంగా పని చేశాయి .ముందుగా జ్యుల  బట్టలు బలవంతంగా  విప్పించేశారు నగ్నం గా చేస్తే సిగ్గుతో ఎదురు తిరిగే ధైర్యం రాదనీ నాజీలనమ్మకం . ఆ బట్టల్ని రీచ్ లో కావాల్సినవారికి అమ్మేశారు .  ఈ ఘోరకలి ని చూసిన ఒక ప్రత్యక్ష సాఖికధనం -”లోయలో అడుగున అప్పటికే చంపబడిన జ్యు ల శరీరాలపై  అంటే శవాల గుట్టలపై  వీళ్ళను అతి వేగం గా పడుకో బెట్టారు .మార్క్ మాన్ వచ్చి ప్రతి జ్యు ను మెడపై పిస్టల్ తో కాల్చాడు .అతడు చావగానే మరో జ్యు ను ఆతర్వాత ఇంకో జ్యు ను నిరాటంకంగా వరుసబెట్టి కాల్చి చంపుతూనే ఉన్నాడు  .ఆడ ,మొగా పిల్లా జెల్లా అనే విచక్షణే లేదు .పసిపిల్లని తల్లి చంకలో ఎత్తుకొనేట్లు చేసి దారుణంగా చంపారు ఆ నికృష్టులు ”అని చెప్పాడు ..ఈ రెండు రోజుల్లో మృత్యుదళాలు 33,771 మంది యూదులను  చంపేశారు .బాబీ యార్ లోయ అంతా జ్యు ల మృత్యు కళేబరాలతో నిండి పోయింది .
   తర్వాత గాస్ చేంబర్లున్న మొబైల్ వాన్ లలో కూర్చోబెట్టి చంపారు వాన్లలో జ్యు లను కోళ్లను కుక్కినట్లు కుక్కి దాని డోర్ కు తాళం పేట్టి సీలు వేసి కార్బన్ మోనాక్సయిడ్ విషవాయువును వాన్ లోకి వదిలి అందరూ చచ్చే దాకా కాపలా కాశారు .ఇదో మృత్యుహేల పైశాచికానందం . ఈ మృత్యు యూనిట్లు రోజుకు ఒక లక్షమందిని చంపారంటే ముక్కున వేలేసుకొంటాం .నిజమే ఆ చావు  వాసన భరించలేక. .ఈ వేగం చాలలేదట మహా నియంత హిట్లర్ కు .. 1941  వేసవిలో ”యూరప్ లో ఉన్న జ్యు  కమ్యూనిటీ నంతా సంపూర్ణంగా అంతమొందించాలి ”అని హిట్లర్ తన అరమీసాలపై చెయ్యేసి శపథం చేశాడు .  కనుక ఇది అమలు చేయటానికి మరొక నరాంతక కీచక మార్గాన్ని అవలంబించాలని పధకం పన్నాడు . అతడి బుర్ర డెవిల్స్ వర్క్ షాప్ అయింది .
                      తుది  పరిష్కారం
 జ్యు  సమస్యకు అంతిమ పరిష్కారం కోసం ప్రణాళిక రీన్ హార్డ్ హెర్డ్రిచ్ కు హిట్లర్ అప్పగించాడు . 1942 జనవరి 20 న బెర్లిన్ పరిసరాల్లో ఉన్న వాన్నెసీ లో జరిగే మీటింగ్ లో దాన్ని హిట్లర్ ముందుంచాడు .ఈ పధకం ప్రకారం జ్యు లనందర్నీ సమావేశపరచటం ,వాళ్లకు ప్రయాణ సౌకర్యం కలిపించి రైళ్లలో ఎక్కించటం అక్కడినుంచి సమూల దుంపనాశనం చేసే కాంప్ (ఎక్స్టె ర్మి నేషన్ కాంప్ )లకు తరలించడం అక్కడ సామూహిక నరకం లోకి తోసెయ్యటం ఇందులో దశలవారీ పధ్ధతి .ఆ కాంప్ లు ప్రత్యేకంగా వేలాది మందిని అతి తక్కువ కాలం లో కిక్కురుమనకుండా ,పకడ్బందీగా  అత్యంత నైపుణ్య సామర్ధ్యాలతో చంపటానికి వీలుగా తయారు చేయించారు .చావు తెలివి తేటలంటే ఇవే మరి . ఇలాంటి మృత్యుకుహరాలను నాలుగు చెల్మ్నో ,బెలీజెక్ ,ట్రెబ్లింకా  శోబిబోర్ లలో ఏర్పాటు చేశారు.రెండు కాన్సంట్రేషన్ కాంప్ Auschwitz ,Majdanek లను కిల్లింగ్ సెంటర్లుగా మార్చారు ..ఇవి మనం చెప్పుకున్న ఏదనేషియా అంటే మెర్సీ కిల్లింగ్ సెంటర్ లను పోలినవే .ఇవన్నీ భయంకర అత్యంత మరణ సామర్ధ్యమున్న చావు కేంద్రాలే .షవర్ బాత్ లులాగా అనిపించే విషపు గ్యాస్ చేంబర్లు  శవదహనం క్షణాలమీద చేసే అతి విశాల దహన వేదికలతో భూలోక నరకాలుగా ఆఘ మేఘాలమీద తయారు చేయించారు .
   వాన్నెస్సే కాన్ఫరెన్స్ అయినఏడాదికే సోవియట్ యూనియన్ జర్మనీని తూ ర్పుయుద్ధం లో  చావు దెబ్బ తీసింది  2.-2-19 42 న  91 వేల  జర్మన్ సైన్యం స్టాలిన్గ్రాడ్ లో లొంగిపోయింది .అసలు 2,85 000 మందిలో యుద్ధం లో బతికినవాళ్లు వీళ్ళే. అత్యంత విశాల థర్డ్ రీచ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేద్దామనుకున్న నరరూప రాక్షస హిట్లర్ కు  ఈ అవమానం  అశనిఘాతమే అయింది  . యుద్ధం లో చావుదెబ్బతిన్నా జర్మన్ సైన్యం ,ఎస్ ఎస్ వాలంటీర్లు తుది పరిష్కారానికి పని చేస్తూనే ఉన్నారు .చావు రైళ్లు పరుగెత్తుతూనే ఉన్నాయి వేలాది మంది జ్యు లు తరలింపబడుతూనే ఉన్నారు ,గాస్ చేంబర్లు శవదహన వాటికలు ఇరవై నాలుగు గంటలూ పని చేస్తూ జ్యు హననం చేస్తూనే ఉన్నాయి .కాంపులలోని పెద్దపెద్ద ఇటుక చిమ్నీలనుంచి శవాల బూడిద ,పొగా  గాలిలోకి నిరంతరం చేరుతూ కారుకంపు కొడుతూనే ఉంది .ఈ ఫైనల్ సోల్యూ షన్ పితామహుడైన రీన్హర్ హి డ్రిచ్ ను జేక్ అభిమానులు పట్టుకొని చంపేసి పరిష్కారకర్త  జీవితాన్ని అనంత వాయువులోకలిపి పరిష్కరించారు ఎవడు తీసుకున్న గోతిలో వాడు పడటం సహజమే దీన్ని క్రూర ప్రతీకారం అన్నది జర్మన్ ఏ ఎస్ దళం .ఈ తుదిపరిష్కారాన్నే ”ఆపరేషన్ రీన్ హార్డ్ ”అన్నారు . రీన్ హార్డ్ హేడ్రిచ్  హత్యకు  ప్రతీకారం గా ఎస్ ఎస్ దళాలు 13 వందలమంది జేక్ లను విచక్షణా రహితంగా చంపేసి  లిడికో అనే చిన్న పట్టణాన్ని ధ్వంసం చేసి నేల మట్టం చేశారు.బెర్లిన్ లో 152 మంది జ్యు లను ఉరితీసి 3 వేలమంది జ్యు లను కాన్సెన్ట్రేషన్ కాంప్ లనుంచి పోలాండ్ లోని హనన కేంద్రాలకు తరలించారు
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2
ఇన్‌లైన్ చిత్రం 3ఇన్‌లైన్ చిత్రం 4ఇన్‌లైన్ చిత్రం 5
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.