వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -34
ఏకావాలి లో అలంకార చర్చ
సమాసోక్తి అలంకారం -ఒకే పదం రెండు విషయాలను తెలియ జేయటమే సమాసోక్తి అలంకారం .ఇందులో సంబద్ధమైనది తెలియ జేయబడి అసంబద్ధమైనది సూచింపబడుతుంది .ఇతరమైనదేదోదాని గుణం ఆపాదింపబడుతుంది -”విశేషణ సామ్య మాత్ర గమ్యత్వేన రూప సమారోపా యోగాదం ప్రస్తుతస్య విషయం వాంఛే దకత్వ మాత్రం నతు తాదాత్మ్యే నావ చ్చేదకత్వమేవేతి సర్వాలంఘ రో త్తీ ర్ణేయం సమాసోక్తి రిత్యర్ధహ్ ”
అసంబద్ధమైన దాని ప్రవర్తన ”అప్రకృత0 ”కప్పి వేయబడి లేక సంబద్ధమైనది ప్రకృతం పనిలో పోలికవలన కానీ ,లేక విశేషణాలవలనకాని కప్పబడుతుంది .రూపక ,ఉపమా సమాసోక్తి ల మధ్య విచక్షణత ఒక్కోసారి తెలియ బడుతుంది మల్లినాథుడి భావనలో మొదటి రెండు కలయికలో రూపకం బలీయంగాను ,చివరి రెండిటికలయికలో సమాసోక్తి బలీయం గాను ఉంటుంది -”ఏవం సమాసోక్త్యే క దేశా వివర్తి రూపకాయోహ్ సమావేశే రూపకం బలీయ ఇత్యుక్తమ్ .-ఉపమా సమాసోక్తి సమవాయే తు సమాసోక్తి రేవ బలీద సీతి ”
”ఏకా దేశ వివర్తి రూపకం ”అనేది ఒక విషయం చూపబడి ,చూపే బడిన దానితో సాక్ష్యాధార పోలిక కనిపించకపోతే ఏర్పడుతుంది సూచింప బడిన రూపకాన్ని మరో చోట ఉన్న వర్ణనతో అక్కడ శబ్దాలతో చెప్పబడక పోయినా మనం గుర్తించాలీ .ఉపమాలంకారం లో ఒకదానికొకటి పోలిక బంధింపడి గ్రహించే వీలుంటుంది .కానీ సమాసోక్తిలో ఒక దాని ప్రవర్తన మరొకదానిలో ఆపాదింపబడుతుంది .అసంబద్ధమైన దానిలో సంబద్ధమైన దాని ప్రవర్తన ఆపాదింపబడుతుందని భావం కానీ సంబద్ధమైన దానిపై అసంబద్ధమైన దాని ప్రవర్తన ఆచ్చాదింపబడదు
విరోధాలంకారం -రెండు విషయాలలో వ్యతిరేకత స్పష్టంగా ఉంటే అది విరోధాలంకారం .రెండు విషయాలలో సామాన్యత ,గుణం ,క్రియ ,పదార్ధం లలో వ్యతిరేకత కనిపిస్తున్నా ఒకటిగానే ఉండాలి ‘–యత్ర ధర్మయోహ్ సమానాధికరణ్య నిబ0ధో విరోధః స్ఫు రతి తత్ర విరోధాలంకారః -యత్ర తు వైయాది కరుణ్యనిబంధనో విరోధస్తత్రా సన్మత్యాది రిత్యర్ధహ”
అర్ధాంతరన్యాసాలంకారం -ఏకావాలి లో ఒక ప్రత్యేక అసంబద్ధ ప్రతిపాదన మరొక సామాన్య ప్రతిపాదన తో సమర్ధింపబడినప్పుడుకానీ సాధారణాన్ని విశేషణం తోకాని సమర్ధించి చెప్పటాన్ని అర్ధాంతర న్యాసం అవుతుందని చెప్పాడు .మామూలు భాషలో సామాన్యాన్ని విశేషం తోకాని విశేషణాన్నిసామాన్యం తో కానీ సమర్ధించి చెప్పటం అన్నమాట .”యత్ర ప్రస్తుతస్య సామాన్య విశేషస్య ,వా పూర్వ పంచాద్వా నిర్దిష్టస్య తదితరేణ సమర్ధన మర్దాన్తరన్యాస ఇత్యర్ధహ్ ”
మల్లినాథుడు సామాన్యానికి ,అనుమితి (ఇన్ఫరెన్స్ )కు ఉన్న విలక్షణత ను (డిస్టింక్షన్ )గుర్తించాడు ఆయన పద్ధతిలో ఈ అలంకారం అనుమితి తో భేదిస్తుంది .ఒక నిర్దిష్ట విషయం సూచింపబడిన వ్యాప్తి ద్వారా తెలియబడుతుంది -”ఆప్రతీత ప్రత్యాయన మనుమానే ,ప్రతీతస్య సమర్ధన మత్రేతి భేద ఇత్యర్ధహ్ ”అన్నాడు మల్లినాథ సూరి .
సశేషం
నృసింహ జయంతి శుభాకాంక్షలతో
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-9-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా
—

