వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -33
— ఏకావాలి లో అలంకార చర్చ
అతిశయోక్తి అలంకారం -అతిశయోక్తి అలంకారం ఉత్ప్రేక్షను పోలి ఉంటుంది కనుక మల్లినాథుడు దీని గురించి చర్చించే ముందు ఆసక్యికలిగించే చిరు ఉపోద్ఘాతం రాశాడు.-”తదేవ మధ్యవసాయ ప్రధానోత్ప్రేక్షామ్ లక్షయిత్వా -సంప్రత్య ధ్యవసితం ప్రాధాన్యేనాతిశయోక్తి0 విభాగ పూర్వ కమాహ ”
ఆద్యావసతి అంటే అధ్యవసాయ .అది సాధన స్థితిలో ఉంటె అప్పుడు అతిశయోక్తిలో మొదటి రకం అవుతుంది ..కానీ ఉత్ప్రేక్ష అధ్యావసాయాలో సాధ్య రకం పై ఆధార పడి ఉంటుంది .ఉత్ప్రేక్ష సాధ్యవత్వం ,విషయం ల కు సంబంధం కలిగి ఉంటుంది .కానీ అతిశయోక్తి సిద్టత్వ ,విషయాంగిర్ణత్వ లతో సంబంధం కలిగి ఉంటుంది .అతిశయోక్తిలో అధ్యావసిత సిధత్వం అంటే సంబంధం తేడా లేక పోవటం వలన అంటే వస్తువు వేరొకటి కాకపోవటం వలన ఉంటుంది .తేడా ఏమిటి అంటే తేడా లేకపోవటమే . విద్యాధరుని గ్రంధం ఏకావాలి లో అతిశయోక్తి నాలుగు రకాలని చెప్పాడు .మల్లినాథుడు మాత్రం మమ్మటుడు చెప్పిన నాలుగు అతిశయోక్తుల్ని వ్యతిరేకించాడు .మమ్మటుని అతిశయోక్తులు -1-భేదం లో భేదం లేక పోవటం 2-భేదం లేకపోవటం లో తేడా ఉండటం 3-వేరొక అసాధ్యమైన అర్ధం ”యది” మొదలైనచిన్నభాగాలతో (పార్టికిల్ ) తెలియజేయటం 4-ఫలితం కారణం ల క్రమం అతిక్రమించటం
ఇక్కడ మల్లినాథుడు సంబంధ అసంబంద0 ల నాధారంగా రకాలు చెప్పాడు .ఆ వైవిధ్యాన్ని ఒప్పుకోకపోతే ఆ రెండూ వేరు అవ్వాలి లేక రకాలలో కలిసి పోయి ఉండాలి అన్నాడు .అందులో మొదటిది ప్రత్యేక విలక్షణత ఉండటం వలన సమర్ధించ సాధ్యంకాదు .రెండవ ప్రత్యామ్నాయం కూడా సమర్ధింపబడదు కారణం ఇందులో భేద పరచే విషయం చెప్పబడక పోవటమే .ఇక మూడవ రకానికి వస్తే మమ్మటుడికే అనుమానాస్పదంగా ఉంది కనుక మొదటి రెండు ఒప్పుకోదగ్గవి కావు .నాలుగవ దానికి అసలు అవకాశమే లేదు -”పుష్పం ప్రవాలోపహితం యది స్యాన్ -ముక్తాఫలం వాస్ఫుటా విద్రు మాస్యాం-తతో నుకుర్యా ద్విపదస్య తస్యా – స్తా మ్రొష్ట పర్యస్త రుచం స్మితస్య ”
మొదటిది సంబంధం లేని దానిలో సంబంధంఉందని చెప్పే ఉదాహరణ .ఇక్కడ ‘ పుష్పం ,ముత్యం లమధ్య ఏరకమైన సంబంధం లేక పోయినా ”యది” అనేదాని వల్ల సంబంధ అవకాశం ఉందేమో నని పిస్తుంది .రెండవ ఉదాహరణలో అభేదాలలో ఉన్న భేదాల రకాలు తెలియ జేస్తుంది ..స0బంధ రాహిత్యం ఏదో ఒక భావం వలన ఉందనిపించటం. దీన్ని పండితులే తేల్చి చెప్పాలి .కనుక మల్లినాథుడు ఐదురకాల అతిశయోక్తులను సమర్ధించాడు అయితే ఇందులో సామాన్యం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది దీనికి అలంకార సర్వస్వ కర్త సమాధానం చెప్పాడు -”అధ్యావసిత ప్రాధాన్యే అతిశయోక్తిహ్ ఇతి సర్వస్వ కారో క్త మేవేతి బృమః ”
దీపకాలంకారం -దీన్ని చాలా స్పష్టంగా మల్లినాథుడు వర్ణించి చెప్పాడు .-”యథావా లోకే దేవా సమీపే స్థాపితస్య దీపస్య -కుంభా స్తంభా ధ్రుప లంభో పకారక త్వం త ధాయ మప్యేకత్ర స్థితం సర్వం -దీపకాతీతి దీపక ముచ్యత ఇత్యర్ధహ ”
ప్రాయాజా అనేది జంతువుకు అర్ధం అయినా త్యాగానికి కూడా అర్ధంగా ఉండి ,దేవుని దగ్గర పెట్టిన దీపం దూరానికి కూడా కాంతిని ప్రసరింప జేసినట్లు దారిలోని అన్నివస్తువులను కాంతి వంతమ్ చేసినట్లు దీపక అలంకారం సార్ధకమైంది దీపకం లో ఒకటికాని ఎక్కువ సంబంధిత వస్తువులు ఒక గుణం తో కలపబడి ఉంటా యి .తుల్య యోగితలో అన్ని వస్తువులు సంబంధం కలిగికాని సంబంధం లేకుండాకాని ఉంటాయి .
శ్లేషాలంకారం -మల్లినాథుడు శ్లేషను ”పదం లో సామ్యత ఉండి అది వస్తువుకు విశేషణానికి సంబంధం కలిగి ఉంటె శ్లేష ”అన్నాడు .కనుక ఇది శబ్దాలంకారం .విద్యాధరుడు ,మల్లినాథుడు ఇద్దరూ కూడా శ్లేషకు ,శబ్ద శక్తి మూల ధ్వనికి ఉన్న భేదాన్ని వివరించారు .రెండింటిలోనూ వస్తువు విశేషణం లలో రెండు అర్ధాలు ఉంటాయి కానీ శ్లేషలో ఆ రెండు సంబంధం కలిగికాని లేకుండాకాని ఉంటాయి .అక్కడ పదానికున్న భావం సందర్భాన్ని బట్టి కప్పేస్తుంది కానీ వేరొక సందర్భం లేని అర్ధాన్ని సంబంధ మున్నా అర్ధం తర్వాత సూచిస్తుంది .సందర్భం లేనిదాన్ని రెండర్ధాలమాటవలన గ్రహించాలి .శబ్ద శ్లేషలో సంబధం ఉన్నది లేనిది రెండూకూడా బంకా ,కర్రా లాగా అతుక్కు పోయి ఉంటాయి అర్ధ శ్లేష లో అవి రెండుఒకే కొమ్మకున్న రెండు పళ్ళు లాగా ఉంటుంది . ”యత్రప్రయత్న స్వరాది భేదా ద్రవస్తుతో భిన్నయోరేవ శబ్దయెహ్ మిథః సంశ్లేష భేదత్వాతు -కాష్ఠవదే కట్వేనావభాసః శబ్ద శ్లేష ఇత్యర్ధహ-తత్రైక వృ0త ఫలద్వయ పద ఖండేక శబ్దే అర్ధ ద్వయ శ్లేష సార్ధ శ్లేషహ ఇత్యర్ధహ ”
అప్రస్తుత ప్రశంస -ఇందులో సంబంధం లేని అప్రస్తుతం చెప్పబడి ప్రకృతం సూచింపబడుతుంది ప్రశంస అనే దాని అర్ధం పొగడటం కాదు చెప్పటం లేక వర్ణించటం -”యత్రసారూప్యాది సంబంధత్రమా వశేనా ప్రస్తుత కధనాత్ ప్రస్తుతం గమ్యతే సాప్రస్తుత ప్రశంసయ్యుత్యర్ధహ్ ” అని మల్లినాథుని నిర్వ చనం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

