గొల్లపూడి

గొల్లపూడి

అమెరికా వచ్చి నెలదాటినా యూ ట్యూబ్ లో కామెడీ సీన్లు ,ఫన్   బకెట్ లు తప్ప పెద్దగా రాత్రిపూట చూసినవేవీ లేవు . ”బలి ”కి బలైన మర్నాడు ఫ్రస్ట్రేటెడ్  ఉమన్ చూస్తుండగా  ఒక్కసారిగా  దృష్టి  వేరేవాటిపై పడితే ఆకెళ్ళ రాసి దర్శకత్వం చేసిన ”అల్లసానిపెద్దన”పద్యనాటకం కంటబడి వెంటనే చూశా .చాలా అద్భుతమనిపించి ”బలి ” పాల బడిన నాకు గొప్ప రిలీఫ్ ఇచ్చింది  మనసు  ఆనంద  తాండవమే చేసింది .తర్వాత ఆకెళ్ళ తో ఇంటర్వ్యూ చూశా .ఆయనలో ఎంత నిజాయితీ నిక్కచ్చితనం ఉందో  అర్ధమయింది . ఆయన శ్రీనాధ నాటకం కోసం వెతికా దొరకలేదు . మొన్నరాత్రి మా అమ్మాయి గొల్లపూడి ఇంటర్వ్యూ చూశావా అని అడిగింది .చూడలేదన్నాను చూడమంది . ఉయ్యూరులో ఉండగా ఎప్పుడూ ఇలాంటి వాటి జోలికి పోలేదు .రాత  ,చదువు తో సరిపోయేది . మా అబ్బాయి రమణ గొల్లపూడి కాలం పెట్టి వినేవాడు ఏదో ఒకటి రెండు సార్లు అటూ ఇటూ  వెడుతూ విన్నానేమోకాని పెద్దగా దృష్టిపెట్టలేదు .
అయితే మారుతీరావు తో సుమారు ఏడెనిమిదేళ్లు గా పరిచయం ఉంది .ఆయన రచనలు నటన  నాకూ మా శ్రీమతికి బాగా ఇష్టం . ఆయన ”రోమన్ హాలిడే” కథా  సంపుటి నాకు పిచ్చపిచ్చగా నచ్చి సుమారు 15 ఏళ్ళక్రితం 45 పేజీల వ్యాసం రాశాను నాకోసమే . తర్వాత మద్రాస్ లో ఉండే మా బంధువు శ్రీ నోరి రామకృష్ణయ్య గారితో పరిచయం వలన ఫోన్ సంభాషణలవల్లా ఆయన మారుతీ రావు తనకు మార్కింగ్ వాక్ మేట్ అని రోజూ కలుస్తామని చెప్పేవారు .నేను  రాసిన ఈ వ్యాసాన్ని ఫోటోస్టాట్ తీసి రామకృష్ణయ్యగారికి పోస్ట్ లో పంపించి ఆయనకు నచ్చితే మారుతీ రావు కు ఇమ్మని రాశా .ఆయన  చదివి బాగా నచ్చిందని గొల్లపూడి ఇచ్చానని ఆయన చదివి చాలా సంతోషించాడని ఫోన్ లో చెప్పి , మారుతీరావ్ ఫోన్ చేసి నాతో మాట్లాడు తాడు అని చెప్పారు .అన్నట్లే ఒక రోజు ఉదయమే గొల్లపూడి ఫోన్ చేసి చాలా ఆప్యాయంగా నాతో మా శ్రీమతితో మాట్లాడాడు . అందరికీ గర్వంగా చెప్పుకున్నాం .తర్వాత నేను ఆ స్క్రిప్ట్ ను  సరసభారతి బ్లాగ్ లో రాశా . ఆయన దాన్ని సి డి చేయించి పంపమంటే పంపాను .నా మెయిల్స్ కూడా పంపేవాడిని అప్పుడప్పుడు సమాధానం రాసేవాడు సరస భారతి పుస్తకాలు ప్రచురించటం ప్రారంభించాక రామ కృష్ణయ్యగారితో మరోకాపీ ని గొల్లపూడి ఇమ్మని నా సంతకం తో పంపేవాడిని ఆయన జాగ్రత్తగా అన్నీ అంద  జేసినట్లు ఫోన్ చేసేవారు .  తర్వాత రావు విశాఖ కు మకాం మార్చినట్లు కృష్ణయ్యగారు చెప్పారు అక్కడికే పుస్తకం ఆవిష్కరణ అవగానే పంపేవాడిని .
  బహుశా 2015 మార్చి లో ననుకొంటా మారుతీరావు ఒక సాయంత్రం ఫోన్ చేసి ”నిన్ననే మద్రాస్ లో   రామకృష్ణయ్య గారితో  మాట్లాడి ఇవాళ హైదరాబాద్ వచ్చాను ఎందుకో మీతో మాట్లాడాలని పించింది అందుకని చేశాను .అని పదినిమిషాలు ఆత్మీయంగా మాట్లాడారు . ఆ వారం లో జరిగిన సరసభారతి ఉగాది వేడుకలలో ఈ విషయం సభా ముఖంగా అందరికీ తెలియ జేసి గర్వపడ్డాను . కానీ నామనసులో ”మారుతీరావు కు  మనం ఇన్నిపుస్తకాలు ఆయన చదవాలని ఆత్మీయంగా పంపామే .ఆయన మర్యాదకైనా కనీసం ఒక్కటి కూడా తన  పుస్తకం నాకు పంపలేదే ”అని బాధ గా ఉండేది . ఇది పొసెసివ్ నెసో ,స్వార్థమో సంకచితభావమో ఆకాంక్షో  కోరికో ఆశో  అత్యాశో  చెప్పలేను . ఒక ఉగాదికి ఆయన్ను పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిధిగా ,ఉగాదిపురస్కార ప్రదానం తీసుకోవలసిందిగా ఫోన్ చేశా మెయిల్స్ కూడా రాశా .వస్తానని చెప్పారు .కానీ చివరికి కొత్త సినిమా ఒప్పుకున్నందువలన రాలేనని రాశారు . బెజవాడలో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు రచయితల సమావేశం లోనూ అంతకు ముందు ఒకటి రెండు సభల్లోనూ కలిశాను ఫోటోలు పంపమంటే పంపాను కూడా .
   కానీ సుమారు రెండేళ్లక్రితం వరకు ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారెవరో నాకు తెలియదు .ఒక రోజు కొరియర్ లో ఆరేడు పుస్తకాలు వారి నుంచి నాకు వచ్చాయి .వాటిలోని ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వారితో ”నా అడ్రస్ మీకు ఎలా దొరికింది నాకు ఇన్ని పుస్తకాలు ఎందుకు పంపారు ?”అని అడిగా సాహితీ ప్రియులెవరో  తెలుసుకోవటం నా కు ఇష్టం .మీ అడ్రస్ సంపాదించి పుస్తకాలు పంపాను చదివి అభిప్రాయం రాయండి ”అన్నారు .ఆ సౌజన్యానికి కరిగిపోయాయి వెంటనే చదివి ఫోన్ లో వారికి నా అభిప్రాయం తెలియజేసి సరసభారతి అప్పటిదాకా ప్రచురించిన పుస్తకాలన్నీ కొరియర్ లో పంపాను అందినట్లు ఫోన్ చేసి అభినందించారు .ఇలా మా ఇద్దరిమధ్యా ఫోన్ భాషణం కొనసాగింది అప్పటినుంచి నేనూ గీర్వాణకవుల కవితా గీర్వాణం రెండు భాగాలు కొలచల సీతారామయ్య గారిపై పుస్తకం వగైరాలు పంపాను .  సంస్కృత కవులపై నేను చేస్తున్న కృషిని మెచ్చుకొంటూ మాట్లాడారు . దానిపై ప్రముఖ విశాఖ సాహితీ పత్రిక”ప్రసన్నభారతి ” లో వ్యాసం కూడా రాశారు .న్యాయంగా ఆయన ముందు నావి హనుమంతుని ముందు  కుప్పి గంతులు ..అమెరికా వచ్చేముందు మార్చి 15 న నేనూ మా శ్రీమతి మనవడు చరణ్ విశాఖవెళ్లి డా శ్రీ రాచకొండ నరసింహ శర్మగారిని శ్రీమతిగారిని చూసి  సాయంత్రం వేదుల వారిని చూద్దామని అనుకొంటుండగా వారే ఫోన్ చేసి తప్పక రమ్మని చెప్పగా వెళ్లి సందర్శించాం . ఆయన మా ఇద్దర్నీ చూసి పులకించిపోయారు .మేము ఆదంపతులకు సన్మానం చేద్దామని నూతనవస్త్రాలు శాలువాలు తీసుకు వెడితే వారు ”మీరు మాఅతిధులు .ముందు మీకు మేము సన్మానం చేస్తాం .తర్వాతే మీరు ”అని నన్ను ఆపి తామిద్దరూ మా ఇద్దరికీ నూతనవస్త్రాలు శాలువా కప్పి సత్కారం చేసిన సంస్కారం వారిది .తర్వాత మేమూ చేసాం శాస్త్రిగారి టేబుల్ పై నా గీర్వాణం రెండుభాగాలు ముచ్చటైన అట్టలతో దర్శనమిచ్చాయి .వారు నాతో ”మీ పుస్తకాలలో విష్యం మీరు రాసిన తీరు బ్రహ్మానందంగా నచ్చాయి వాటిలో రోజుకు ఒకటైనా చదవకుండా ఉండలేక పోతున్నాను .అంత రీడబిలిటీ ఉంది మిగతావాళ్లూరాస్తే దీన్నే కీకారణ్యం చేసేవారు మీరు మహా గొప్పగా మనసుకు హత్తుకునేలా సరదాగా చదువుకోనివిషయం   తెలుసుకునేలా రీసెర్చ్ చేసేవారికిరిఫరెన్స్ పుస్తకాలుగా ఉన్నాయి మీ కృషి బహు  గొప్పది మీ రెండో పుస్తకం కోసం వేయికళ్లతో ఎదురు చూశా .అన్నారు .   అక్కడే విశాఖ సాహితీ సంస్థ నిర్వాహకులు శ్రీ ఏం ఎస్ ఆర్ ప్రసాద్ గారు ఇంకొకరు కలిశారు .  వీరుకూడా తమ ప్రచురణలు 6 పుస్తకాలు నాకు ఇచ్చారు .అందులో  శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రీ గారిపై శ్రీమతి చర్ల సుశీలమ్మగారిపై  పుస్తకం  ఆమె కుమార్తె నిడదవోలు మహిళాశ్రమం నడిపే చర్ల సరళ గారి  రచనలు ఉన్నాయి .శ్రీపాద ,సుశీలగార్లపై వెంటనే వ్యాసాలూ నెట్ లో రాశాను  నిడదవోలు ఆవిడతోఫాన్ చేసిమాట్లాడాను ఆమె  యెంతో  సంతోషించారు ఉయ్యూరు రావాలనికొరగా వస్తానన్నారు ఆమెకూ సరసభారతి పుస్తకాలు కొరియర్ లో పంపాను  ఇవన్నీ చూస్తుంటే మారుతీరావు నాకు పుస్తక0 ఒక్కటి కూడా పంపనందుకు మనసు  తొలిచేస్తున్నట్లుంది .. గతం గతః
  నిన్న మధ్యాహ్నం ” యూ ట్యూబ్ లో మారుతీ రావు కాలం పెట్టి విన్నా .ఈ పూటా విన్నా .అద్భుతం అనిపించాయి .బాలమురళి కృష్ణ సంగీత కచేరీ చేస్తూ ఎంత ఆనందిస్తూ మనల్ని ఆనందింప జేస్తారో మారుతీరావు కూడా అంతే ఫీలింగ్ తో ,హావభావాలతో చక్కని రిపిటీషన్ లతో ,నొక్కి చెప్పటం తో గత వర్తమాన భవిష్యత్తులు తరచటం లో  ఇంగ్లీష్  ను  కూడా అవసరమైన చోట వాడటం లో తెలుగులోకంటే ఇంగిలీషు లో ఇంకా బలంగా చెప్పటం లో తెలుగు భాషకు ప్రాణం పోయటం లో భారతీయ సంసంస్కృతికి పట్టం కట్టటం లో  పాశ్చాత్త్య  నాటకాల పోకడలను ఆదరణను వ్యక్తీకరించి మననాటకాలు వృద్ధి లోకి రావటానికి చేయాల్సిన ప్రణాళిక వివరణలో  పెద్దల యెడ విధేయతను వ్యక్తం చేయటం లో ,సమకాలీన రాజకీయ డొల్లతనాన్ని  ఏకి  పారేయటం లో నచ్చినదాన్ని నిష్పక్షపాతంగా  మెచ్చటం  లో తెలుగు కధకులను కధలను ఛానల్ ద్వారా వివరించి ప్రాణ ప్రతిష్ట చేయటం లో మారుతీ రావు కు సరిపోలిన వారు లేరు .కథ , నాటకం వ్యాసం విమర్శ నవల సినీ సంభాషణలు స్క్రీన్ ప్లే  నాటక రచన నటనా సినీనటన లలో ఆయన స్థాయి అందుకొనగలవారు లేరు . విషయవివరణలో ఆయన ముందుకూ వెనక్కూ వెడుతూ అతి సూటిగా శ్రోతల ప్రేక్షకుల గుండెలను తాకేట్లు చేసే స్వీయ  వ్యక్తిత్వం ప్రతిభా గొల్లపూడిది . ఆయన కాలం బ్రహ్మం గారి నేటి  కాల జ్ఞానం అని పిస్తుందినాకు .
   మా గోపాలకృష్ణగారికి ఈ కాలం ,ఆకెళ్ళ నాటకం ఇంట్రవ్యూ చూడమని  రాస్తే  చూసి పరమానంద భరితులయ్యానని రాశారు..
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.