మధ్య యుగాల వైద్య విధానం -2(చివరిభాగం )
1322లో పారిస్ లో అయిదుగురు మహిళలనులైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నారని అరెస్ట్ చేసి విచారణ జరిపారు . అందులో జాక్వెలిన్ ఫెల్సీ అల్మెనియా ను రోగులను పరీక్షిస్తూ నాడి చూస్తూ మూత్రపరీక్ష చేస్తూ ,వాళ్ళ అవయవాలను ముట్టుకొంటున్నందుకు విచారించించగా ఎనిమిదిమంది రోగులు ఆమె వల్లనే తమ జబ్బులు నయమయ్యాయని మగ డాక్టర్లు చేయలేని పని ఈమె చేసిందని సాక్ష్యమిచ్చారు .కానీ జడ్జి మాత్రం ”ఆడవాళ్లకంటే మగ డాక్టర్ జబ్బుల్ని బాగా నయం చేస్తాడు ”అని చెప్పి ఆ అయిదుగురు మహిళలను చర్చిలో ప్రార్ధన చేయరాదని వాళ్ళు చచ్చాక నరకానికి పోతారని బహిష్కరించాడు .
ఫ్రెంచ్ సర్జన్ గైడి చలియాక్ డాక్టర్లకు కొన్ని నియమాలు సూచించాడు -నిరంతరం నేర్చుకోవాలి మర్యాద గా మన్ననగా ఉండాలి ,కస్టపడి పని చేయాలి ,పేద ధనిక భేదం లేకుండా వైద్యం చేయాలి .రోగి డబ్బు ఇస్తే తీసుకోవాలి . వద్దు అనరాదు .ఇవ్వకపోతే అడగరాదు . చికిత్స సమయం లో విన్నది అంతా రహస్యంగా నే ఉంచాలి ”
ఆ కాలం లో అనాటమీ ఫిజియాలజి లను పుస్తకం చదివే తెలుసుకునేవారు విద్యార్థులు .కోసి చూస్తే కొత్తగా తెలుసుకొనేది ఉండదని అభిప్రాయం ..ప్రిన్స్ ఆఫ్ మెడిసిన్ అని పిలువబడిన గాలేన్ దృష్టిలో మానవ శరీరం లో ప్రతి భాగాని కి ఒక ప్రత్యేక కర్తవ్యమ్ ఉంది .అని చెప్పాడు .గాలెన్ ను ప్రశ్నిస్తే దేవుడిని ప్రశ్నించినట్లే అని మతాధికారులు హెచ్చరించేవారు . 4 వ శతాబ్దిలో అభిప్రాయాలు మారి కొత్తవాటికి స్థానం లభించి బొలోనా యూనివర్సిటీ లో మొదటిసారిగా డిసెక్షన్ ను విద్యార్థులు చూసే అవకాశం కలిపించారు .. తర్వాత వారే డీసెక్ట్ చేసే స్థితి వచ్చింది సర్జన్ గై డి చాసిలియా చాలా వైద్య గ్రంధాలు రాసి ,అనాటమీ జ్ఞానం అనేది పుస్తకాలు చదివి సంపాదించవచ్చు డీసెక్ట్ చేసి సంపాదించవచ్చు అని తెలియ జేయటం తో దృక్పథమే మారి పోయింది .జాన్ ఆఫ్ సాలిస్ బరి డాక్టర్లను ”రోగి జబ్బుతో ఉన్నప్పుడే మీ ఫీజు నొక్కేయండి వాడు ఛస్తే మీ నోట మట్టే ”వంటి హెచ్చరిక చేశాడు .మెదడు లో రక్తం గడ్డ కట్టితే జలగలను అతికించి చెడు రక్తం పిండించేవారు .మనవాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు .కంటి రెప్ప మీద గడ్డ లేస్తే సమానపాళ్ళలో ఉల్లి వెల్లుల్లికలిపి నూరి సమపాళ్లలో వైన్ , ఎద్దు పిత్తాశయ సారం కలిపి దానిలో పైన తయారు చేసిన చూర్ణం కలిపి ఇత్తడి పాత్రలో పెట్టి తొమ్మిది రాత్రులు ఉంచి గుడ్డతో వడపోసి రాత్రిపూట పక్షి ఈకతో దీన్ని కంటి రెప్పపై లేచిన కురుపు పై అద్దాలి .అది చక్కగా పని చేసి కురుపు మటుమాయం అయి ఆశ్చర్యం కలిగించేది .
బ్లాక్ డెత్ అని పిలువబడే ప్లేగు నుండి బతికి బయట పడటం ఉండేదికాదు దైవ చేస్ట గానే దాన్ని భావించేవారు ,1365 లో దీనిపై జాన్ ఆఫ్ బర్గండి ఒక పుస్తకం రాశాడు .అందులో ప్లేగు బారినుంచి తప్పించుకోవటానికి ఎక్కువగా తినద్దు తాగద్దు స్నానం మానేయాలి ,చలికాలం లో వేడికోసం మంటలు వేసుకోవాలి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పెర్ ఫ్యూమ్స్ పీల్చి వెళ్ళాలి వేసవిలో ప్లేగు వస్తే చల్లని పదార్ధాలు తినాలి తిన్నదానికంటే ఎక్కువగా నీళ్లు తాగాలి ,మిరియాలు ,ఉల్లి వెల్లుల్లి వంటి వేడిని ఎక్కువ చేసే వస్తువులను వాడరాదు ,పిల్లలు తలిదండ్రులను ఎదిరిస్తున్నందున దేవుడు వాళ్ళని తీసుకు పోవటానికే అంటురోగాలు కలిగిస్తున్నాడు ”అని హెచ్చరించాడు .తరువాత తరువాత ప్లేగు రోగులను విడిగా దూరం గా ఉంచటం ,ఇంట్లో ఎలుకలు చావటానికి మందుగాస్ పెట్టటం వచ్చాయి .పరిశుభ్రత పాటిస్తే కొంతనయ0 .
కాంటర్ బరి స్టోరీస్ లో చాసర్ శరీరం లోని నాలుగు హుమర్స్ గురించి కవిత్వం చెప్పాడు .గ్రీకులు మానవ శరీరం లో నాలుగు మూల ద్రవ్యాలు ఉన్నాయని అవి సమాన పాళ్ళలో ఉంటె శరీరం ఆరోగ్యంగా ఉంటుందని బాలెన్స్ తప్పితే రోగాలు వస్తాయని చెప్పారు . అవే బ్లాక్ బైల్ ,ఎల్లో బైల్ ఫ్లీజిం అనే కఫము ,రక్తం ,మన ఆయుర్వేదం లోనూ వాత పిత్త కఫ రక్తం ఉన్నాయి . .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా
