వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -43
మల్లినాథుని రఘువీర చరితం
5 వసర్గలో శ్రీరాముని వీర విక్రమపరాక్రమ0 తో రాక్షస సంహార గాథ వర్ణన చేశాడు మల్లినాథుడు . రాక్షసులు మెరుపులమధ్య నల్లమబ్బుల్లాగా కనిపించారు .ఖర రాక్షస సమూహంతో రాముని భీకర పోరాటం గొప్పగా వర్ణించాడు .రాముని బాణాలకు రాక్షసులు రక్తం కారకుండా చచ్చారని సూరి రాశాడు . వాళ్ళశరీరం లో బాణం దూసుకు పోవటం ,బయటికి రావటం ఒకే సారి జరిగిపోయాయట . .రామబాణాలు యమ దూతలు అనిపించాయట . కొందరు రాక్షసుల తలకాయలు కాళ్ళు ,అరచేతులు అడ్రస్ దొరకలేదట .త్రిశురలనూ అదే పరాక్రమంతో రాముడు సంహరించాడు రావణుడు స్వయంగావచ్చి చూసి తనబలగానికి జరిగిన నష్టం తెలుసుకొన్నడ్డు మారీచుడిని ఒకడినే రావణుడు నమ్మాడట . రాముడు అప్పటికే ఈ రాక్ష దళనాయకులను చంపేశాడు . దేవతలు ,మునులు రాముని వీరత్వాన్ని బహుధా పొగిడారు .శూర్పణఖ శత్రువులను చూసి భయపడక వారి సంహారం ఆలోచించమని చెప్పింది .రావణుడినే బంగారు లేడి రూపం లో సీత మనసును ఆకర్షించమని ఏదో మిషకల్పించి రామ సోదరులను సీతకు దూరం చేస్తే పని సులువౌతుందని హితవు చెప్పింది .ఈ పన్నాగాన్ని మారీచుడు హర్షించలేదు శీలవతి,రామపత్ని సీతను అపహరించటం వినాశనమని చెప్పాడు.రావణుడు లోక రావణుడు కనుక వాడి మాట పెడ చెవిని బెట్టి తాను చెప్పినట్లు చేయాల్సిందేనని బెదిరించాడు ..అప్పుడు మారీచుడు బంగారు మచ్చల మాయలేడి వేషం ధరించి సాయంకాంతిలో ధగధగ మెరిసిపోతూ కనిపించి చూసేవారికెవరికైనా పరవశం కలిగేట్లున్నాడు .మాయలేడి వర్ణన మల్లినాథుడు 10 శ్లోకాలలో రమణీయంగా వర్ణించాడు ..లేడిని చూసిన సీత వ్యామోహం తో దాన్నితీసుకురమ్మన గానే పట్టటానికి వెంటనే వెళ్ళాడు .మధ్యలో ఒక బాణాన్ని దానిపై సంధించాడు . ఆదెబ్బకు గిలగిలా తన్నుకుంటూ అది ”హా సీతా హా లక్ష్మణా ”అని మగగొంతుకతో మాయగా అరిచింది .అది రాక్షసమాయని లక్ష్మణుడికి తెలిసి ఆమె కు చెప్పినా నమ్మక తనభర్త రాముడు ప్రమాదం లో ఉన్నాడనుకొని నమ్మి అతనిని సహాయంగా వెళ్ళమని బలవంత పెట్టింది .ఎంతకూ కదలకపోతే చాలా నీచంగా మాట్లాడింది .–”నాహం వయస్య మిహిరవ్యపాతోదినాశ్రియహ్ పావక మావి శ0త్యాహ” ఇక ఆగలేక అతడు వెళ్ళగానే రావణుడు వచ్చి సీతను బలవంతంగా ఎత్తుకుపోయాడు .దారిలో జటాయువు రావణ బారినుండి సీతను రక్షించే ప్రయత్నం చేశాడుకాని విఫలుడయ్యాడు .సీత దుఃఖం తో విలపిస్తుంటే ప్రపంచమంతా దుఃఖం తో శోకం తో కన్నీళ్లతో విలపించింది అన్నాడు మల్లినాథుడు ..
7 వ సర్గ లో రామ లక్ష్మణుల దిగులు విచారం వర్ణితం .సీతాపహరం తో రాముని వియోగ వేదన వర్ణనాతీతమై ఆమె స్మృతులను నెమరేసుకొంటూ తిరిగాడు తమ్ముడితో . .సీతా వియోగాన్ని భరించలేకఆమె ప్రతి లతా చెట్టు పక్షి ,నెమలితో స్నేహంగా మెలిగిన దృశ్యాలను జ్ఞాపకం చేసుకొంటూ మరింత కుమిలి పోయాడు ”అభిసంగ విహ్వలుడనైననన్ను ఎడబాసి ఉండవద్దన్నాడు మరింత గా మానసికంగా కుంగి స్వీయనిందను మోపుకొంటూ సీతను క్షమించమని రెండు చేతులూ ఎత్తి నమస్కరించి ప్రార్ధించాడు రాముడు అని రాశాడు మల్లినాథుడు ..దుఃఖం లో మునిగి వివేకం కోల్పోవద్దని లక్ష్మణుడు అన్నతో అన్నాడు . సీతాన్వేషణలో సోదరులిద్దరూ దండకారణ్యం లో అడుగడుగు వెతుకుతుకు ముందుకు వెళ్లగా అవసాన దశలో ఉన్న జటాయువు కన్పించి రావణుని సీతాపహరణాన్ని వివరించాడు .
క్రమంగా రాముని మానసిక స్థితి మారి ఆగ్రహం తో రగిలిపోయాడు .రావణుడు సీతను ఎత్తుకు పోయి ఇంకా వాడు బతికి ఉండటం చూసి తన విల్లు ఏమీ చేయలేక అవమానం తో వంగిపోయింది అనుకొన్నాడని మల్లినాథుని రాసిన శ్లోకం మెచ్చదగింది .భావ లోలత్వానికి గురికావద్దని తమ్ముడు చెబుతూనే ఉన్నాడు మానవ జీవితం లో సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి నిబ్బరంగా ఉండాలి .వివేకమున్నవాడు బాధపడడు కర్తవ్యమ్ ఆలోచిస్తాడు .దైవ నిర్ణయాన్ని శిరసా వహించమని , విధికి ఎవరైనా తలవంచాల్సిందేనని ధైర్యం చెప్పాడు ..సీత కాలి ఆభరణమైన కడియాలు కనిపించగానే మళ్ళీ గొల్లుమన్నాడు. జ్ఞాపకాలలో కూరుకు పోయాడు . మళ్ళీ తమ్ముడు అన్నకు దుఃఖం కానీ సుఖం కానీ శాశ్వతం కాదు అని ”తలంటాల్సి ”వచ్చింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా

