వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -42
మల్లినాథుని స్వీయ రచనలు -1
మహా వ్యాఖ్యాన కర్త ఒక్కోసారి మహాకవిగా మారిపోతుండటం అరుదైన విషయమని పిస్తుంది . -వైశ్య వంశ సుధాకరం 2-రఘువీర చరిత0 3-ఉదార కావ్యం 4-భక్తి రహస్యం 5-నక్షత్ర పాతా ధ్యాయం అనే అయిదు మల్లినాథ సూరి రచనలు లోకం లో ప్రసిద్ధి చెందాయి . కనుక విమర్శనా విశ్లేషణ వ్యాఖ్యానాలతో అగ్రభాగాన ఉన్న మల్లినాథుడు కవిగా కూడా సమున్నత స్థానం లో ఉన్నాడని తెలుస్తుంది ఈ ఐదింటిలో మొదటి రెండు మాత్రమే లభ్యమౌతున్నాయి .ఈ రెండిటిపై సంక్షిప్తంగా విశేషాలు తెలుసుకొందాం
వైశ్య వంశ సుధాకరం
కాంచీపురం లో వైశ్యులకు , వ్యాపారులకు మధ్య జరిగిన వివాదం పరిష్కరించటానికి తన తీర్పుగా మల్లినాథ సూరి ఈ కావ్యం రాశాడు .ఈ వివాదం 1426 లో రెండవ ప్రౌఢ దేవరాయలు రాజ్య పాలన చేస్తున్న సమయం లో వచ్చింది . రాజు మల్లినాథుని ఈ సమస్యను పరిష్కరించమని కోరగా మల్లినాథుడు ఈకావ్యం రాసి తీర్పు ప్రకటించాడు కనుక మల్లినాధునికాలం దీని ఆధారంగా 1430 గా భావించారు .దురదృష్టవశాత్తు ఈ కావ్యం మొత్తంలో అతి కొద్దిభాగమే వ్రాత ప్రతిగా లభ్యమైంది .అది సరళ సంస్కృత వచనం లో తెలుగు వచనం కోవలో రాయబడిఉంది .”చాతుర్వర్ణ నిర్ణయా నామ దశమోధ్యాయహ్ ” అందులోని ముఖ్య సారాంశాన్ని తెలుసుకొందాం .
ఇందులో మల్లినాథుడు వైశ్య శబ్దానికి పర్యాయపదాలు చెప్పాడు అవి నాగర ,ఉరుజ ,త్రీయ ,కోమటి . ఆయన ఉద్దేశ్యం ప్రకారం వాణి ,కోమటి వాళ్ళు వర్ణ సంక్రమణం వలన పుట్టినవారు .కనుక వాళ్ళు అన్ని నగర పట్టణాలలో వస్తువులను అమ్మటానికి అర్హత ,హక్కు కలవాళ్ళు అమరకోశం నుంచి కొన్ని ప్రకారణాలను ఉదహరిస్తూ నాలుగు వర్ణాలవారి స్వాభావ లక్షణాలను తెలిపాడు .వైశ్య అనే పద శబ్దోత్పత్తిప్రకారం వైజాతి అంటే ద్విజాతి ,అని అర్ధం చెప్పాడు –”అత ఏవ విజాతిత్వా స్థాపనాత్ అమరసింహా క్తా వివర్ణత్వ స్థాపనం చ ఉపపద్యతా ఏవ -తదాచ శాసనోక్త విజాతీయ శుద్ధ కన్యాయాం జనితోభయ జాతి వంశ్యహ్ వైశ్యోక్తం విజాతీయహ్ -అమర సింహోక్త వివరణా పృథగ్ జానో వైజాతిరితిసిద్ధం ” (వైశ్య వర్ణస్య సుధాకరహ్ ) కోమటి వారు రెండు వర్ణాల సాంకర్యం వలన పుట్టారుకనుక ద్విజాతి అని పిలువబడ్డారని అందుకే వారిలో భేదం ఏర్పడిందని చెప్పాడు. కనుక వైజాతిఅనేది వైశ్యాతి అయిందని అమరసింహుని అభిప్రాయం అన్నాడు – ”ద్వై గాతి రితి జాతిద్వయ సాంకర్య సంభవేన వైజాతి కోమటీనాం వంశ వైశ్యోక్త విజాతీయత్వ స్థాపనం శాసనోక్త భేదగలం స్థాపన ”
వైశ్య ,నాగర ,వణిక,పదాలమధ్య ఉన్న అర్ధం లో ఏకత్వాన్ని అమరకోశంలోని అనేక ప్రకారణాల నాధారంగా మల్లినాథుడు సాధించి చెప్పాడు . మరొక విషయమూ తెలియ జేశాడు .సూటిగా చూడబడిన వస్తువు యొక్క జ్ఞాపకం, దాన్ని పరోక్షంగా జ్ఞాపకమని చెప్పినదానికంటే బలవత్తరమైనది అనే సిద్ధాంతాన్ని చాలా చక్కగా ఉపయోగించాడు -”అనుమితి స్మృత్యపేక్షయా ప్రత్యక్ష క స్మ్రుతి కృతే ప్రాబల్యమితి న్యాయ సిద్ధం ”. మల్లినాథుని ఈ రచనలో సంస్కృతం తోబాటు కొన్నిఅంటే 11,12,13 లతో బాటు 14 మొదటిభాగం తెలుగు ప్రకారణాలుగా కూడా ఉండటం విశేషం .మనుస్మృతి ,పద్మపురాణం భాగవతం ,ధర్మపాల చరితం మరికొన్ని స్మృతులనుండి తన భావ స్థాపనకు బలంగా అవసరమైనవాటిని ఉటంకించాడు సూరి .
రఘువీర చరిత మహాకావ్యం
రఘువీర చరితం అనే మహాకావ్యం రాసి మల్లినాథుడు తాను వ్యాఖ్యాన చక్రవర్తిని మాత్రమేకాదు మహా కవిని అని రుజువు చేసుకొన్నాడు .సంస్కృత మహా కావ్యానికి ఉండవలసిన సర్వ లక్షణాలతో దీన్ని నిర్మించాడు .దీనికి మూలాధారం వాల్మీకి రామాయణమే ..ఈకావ్యం శ్రీరాముడుతండ్రికిచ్చిన మాటపై వనవాసం కోసం దండకారణ్యం ప్రవేశించటం తో ప్రారంభమౌతుంది ..శ్రీరామ పట్టాభిషేకం తో పరిసమాప్త మౌతుంది .చివరలోపట్టాభిషేకానికి హాజరైన వారందరూ శ్రీరాముని నుండి వీడ్కోలు పొంది వెళ్ళటం ఉంది . ఈ కావ్యం 7 సర్గల కావ్యం ..మొత్తం 1 ,4,62 శ్లోకాలున్నాయి .మొదటి సర్గలో చల్లని మలయమారుతం వర్ణన ఉంది ఆశ్రమ జీవిత పవిత్రత సర్వత్రా గోచరి0చి అన్నింటిపై ప్రభావం చూపినట్లు అనిపిస్తుంది .అరణ్య ప్రవేశంలోనే విశ్వామిత్రుడు శ్రీరాముని దయ కారుణ్య సహన శీలాదిఉత్తమ గుణాలను ,పరశురాముని గర్వ భంగాన్ని ప్రస్తుతిస్తాడు .రాముని ప్రతిధర్మ కార్యం లో నీడలా లక్ష్మణుని కృత్యమూ ఉంటుంది -.అప్పుడు మహర్షి విశ్వామిత్రుడు శ్రీరాముని వీర విక్రమ శౌర్య పరాక్రమాలు లోకం లో ప్రతిస్థాపితమవ్వాలన్న ఆ కాంక్షను వ్యక్తం చేస్తాడు ..రాముని స్తుతించి అరణ్యవాసులైన తాపసుల పవిత్ర జీవనానికి యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా కొనసాగించటానికి ,వాళ్ళను ఆటంక పరచే రాక్షస ప్రమాదం నుండి రక్షించి రాజుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చమని చెప్పాడు ..సీతారాములు మునుముందుకు సాగుతూ ఉంటారు శరభంగ మహర్షి దర్శనం చేసి సుతీక్షణ ముని ఆశ్రమం చేరి ఆశీస్సులు అందుకొంటారు ఇక్కడ ఆశ్రమవర్ణనను మహాద్భుతంగా గొప్ప శ్లోకాలలో మల్లినాధకవి చేశాడు .సుతీక్షణమహర్షి రాముని గుణగణాలను కులక శ్లోకాలలో బహుధా ప్రశంసించాడు రాముడు సాధించాల్సిన లక్ష్యాలను మహర్షి వివరంగా ఆదేశించి తెలియజేశాడు అవి బాధితుల యెడ దయ ,కారుణ్యం ,మంచిని కాపాడటం ,,దుష్టత్వాన్ని అంతమొందించటం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకాన్ని కాపాడటం ,యుద్ధాలలో విజయం సాధించటం . ఇక్ష్వాకు వంశ రాజుల వ్రతాలు అంటే నియమ నిబంధనలు పాటించమని బోధించాడు-”ఆర్తనుకమ్పా సాధూనాం రక్షణం ఖలనిగ్రహః -రణేషు విజయశ్చేతి వ్రతాని నియతానివహ్ ”
తర్వాతి మూడు కులక శ్లోకాలలో అరణ్య స్వాభావిక శోభను ,విశ్వామిత్రుడు క్షణాలలో నిర్మించిన సుందర ఆశ్రమ వర్ణన ఉంటుంది ..అందరూకలిసి అగస్త్యమహర్షిని సందర్శిస్తారు .మహర్షి వీరి దక్షిణంవైపు ప్రయాణంలో కనిపించే పంచవటి మొదలైన వాటి గురించి వివరిస్తాడు ..దారిలో సంపాతి ని చూసి పంచవటి చేరుతారు . ఇక్కడి ప్రకృతి అందానికి రాముడు పరవశుడౌతాడు .ఇక్కడ గలగలా పారే గోదావరి నది పులకింతలు పెడుతుంది .గోదావరీ తీరం లో సాయం వేళ గడపటం ఏ సర్గలో ఉంటుంది. కావ్య మర్యాద ననుసరించి అనేక వర్ణనలు చేశాడు కవి మల్లినాథ సూరి .సీతారాముల శృంగార వర్ణనా గొప్పగా చేశాడు .శూర్పణఖ రాకతో ఈ సర్గ సమాప్తమౌతుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా

