వ్యాఖ్యాన చక్రవర్తి మల్లనాధ సూరి మనీష -39
వరద రాజ విరచత తార్కిక రక్ష కు మల్లినాథుని ”నిష్కంటక ”వ్యాఖ్య -1
కవి, మహా వ్యాఖ్యాత అయిన మల్లినాథ సూరి న్యాయ శాస్త్రం లోనూ అమోఘ పాండిత్యం ఉన్నవాడని తెలిస్తే మహదాశ్చర్యమేస్తుంది అన్నాడు లాల్యే పండితుడు .వ్యాకరణం మల్లినాథుని నాలుకపై నాట్యమే చేస్తుందని మనకు తెలుసు .ఇప్పడు ఆయన న్యాయ లేక తర్క శాస్త్ర పాండితీ గరిమను తరచి చూద్దాం .దీనిలో ఆయనప్రతిభ తార్కిక రక్ష పై రాసిన వ్యాఖ్యానం వలన స్పష్టమవుతుంది .దీన్ని రాసిన వాడు వరద రాజకవి .ఈ కవి 12 లేక 14 వశతాబ్ది మధ్యకాలం వాడు ..యితడు ఆంద్ర కవి అని ”హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ ”రాసిన విద్యాభూషణుడు పేర్కొన్నాడు .కొందరుమాత్రం కాశ్మీర దేశస్తుడు అన్నారు . ఏ వాడైతేనేమి అతడు తార్కిక రక్ష రాశాడనేది నిర్వివాదం . దీనికి ఆయనే ”సార సంగ్రహ ”అనే వ్యాఖ్యానమూ రాశాడు .ఈ రెండిటిపై మల్లినాథుడు ”నిష్క0టక ”అనే వ్యాఖ్యానం రచించాడు . వరద రాజకవి భట్టోజి శిష్యుడు .భట్టోజి రాసిన ”సిద్ధాంత కౌముది ;;ని మధ్య సిద్ధాంత కౌముది ,లఘు సిదాంత కౌముది అనే రెండు సంక్షిప్త గ్రంధాలుగా చేశాడు .”వ్యవహార నిర్ణయం” అనేదికూడా రాశాడని అంటారు . 18 వ శతాబ్దికి చెందిన మరో వరద రాజకవి ”వ్యవహార మాల ”రాశాడని కానే పండితుడు చెప్పాడు .
మల్లినాథుని నిష్కంటక లో 1- వర్గాలు 2-చెల్లుబాటయ్యే తార్కికం 3-8 నిర్వచనాలతో సూటి అవగాహన లేక జ్ఞానం అని మూడు భాగాలున్నాయి ..మల్లినాధుడు అనుమాన ప్రమాణం లేక అనుమితి ,ఉపాధి లను పూర్తిగా చర్చించాడు భట్ట వాదాలకు చెందిన వాటిని మల్లినాథుడు త్రోసిపుచ్చాడు ..ప్రభాకరుని ”అభావాన్ని కూడా తిరస్కరించాడు .న్యాయ సూత్రాలు రాసిన గౌతముని మార్గం లో సూరి ప్రయాణించాడు దానిపైనే ఆధారపడ్డాడు .”హేత్వాభాస ”వంటి కొన్ని అవాస్తవాలు లేక భ్రమలను ఉన్నవాటికి అదనంగా సూరి కలిపాడుకూడా.అయితే దురదృష్ట వశాత్తు మల్లినాథుని పూర్తి వ్యాఖ్యానం లభ్యం కాలేదు .మొదటి అధ్యాయాన్ని మాత్రమే విపి ద్వివేది ప్రచురించాడు ..తార్కిక రక్ష పై వ్యాఖ్యానిస్తూనే మల్లినాథుడు తర్కం పై భూషణ ,న్యాయ కుసుమాంజలి టీక ప్రభాకర ,శా లికనాధ ,శ్లోక వార్తికాకర ,తథాగత ,ఉదయన మొదలైన ఇతరులు రాసిన లేక ఇతర గ్రంథాలనుండి అవసరమైనవాటిని కూడా పేర్కొన్నాడు ..అదనపు వివరణలు ఇచ్చినా సూరి, మూల గ్రంధానికి పరిమితమై మాత్రమే రాశాడు .ఈ విషయం పై ప్రసిద్ధ పరిశోధకుడు ప్రొఫెసర్ ఇ .ఆర్ .శ్రీకంఠ శర్మ విలువైన వ్యాసం రాశాడు అందులోని కొన్ని విషయాలను లాల్యే తెలియ జేశాడు .
వ్యాకరణ వివరణలను మల్లినాథుడు ”షోడశ పదార్ధ ‘ 16 విషయాలపై ఇచ్చాడు వీటిని వరద రాజుకూడా చెప్పాడు .వీటికి ఒక ప్రత్యేక వరుస క్రమాన్ని మల్లినాథుడు తెలియ జేయటం విశేషం -అదే ”ప్రమాణం వినా ప్రమేయాది సిద్ధే -విషయ వినా ప్రమాణ ప్రవృత్తే -అసందిగ్ధస్య ప్రతి ఇత్సవాత్ -సందిగ్ధస్యాపి నిష్ప్రయోజనం అప్రతి పితిస్త్స త్వాత్ ప్రతిపత్తేశ్చదృష్టాంత ముఖత్వాత్ -అవయవాది నియమస్య సిద్ధదాం తాను సరిత్వాత్ -ప్రమాణ కరణా శరీర నిర్వర్తకాంగేత్వాత్ ప్రమాణానుగ్రాహకత్వాత్ –
తత్ఫల త్వాత్ -తస్యాపి కదా సాధ్యత్వే వాదస్య -తత్వ నిర్ణేయ ఫాలేత్వాత్ ”(తార్కిక రక్ష కారిక పై సూరి వ్యాఖ్య )
ప్రమాణ0 పై వరద రాజునిర్వచన వివరణలో మల్లినాథుని విధానం సంక్షిప్తంగా అతి స్పష్టంగా అర్ధవంతంగా ఉంది -”సాధనాశ్రయాయో రణ్యతరత్వే సతి ప్రామాణ్యత్వాత్ ”.ఆశ్రయ పదం ఆవ్యాప్తిని నిర్వచనంలో తొలగించి0ది .దైవం సాధనకాకాపోయినా ప్రమాణమే ”ప్రమా ” అంటే విఙ్నానానికి అది పునాది (సబ్ స్ట్రాంటం). వరద రాజు
సాధన అవసరం లేదని దీనికి కారణం ప్రమాణాన్ని ప్రభావితం చేయటానికి ఉన్న వ్యాప్యత్వం వలన ప్రమేయం తొలగింపబడ లేనిదని అన్నాడు ..సాధనను సమర్ధిస్తూ ప్రమేయం ఉంటేనే సుఖ దుఃఖాలుంటాయన్నాడు వీటి నిర్వచనాలను ప్రయోగించటానికి సాధన శబ్దం నిర్వచనం లో ఒక భాగమై వివరిస్తుంది అంటాడు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా .

