వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -44
రఘువీర చరితం -3
ఎనిమిదవ అధ్యాయం లో రాముడు పంపానదిని చూసి పరవశించాడు ..అక్కడి ప్రకృతి అందాలకు పులకించాడు . మళ్ళీ సీతా దేవి గుర్తుకు వచ్చి విలపించాడు ..ఎవరో కొత్త వ్యక్తి వస్తున్నట్లు గమనించాడు వానరరాజు సుగ్రీవుడు హనుమంతుని పంపి విషయం ఏమిటో తెలుసుకోమన్నాడు .హనుమ తాపసి వేషం లో వచ్చి సోదరుల శరీర దారుడ్యానికి ,శూర పరాక్రమ ఛాయలకు సంతసించాడు -” దంత మౌక్తిక నిష్ఠ యుతా మనః కుముద కౌముదీ -కాంతి ర్గండు గాంబు గౌరీ వ వామేషా స్నాపయతీవ మామ్ ” అనుకోకుండా హనుమ వారిదేహ చ్చాయలను వర్ణించాడు -సుగ్రీవుని వద్దకు సోదరులను హనుమ చేర్చాడు ..మనసు విప్పి రామ సుగ్రీవులు మాట్లాడుకున్నారు .వాలితో ఉన్న అనుబంధాన్ని సుగ్రీవుడు వివరించాడు సోదరభావం ఒక చిన్న కారణం తో విరిగి పోయిందని అది యెంత గొప్పవాడికైనా మళ్ళీ అతికించటం సాధ్యం కానిపని అన్నాడు -అల్పేనాపి నిమిత్తేన సౌభ్రామం భిద్యతే తృణాం -పునస్త ప్రతి సంధానం మహాతాపి న లభ్యతే ”
తన విషాద జీవితగాధ వివరించాడు వానర రాజు ..రామ సుగ్రీవుల మధ్య స్నేహం గాఢమైన పిమ్మట సుగ్రీవుడు సీతాన్వేషణకు సహాయ పడతానన్నాడు . ప్రవాసితుడైన సుగ్రీవుడు నిబ్బరం గల బలశాలి అని రాముడు గ్రహించాడు ..అప్పుడు హనుమ ”రాముని కోరిక తీగ పుష్పించి ఫలిస్తుంది ”ఆనాడు-”స్ఫీత చాపల సంపర్క మర్కటే స్మిన్ ప్రసారితా -కేవలాతే కృపా వల్లీ ఫలం భధ్నాతు మా చిరం ”.రామాహనుమలు తమకు సూర్యుని తో సంబంధాన్ని గుర్తుకు చెచ్చుకున్నారు వాలిని చంపి వానర రాజు తో స్నేహాన్ని బలీయం చేసుకొంటాను అని సుగ్రీవునికి రాముడు అభయమిచ్చాడు .
తొమ్మిదవ అధ్యాయం లో రఘు వీర మహాకావ్యంను మల్లినాథుడు కాళిదాసు రఘువంశ 0లో తొమ్మిదవ సర్గ ను పూర్తిగా అనుకరించి రాశాడు .ముఖ్యంగా యమకాన్నిఅదే కోవలో దట్టించాడు .రఘువంశ వ్యాఖ్యానం రాసిన హేమాద్రి పండితుడు యమకాన్ని మహా గమకంగా నిర్వచించాడు –స్పాత్పాద పద వర్ణనామావృత్తిహ్ సంయుతా యుతా -యమకం భిన్న వాచ్యానామాది మధ్యాంత గోచరం -ఇతి వాగ్భటహ్ . ఇందులో యమకాలున్న శ్లోకాలు పదకొండుమాత్రమే రాముని దుఃఖ పరాకాష్టగా పర్వతాలను ,మేఘాలను నెమళ్లను మొదలైన వాటిని తన సీతను తనకు తెచ్చి ఇవ్వమని వేడు కోవటం వింత గా ఉంటుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—

