వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -41
వరద రాజా ;;తార్కిక రక్షా ”కు మల్లినాథుని ”నిష్క0ట ”వ్యాఖ్య -2
మల్లినాథుడు మరొక అభ్యంతరాన్ని లేవదీశాడు .దైవం అనంతత్వం యొక్క ప్రజ్ఞానం కాదు .-”తదుత్తాచ ప్రమాతృతా ”(తార్కిక రక్షా వృత్తి )అని చెప్పి ప్రజ్ఞానం యొక్క నిర్వచనం చెప్పాడు . ప్రజ్ఞాని లక్షణం ప్రజ్ఞానం కలిగివుండటమే .దీని అర్ధం ప్రజ్ఞాని ప్రజ్ఞానానికి సంబంధించిన సంపూర్ణ సరైన ప్రజ్ఞానం కలిగిఉండటమేకాని దానికి గుర్తుకాని సంస్థకాని ఏజెన్సీ కానీ కాదు .కనుక దైవం ప్రజ్ఞాని .కొందరు దైవం ప్రజ్ఞానం కాదని దీనికి కారణం తెలుసుకొన్నవాడు దాని పరికరం ఒకటి కాదు కనుక వైరుధ్యం ఏర్పడుతుందికనుక అంటారు .దీన్ని ముందే ఊహించిన మల్లినాథుడు ”మన దృక్పధం నిర్దుష్టమైన సాక్ష్యం రుజువు సరైన జ్ఞానం తో పరి వెస్టించి ఉంటుంది కానీ దాని ప్రతినిధిపై కాదు .కనుక చెప్పబడిన ప్రకారణలో వైవిధ్యమే లేదు ”అన్నాడు .-”తద యోగ్యవ్యవ చ్చేదః -ప్రామాణ్యం గౌతమేమతే ” మల్లినాథుడు ప్రజ్ఞాని అయినవాడు తన స్వ విజ్ఞానం పైనే ఆధారపడతారు కనుక సరైన విజ్ఞాన ప్రజ్ఞానాలు అన్నీ ఆయనవే .
ఈ రెండూ వైరుధ్యాలుకావు .ప్రపంచ జ్ఞాన విషయాలలో సరైన రుజువు ఏదో ఒక ప్రతినిధిని ఆశ్రయించే ఉంటుంది .ఆధారం లేదు .కనుక వైరుధ్యమే లేదు పై వాదాన్ని ఆమోదిస్తే దైవం యొక్క అనిశ్చిత్వం సరైన జ్ఞానానికి అయిదవ మార్గం లేక సాధనమవుతుంది .దైవం మన నాలుగు రకాల అవగాహనకు లలో చేర్చటానికి కుదరదు .కారణం దైవం ప్రత్యక్ష అవగాహనవలననే తెలియ దగినవాడు .దైవం సూటి సరైన విజ్ఞానం తోనే వ్యాపించి ఉంటాడు అన్నాడు లాల్యే పండితుడు -God is included in the category of direct perception . He is permeated by the direct valid knowledge ;”.
వరద రాజుని మరొక వృత్తి ప్రకరణం లో ,చర్య లేక క్రియ అది కర్మ యొక్క చర్య వలన అందులో కోరిన ఫలితం లేకపోయినా రుజువు చేయబడుతుంది అన్నాడు .-”ఇచ్చాది జన్య ఫలాంతరస్యా భావేపి కరణవ్యాపార విషయత్వ మాత్రేణ కర్మత్వోపపత్తే”
తెలుసుకొనే స్థితిలో చర్య ఉంటుంది .దీన్ని సూచించే గుర్తు(ఇండికేటరి మార్క్ ) ఏది ? క్రియ అనేదాని అర్ధం పూర్తిగా దాని ధాతువు మీదనే ఆధారపడితే అప్పుడు అనిశ్చితం ఏర్పడి అది సముచ్చయం వగైరాల పై తప్పనిసరిగా ఆధార పడాల్సి వస్తుంది .చర్య స్పందన పై ఆధారపడితే ,అలా చెప్పటానికి సాక్ష్యం ఉండదు ..ఈ ప్రకారణాలలో మల్లినాథుని గతితార్కిక తర్క ప్రతిభా సర్వస్వము, నైపుణ్యం విశ్వ రూప సందర్శనమై భాసించింది .ఈ వ్యాఖ్యానం లో మల్లినాథుడు ఇతరుల తప్పుడు
గుర్తింపు ,పోలికలపై చాలా అసహనం ప్రదర్శించాడు .-”అయమప్యేకః కిరణావళీ గ్రంథ ఆత్మా ప్రకరణాస్య ఇతి కైశిచ్చ దుత్తుంగ తుండే రాఖ్యాతం చ తదవ్యాకరణా పరిజ్ఞాన వంచనా సాహస విలాస ఏవే త్యాస్తం -ఇంద్రియాలింగాది జ్ఞాన కరణా వ్యాపార విషయత్వమేవ తత్ఫల జ్ఞాన కర్మత్వా మిత్యర్ధహ్ ” మల్లినాథుడు ప్రజ్ఞాన0 యొక్క
కారణం ,దానిఫలితం భావం దాని చిహ్నం ఒకటే అయినట్లుగా ఒకటేఅవుతుంది అని భావించాడు .సరాసరి భావం లేక జ్ఞానం ను విస్మరి0చైనా దానితాలూకు చిహ్నం మిగిలే ఉంటుంది అని ఎవరైనా వాదించవచ్చు .
మల్లినాథుడు వెళ్ళటం అనే పని ఒక గ్రామానికి చేరటానికి ఫలితం అంటాడు సూరి . ఇచ్చిన ఉదాహరణలో ఫలితలోపం లేదు .అది జ్ఞానం, చర్యయొక్క స్థితి దాని అర్ధం ధాతుజన్యమా?మొదటి ప్రత్యామ్నాయం లో రూపం ,ఆసాధన.విజ్ఞానం ఎన్నటికీ చర్య కానేకాదు అడి రూపానికున్న ఒక గుణం లేక లక్షణం -జ్ఞానం న క్రియా గుణత్వాత్ రూప విదిత్యర్ధః ”
అది గుణం అనటానికి సూరి కారణం చెప్పాడు .దాని ఉనికి అశక్తత లేక నిరసన .మిగతాది అంతా దాని చర్యపై అసక్తత వగైరా .విజ్ఞానం గుణం లేక లక్షణం .ఎందుకంటె అదే ఫలితంకనుక అది అంతర్గతం గా అనంత విషయం తో సంతోషం ఆనందం లాగా సంబంధం కలిగి ఉంటుంది . రెండవ ప్రత్యామ్నాయంగా స్పందన విషయం లో అతిక్ట్రమణ (ట్రాన్స్ గ్రేస్షన్ )లేక దుర్వినియోగం ఉన్నది .ఈ సందర్భం లో వరద రాజు ఉదయన రచన నుంచి ఒకదాన్ని ఉదహరించారు -”అనేకాన్యా దసిదేవీ —– ”(తార్కిక రక్షా )
ఈ చిన్న వ్యాఖ్యాన గ్రంధం లో మల్లినాథుడు న్యాయ శాస్త్ర కోవిదులైన అనేక కవుల రచనలను ఉదహరించారు .అంటే ఎంతటి విస్తృత పరిశీలనం చేసి తార్కిక రక్షా కు నిష్క0టక వ్యాఖ్య రాశాడో తెలుస్తుంది .కొన్నిటిని మాత్రం తెలుసుకొందాం –
1 అక్ష చరణాః 2-అక్షపాదః 3-అమర 4-ఆచార్య 5-ఉదయనుడు 6-కణాదుడు 7-కిరణావళికారుడు 8-ఉదయణాచార్యుడు 9-కోచిత్ 100-గురు 11-గురుమత0 12-చార్వాక 13 నైయాయిక 14-న్యాయ చార్య 15-పక్షిలా 16-పీలుపాక వాది17-ప్రభాకర 18-బుద్ధ 19-బౌద్ధ 20-భట్టపాద 21- భాట్ట 22-భాష్యకార 23-భూషణ 24-భూషా పీయ 25-మీమాంసకులు 26-మను 27-కాచస్పతి 28-వాచస్పత్య పర్య 29-వృత్తిక కారులు 30-వైశేషికాదేశీ 31-శబరుడు 32-వృద్ధ 33-శాక్య 34-శాబ్దిక 35-సాండా ఖ్య 36-గౌతమ 37-సూత్రకార మొదలైన 40 తర్క న్యాయ శాస్త్ర గ్రంధాలను మల్లినాథుడు అవలోడనం చేసి ,సార సంగ్రహం చేసి చిన్నపామైనా పెద్దకర్రతో కొట్టినట్లు విపుల వ్యాఖ్యానం రాశాడు ఆ మనీషకు జేజేలు .
ఇంతటితో మల్లినాథుని వ్యాఖ్యానాలకు సమాప్తిపలికి తర్వాత ఆయన స్వ0త రచనల ను వాటి వైశిష్ట్యాలను తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—

