వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -45
రఘు వీర చరితం -4
పదవ అధ్యాయం లో శరదృతు వర్ణన చేశాడు మల్లినాథుడు . సుగ్రీవుని తాత్సారం పై మొదట్లో రాముడు సందేహించినా ఆతర్వాత రావణ సంహారానికి సుగ్రీవుడు అనంత వానర సైన్యాన్ని సిద్ధం చేశాడని తెలిసి సంతోషించాడు .విజయం హనుమవల్లనే సాధ్యమని రాముడు హనుమతో అన్నాడు .తన అంగుళీయకాన్ని హనుమకిచ్చి సీతాదేవికి ఇవ్వమన్నాడు ..ఆమె తో చెప్పవలసిన విషయాన్ని వివరించి చెప్పాడు .వానర సైన్యం దక్షిణానికి కదిలి సముద్ర తీరం చేరింది .అప్పుడు హనుమ వానర నాయకులతో తాను విష్ణు మూర్తి అనేక అవతారాలకు ప్రత్యక్ష సాక్షి నని అని చెప్పి వానరులకు ఆశీస్సులు పలికాడుహనుమ .
11 వ అధ్యాయం లో లంకకు ప్రయాణమయ్యే హనుమ వైఖరిలో భిన్నత్వం గోచరిస్తుంది .ఖగోళ దివ్య మూర్తులందరు హనుమ విజయాన్ని కాంక్షించి శుభం పలికారు .హనుమ సముద్ర లంఘనంవిష్ణుమూర్తి ఆదివరాహం ను జ్ఞప్తికి తెస్తుంది ..దారిలో ఆయన చేసిన సాహస కృత్యాలు లంకలో ప్రవర్తించిన తీరు కవితాత్మకంగా సూరి వర్ణించాడు .సీత జాడ ఎక్కడా కనపడనందున కొంత నిరాశ చెందాడు .సేవకునిగా కర్తవ్యమ్ చేయలేకపోయానని బాధ పడ్డాడు -ఫల్ల0తి చే త్స్వామి గుణా హ్ సమస్తాః క్రియా విమూడా యది భృత్య దోషాహ్ -నిరంతర కలేశనిదాన భూతా దిగీ దర్షిం కిడంకర తమానాయాం ‘. ఆత్మా న్యూనతా భావం తో ఆత్మహత్యకూ సిద్ధమయ్యాడు . మళ్ళీ స్థిర చిత్తుడై సీత ఎక్కడ ఉన్నా కనిపెట్టి తీరుతాను అనుకున్నాడు ..అశోక వనం లో రాక్షస స్త్రీల మధ్య దీన వదనం తో ఉన్న స్త్రీని చూసి సీతా దేవి యే అని నిర్ణయానికి వచ్చాడు .
13 వ అధ్యాయం సీతాంజనేయ సంభాషణం .సీతాపహరణం దగ్గర నుంచి జరిగిన విషయాలు హనుమ సీతకు వివరించి చెప్పాడు .సీతా విరహం తో రాముడు పొందిన వేదనను వివరించాడు .ఒకసారి నెమలి ఈకలను చూసి సీత తలలో అలంకరించుకున్నరాలిన పుష్పాలుగా భ్రమించి వెంటపడ్డాడని చెప్పాడు .సీత లేని రాముడు రాముడు కాదన్నాడు .సీతను చూడటానికి మాత్రమే లంకకు తానూ రాలేదని రామ ముద్రికను ఇచ్చి ఆమెకు సంతృప్తి కలిగించటానికి వచ్చానని అన్నాడు ..తనపై దయ చూపమని .ఆమె గుణ గణాలను సంబోధన ప్రధమా విభక్తిలో వర్ణించాడు -”స్వామిని స్థిర శుచి వ్రతే సతీమార్గ సంచరణా పూర్వ గామిన్ -విప్ర యుక్త రఘునాధ జీవిత మ్లాని హరిణి దశా పునీహి మామ్ ”.
సీతా దేవి కాకాసుర వృత్తాన్తమ్ జ్ఞప్తి చేసి తనను అలక్ష్యం చేయట0 తగదని ప్రార్ధించి చెప్పానని చెప్పమన్నది .తర్వాత లంకాదహనం మళ్ళీ అంగదాదులతో రామ సుగ్రీవ సందర్శనం సీత ఇచ్చిన చూడామణి రామునికివ్వటం ,అందరు లంకపై దాడికి సిద్ధమై సముద్ర లంఘనం చేయాలనుకోవడం నలుని నాయకత్వం లో వారధి నిర్మించటం వర్ణితం .
14 వ సర్గ లో లంకలో రాక్షస వానర భీకర యుద్ధం ,విద్యుజ్జి0హుడు ఒక భూతాన్ని సృష్టించి వానరులను భయపెట్టటం ,మాయ రామ తలకాయ తెచ్చి సీతను బెదిరించటం .నాగ సైన్యాన్ని రామ సైన్యంపై ఉ సిగొల్పటం గరుత్మంతుడు దీన్ని ఛేదించి కాపాడటం గరుత్మంతుడు రావణ కుటుంబ సర్వ నాశనాన్ని ఊహించి చెప్పటం ,తర్వాత ఎన్నో క్షిపణులతో ఘోర సంగ్రామం జరగటం కుంభకర్ణ వద్ద తో సమాప్తం .
16 వ అధ్యాయం రావణ సేనానులైన అతికాయాదుల మరణం ,ఇరువైపులా అనేక యోధుల హతహమ్ మేఘనాధుడు యుద్ధానికి రావటం భయంకర యుద్ధం లో వానరులు వీరోచితంగా పోరాడటం హనుమాన్ వానరులకు ఉత్సాహం తెప్పించటం బ్రహ్మాస్త్రాన్ని వాడు ప్రయోగిస్తే లక్ష్మణుడు దాని ప్రభావాన్ని నిర్వీర్యం చేయటం ,కుంభకర్ణ ఇంద్రజిత్ వగైరా చనిపోయాక రావణుడు సూటిగా రాముని తో తలపడటం ,రావణుడు మంత్రం శక్తిని ప్రయోగించి రామునిపై వేయటం ,అగస్త్య ముని వచ్చి సూర్య తేజం తో విఫలం చేయటం ,రాముడు దశ కంఠ రావణ శిరచ్చేదం చేయటం -”శిరామి తత్స లూనాని తేన సర్రవాని రేజిరే -శిఖర ణీవ నీలాద్రే ధాతు లిప్తాని వాజిణా ” రవాణా సంహారణాన్తరం శివ బ్రహ్మాది దేవతలు వచ్చి రామ పరాక్రమాన్ని ప్రస్తుతించటం ,సీత అగ్ని పునీత యై రావటం ,విభీషణుని లంకా పట్టాభిషేకం ,హనుమంతుడు తెచ్చిన పుషప్పక విమానం లో అందరు ఎక్కి అయోధ్యకు బయల్దేరటం తో పూర్తి .
17 వ అద్యాయం లో ఆకాశ విమాన ప్రయాణం ముఖ్యమైన ప్రదేశాలు రాముడు సీతకు చూపించటం ,వింధ్యపర్వతాలు ,పంపానది మతంగ ముని ఆశ్రమం గోదావరినది ,పంచవటి భరద్వాజ,శరభంగా శ్రమాలు ,పవిత్ర గంగా యమునా సరయు నదులు,చిత్రకూట పర్వతాదులు చూపిస్తూ గాధలను వివరించి చెప్పాడు రాముడు సీతకు . రాముడు అయోధ్యలో కాలుపెట్టగానే ప్రజలు సంతోషం తో బ్రహ్మ రధం పట్టటం ,కౌసల్యాది మాతలు గురువు వశిష్ఠమహర్షి మంత్రి సుమంత్రుల పరమానందం ,వసిష్ఠ మహర్షి ఆధ్వర్యం లో సర్వ సాగర నదీ జలాలతో అభిషేకించి శ్రీ రామ పట్టాభిషేకం చేయటం తో రఘువీర చరిత కావ్యం సమాప్తమవుతుంది. .
రఘువీర చరితం మహాకావ్యం లో ముఖ్య విశేషాలు
1-ఇతర మహా కావ్యాలలాగానే వాల్మీకి రామాయణం ఆధారం గా రాయబడింది
2- కావ్యమర్యాదలన్నీ పాటించి వర్ణనలు చేశాడు సుతీక్ష్ణ ఆశ్రమం దండకారణ్యం అగస్త్యాశ్రమం పంచవటి వర్ణనలు మహా కవి లాగా మల్లినాథుడు చేశాడు ప్రకృతి వర్ణనలకు ”కులక ”శ్లోకాలను .చక్కగా ఉపయోగించాడు .
3-ప్రతి అధ్యాయం లో ఒక్కొక్క ప్రత్యేక ఛందస్సును ఉపయోగించాడు .అధ్యాయం చివర ఒకటి రెండు శ్లోకాలను వేరేఛందస్సులో రాశాడు
4-సాధారణం గా మహా కావ్య నాయకుడు దివ్య క్షత్రియ వంశ సంజాతుడై ఉంటాడు కానీ ఇందులో శ్రీరామ ,లక్ష్మణ ,,హనుమ లు ముగ్గురూ నాయకులే అవటం విశేషం
5-కావ్యం లో అనేక అలంకారాల శోభ ఉంటుంది..శబ్దాలంకారమైన అనుప్రాస ఒక శ్లోకం లో మహా ,హర్ష ,సమ్ ,ద్ ,నిశ్చిత్ అనే పదాలు పునరా వృత్తమై,కొత్తరకమైన అందమైన ప్రాస కు జీవం పోసింది -”తయేతి నిశ్చిత్య స నిశ్చితాయోమ్ మహీయ సస్తత్య మహేంద్ర వీర్యహ్ -ప్రహర్ష వర్షేన్దుర ధీర్మ హర్షే రుపాశదంత పాద సరోజ రేగుణం ” .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా .
–

