వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -38
పాకం పై వ్యాఖ్యానం -2(చివరిభాగం )
వాక్యం లోని పదాలు ఒక దానితో ఒకటి సాఫల్య ,ఆనుకూల్య దగ్గర సంబధం కలిగి ఉంటె ఒక కొత్త భావం ఆవిష్కరింపబడుతుంది అదే తాత్పర్యం .అదొక ప్రత్యేక ప్రయోజనం .సముచ్ఛయమైన ”దద్నా జుహోతి ”లో పెరుగులు అనే అర్ధం మరొక చోటు నుండి పొందాల్సి ఉంటుంది .అది పునరుక్తి అవుతుంది అది పెరుగు కు త్యాగానికి అసాధ్యమైన సంబంధమవుతుంది ఇదే తాత్పర్యం తనభావానికి మద్దతుగా మల్లినాథుడు రుయ్యకుని భావాన్ని తెలియబరచాడు -”పదార్ధ వాగమసమనంతర భావినీ సమన్వయ శిక్త స్తాత్పర్యం ”ఇక్కడ సమన్వయ అనే మాట చాలా ముఖ్యమైనది .అంటే వేరే భావం వచ్చే అవకాశముంది కనుక ..తాత్పర్యం సాధారణంగా అర్ధవంతమై సూచనగా ఉండాలి .
కనుక అలంకారాలలో తాత్పర్యం ప్రధాన భూమిక వహిస్తుంది .ఈ కీలక భావాన్నే మల్లినాథుడు చాలా విస్పష్టంగా తెలియ బరచాడు .అలాగే ”ఉపచార”అనే పదం అలంకారశాస్త్రం లో తరచుగా వాడబడే పదం పి .వి .Kane పండితుడు ఉపచారా పదానికి చాలా అర్ధాలు చెప్పాడు ..ఉపచారను రూపకం గా భావించాడు .కారణం ఇది రెండు వస్తువులు విభిన్నంగా ఉండి సాధారణం గా అనుమానాన్ని మరుగు పరచి అసామాన్య పోలికను బలపరుస్తుందికనుక .kaneపండితుడు ఈ భావాన్నే మిగిలిన అలంకారికులు కూడా ఉపయోగించారని చెప్పాడు ..కానీ ”తరళ ”వ్యాఖ్యానం లో మల్లినాథుడు మరింత చిన్న నిర్వచనాన్ని ”ఉపచార ”కు ఇచ్చాడు -”అత త్వస్య తత్వేనవ్యపదేశహ ”-”భిన్నత్వేన ప్రతీయ మానయోరేవే యారోపణమూపచారః ”న్యాయ వార్తికలో ఇవ్వబడినదానికి ఈ నిర్వచనం అతి దగ్గరలో ఉంది .”.వీటన్నిటిని బట్టి చూస్తే విద్యాధరుని ”ఏకావలి ”అనే కంఠాభరణం మల్లినాథుని తరళ వ్యాఖ్య అనే మెరుగు చేత మరింత ప్రకాశించింది అని స్పష్టం గా చెప్పవచ్చు ”అన్నాడుడా పి జి..లాల్యే పండితుడు .
ఇంతటితో విద్యాధరుని ఏకావలి కి మల్లినాథ సూరి వ్రాసిన తరళ వ్యాఖ్యానం పై వివరణ పూర్తయింది .
తరువాత వరద రాజపండితుడు రాసిన ”తర్క రక్ష”కు మల్లినాథ సూరి రాసిన ”నిష్క0టక ”వ్యాఖ్యాన విషయాలను తెలుసు కొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా .

