వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -40
తార్కిక రక్ష పై మల్లినాథుని ”నిష్క0టక ”వ్యాఖ్య -2
సాధన పై మల్లినాథుని వివరణ చాలా సమ్మతంగా ఉంది -”కిమ్ చ ఈశ్వర ప్రమయానిత్య సర్వార్ధ గోచరయా-ప్రమా వ్యాప్తేహ్ తన్నిరాశోనార్ధ వత్వం ద్రష్టవ్యం ”దేవుడు అనే బయటి వాడి జ్ఞానం ,ప్రతిదీ ఆయన విషయమే .ప్రమేయాలన్నీ ”ప్రమా” లో వ్యాప్తి చెంది ఉన్నవే అన్నాడు మల్లినాథుడు ..ప్రమేయం నిర్వచనం విషయం లో అతి అనువర్తనం (అప్లికేషన్ )ను పరిహరించటానికి నిర్వచనం లో సాధన అనేపదం తప్పక ఉండాలి అన్నాడు .ఇది సత్య సమర్ధనంగా ఆమోదయోగ్యం గా ఉన్నది .ఇదికాక మల్లినాథుడు మరింత ముందుకు వెళ్లి మరొక తాజా చర్చను తెచ్చాడు ..ఇదీ చాలా ఆమోదయోగ్యంగానే ఉంది .-”ప్రమాణామావి సంవాదిజ్ఞానమర్ధం క్రియాస్తితిహ్ (తార్కిక రక్ష) .వరద రాజు బౌద్ధుల అభిప్రాయాలను ముందుంచుతూ ,”అవిసంవాది ” ని అది అనుమాన ప్రమాణం తో సాధింపబడదు అని వ్యతిరేకించాడు ..బౌద్ధుల ఆలోచన ప్రకారం ప్రతిదీ అనిశ్చితంగా వికల్పమే ,అనుమితి కారణాలైన వాటితో సహా.వికల్పం అనేదితప్పనిసరిగా విషంవాది అవుతుంది కనుక అనుమానం అనుకొనే ప్రశ్నే లేదు .ఈ సందర్భం లో ల మల్లినాథుడు ”ఉదయనుడు”రాసిన దాన్ని ఆధారంగా చూపించాడు -”కిమ్ చేత్యం ప్రలపతో బౌద్ధస్య మూర్ధని భగవతాపి -వృద్ధేన దుర్ధర్షే మహానయం వజ్రపాతః కృత ఇత్యాహ ”(తార్కిక రక్ష)ప్రభాకరుడు చెప్పిన ప్రమాణం అనేది అనుభూతి అన్నదాన్ని వరద రాజు ఆక్షేపించారు .ఇందులో అసంగత్వం లేక అస్థిరత ఉందన్నాడు .వాళ్ళు వేద విజ్ఞానాన్నిచెల్లుబాటయ్యేది అని అంగీకరించారుకాని ప్రమాణ విషయం లో స్మృతిని దూరంగా పెట్టారు .ఇక్కడే మల్లినాథుని వ్యాఖ్య మహా ఆసక్తికరంగా ఉంటుంది -తదే తత్తర గాది రూఠస్య తురగావిస్మరణం యద్ వేదప్రమాణాన్య సాధనే ప్రవృత్తస్య మీమాంస గురో స్తస్మాద్ ఇతి ”.ఒక్కోసారి వరద రాజు కొన్నిటిని ఆమోదించాడు . ప్రత్యక్ష ,అనుమాన ,ఉపమాన ,శబ్ద, క్రమం ఏర్పరచటం లో సరైన తార్కిక సమర్ధన చేయలేక పోయాడు .కానీ మల్లినాథుడు వీటి వరుసక్రమాన్ని చాలా చక్కగా సమర్ధించి చూపాడు -”తత్ర సర్వ ప్రమాణోప జీవ్యత్వాత్ ప్రత్యక్షస్య ప్రాధామ్యం తదితర ప్రమాణో ప జీ వ్యత్వాత్ ప్రత్యక్ష నా0తర్దమనుమానస్య పృథక్ప్రమావ్యదాఠర్య సూచనార్ధ ముపమానస్య శబ్దాత్ ప్రాధామ్యే పరిశేషా చ్ఛబ్ద స్యాంతే నివేశ ఇతి ”(తార్కిక రక్ష )
మల్లినాథుని మరికొన్ని వాదాలు తెలుసుకొందాం -మల్లినాథుడు”నను ఈశ్వరస్య కృతః ప్రమాణాని ”మొదలైన వాటిపై మరొక ప్రశ్న లేవనెత్తి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు .దైవ0 సరైన జ్ఞాన పరివ్యాప్తుడు అని ఎలా చెప్పగలం ? అయన గురించిన జ్ఞానం ఉత్పత్తి కాదు ,కారణం అది ఫలితం ప్రయోజనం కాదు ..కనుక జ్ఞాన పరివ్యాప్తుడుకాదు .ఈ విషయంపై వాదం లేవదీస్తూ రచయిత ప్రమాణం కు నిర్వచనం చెప్పాడు ”మితిహ్ సమ్యక్ పరీచ్ఛా త్తిరితి ” .అర్ధవంతమైన జ్ఞానం సరైన నిశ్చయం ..అది ఫలితం కాకపోయినా దైవజ్ఞానము అనేది సరైన ఖచ్చితమైన జ్ఞానమే కారణం అది ఖచ్చితమైన అనుభవం కనుక
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

