పీఠాధిపత్యం బందిఖానా అని పారిపోయిన పీఠాధిపతి
హిమాలయాల్లో హాయిగా అంతర్ముఖుడై తపస్సు ధ్యానం చేసుకొంటున్న ఒక యువ శిష్యుడిని గురువుగారు పిలిచి ఆరునెలలు నర్మదా నదీ తీరం ఏకాంత ప్రదేశం లో లోకఠిన నియమాలతో ధ్యానతపస్సులు చేస్తూ గడిపిరమ్మని పంపాడు .సరే నని శిష్యుడు నర్మదానదీతీరం లోని ఓంకార క్షేత్రానికి సుమారు యాభై కిలోమీటర్ల దూరం లో ఖేరిఘాట్ కు దక్షిణానఉన్న అరణ్యం కు వెళ్ళాడు .అక్కడి నర్మదా నది మొసళ్లమయంగా ఉండేది .ఉదయాన సాయం వేళల మొసళ్ళు హాయిగా నది ఒడ్డుకు వచ్చి ఇసుకలో పడుకునేవి ఈ శిష్య స్వామి అక్కడే ఆరు నెలలు ధ్యానం లో గడిపాడు .కానీ ఒక్కనాడూ ఆయన తపస్సుకు ధ్యానానికి అవి భంగం కలిగించలేదు .ఈ యువ సాధకుడివద్ద ఒక చిన్న నీళ్ల కుండ ,ఒక దుప్పటి ,రెండు అంగోస్త్రాలు మాత్రమే ఉండేవి ..ఆరుమైళ్ళ దూరం లో ఉన్న గ్రామస్తు లు యువ స్వామికి పాలు గోధుమ రొట్టె రోజుకొకసారి తెచ్చిపెట్టేవారు .ఇలా ఆరునెలలు అతి కఠోర నియమ నిష్ఠలతో ధ్యాన తపస్సులలో గడిపాడు .ఒకరోజు పెద్ద వేటగాళ్ల బృందం అక్కడికి వచ్చి సుమారు రెండుమూడు గజాల దూరం ఉన్న మొసళ్ళమధ్య ఏకాంతం గా చలనం లేకుండా ధ్యాన నిమగ్నమైన స్వామిని చూసిఆశ్చర్యపోయి స్వామికి తెలియకుండా ఫోటో తీసి పేపర్లకు పంపారు .అవి అన్ని వార్తా పత్రికలలో ప్రచురితమై సంచలనాన్ని కల్గించింది . అదే సమయం లో కరివీర పీఠ శంకరాచార్యస్వామిడా. శ్రీకూర్కొటి . గీతా రహస్యం రచించిన బాలగంగాధర తిలక్ కు సన్నిహితుడు తమ వారసునిగా ప్రతిష్టించటానికి పదవికి తగిన వారికోసం అన్వేషిస్తున్నారు ..ఈ యువ స్వామి విషయం తెలిసి కొందరు పండితులను రహస్యంగా పంపి స్వామి చర్యలను గమనించమన్నారు .వాళ్ళు దగ్గర గ్రామం లో రహస్యంగా ఉంటూ స్వామి గురించి వింటూ చూస్తూ తెలుసుకొన్నారు .స్వామి కుటుంబ నేపధ్యం చదువు గురువు పవిత్రత అన్నీ తెలుసుకొని అసలు విషయం చెప్పి పీఠానికి వారసులుగా ఉండటానికి అంగీకారరించమని ప్రాధేయపడి యువస్వామిని కూర్కొటి వద్దకు తీసుకు వెళ్లారు ఆయనకు స్వామి నచ్చినట్లు కనిపించింది .వెంటనే యువస్వామి తమ గురువు ను దర్శించి ఆయన అనుమతి, ఆశీర్వాదం పొందాడు
18 రోజులు అనేక మంత్ర తంత్రాలతో స్నానాదులతో అన్ని రకాల మత సంబంధ విధులు నిర్వ హీంప జేసి కరి వీర పీఠ జగద్గురు శంకరాచార్యులుగా ప్రతిస్థాపనం చేశారు .అభినందిస్తూ వేలాది టెలిగ్రాములు వచ్చాయి .రోమ్ నుంచి పోప్ సందేశం తోపాటు ఎందరో మత గురువులనుండి ఎన్నో సందేశాలు అందాయి.రంగ రంగ వైభవంగా కార్యక్రమం జరిగింది .అప్పటికి ఈ యువ శంకరా చార్య వయసు 30 సంవత్సరాలే .ఆరు నెలల ఒంటరి కఠిన నియమ తపస్సు ఇంతటి గొప్ప పదవిని కట్ట బెట్టింది .
డా కూర్కొటి సాంఘిక మత సంస్కరణలు చాలా చేశారు .మఠం ఫైల్స్ అన్నీ అప్పగించారు విలువైన సమాచారం చాలా ఉంది ఎందరెందరికో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయాల్సి వచ్చేది .ఎన్నెన్నో బృందాలవారు వచ్చి సందర్శించి ఆశీర్వాదాలు అభిభాషణలు చేయమని కోరేవారు .దేశాటనం చేస్తూ ధార్మిక ప్రసంగాలు చేస్తూ క్షణం ఖాళీ లేకుండా గడపాల్సి వచ్చేది . పీఠం లో ఉదయం సాయంత్రం వేలాది భక్తులకు దర్శనం ఇవ్వాల్సి వచ్చేది .ఈ బిజీ షెడ్యూల్ లో తనకు స్వేచ్ఛ అనేది లేదని అర్ధమయింది కొత్త శంకరాచార్య స్వామికి .. తన ఏకాంతం, ధ్యానం తపం ఎగిరిపోయాయి ఇది నచ్చ లేదని పించింది . ఈ సుఖం సుఖం కాదనుకున్నాడు అంతరాత్మ ”నీకు తగిన పదవికాదు వదిలెయ్యి ”అని ప్రబోధించింది . రెండేళ్ల తర్వాత ఎవరికీ తెలియకుండా చేతిలో పైసా కూడా లేకండా కట్టుబట్టలతో బయటికి వచ్చి హాయిగా మళ్లీ హిమాలయాలలో ఒంటరిగా తపస్సు చేసుకొందామని తాను చేరాల్సిన గమ్యానికి చేర్చే రైలు లో మూడవ తరగతి పెట్టె ఎక్కి కూర్చున్నాడు .టికెట్ కొనటానికి చిల్లి గవ్వలేదు బైరాగి టికెట్ అంటారే అలా ఉంది పరిస్థితి .కాసేపయ్యాక కండక్టర్ వచ్చి టికెట్ ఏది అనిఅడిగితే లేదని చెబితే ఖరీదైన శంకరాచార్య దుస్తులు చూసి తర్వాత స్టేషన్ లో దిగిపొమ్మంటే దిగిపోయాడు .కానీ తానెవరో మాత్రం చెప్పలేదు .జీవితం లో ఆయన ఎప్పుడూ టికెట్ కొనకుండా ప్రయాణం చేయలేదు .కండక్టర్ కు వంగి నమస్కరించి ”నా మీద కేసు పెట్ట నందుకు కృతజ్ఞతలు ”అని చెప్పి దిగిపోయాడు .
ఇంతకీ ఈ స్వామి ఎవరో తెలుసా ?స్వామి రామా .అసలు పేరు బ్రీజ్ కిషోర్ దస్మన గురువు బెంగాలీ బాబా .స్వామి రామ 1925 లో ఘర్వాల్ హిమాలయాలలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి 1996 లో చనిపోయాడు .లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ ”అనే గొప్ప గ్రంధం రాశాడు .అమెరికాలో పెన్సిల్వేనియారాష్ట్రం లో హాన్స్ డేల్ అనే చోట సుమారు అయిదువందల ఎకరాలలో ”హిమాలయన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ యోగ సైన్స్ అండ్ ఫిలాసఫీ ”స్థాపించాడు అనేక దేశాల పర్యటన చేశాడు అక్కడా బ్రా0చీలను ఏర్పాటు చేశాడు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా
గబ్బిట దుర్గా ప్రసాద్
—
గబ్బిట దుర్గా ప్రసాద్

