వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -47
మల్లినాథుని గ్రంథ విమర్శనా సరళి
ప్రాచీన సంస్కృత గ్రంధాలు దేశం లో విభిన్న ప్రాంతాలలో ఉన్నవారు రచించారు … అందుకని వాటిలో అనేక రకాలపాఠాలు ఉన్నట్లు కనిపిస్తుంది . వ్రాయసగాని అశక్తత ,లేక అక్షరాలను అర్ధం చేసుకో లేకపోవటం కారణాలుకావచ్చు ..మరోసారి అనుకున్న భావం ఆపదం తెలియ జేయలేకపోయిందని రాసేవాడు మరో పదాన్ని దాని బదులు చేర్చి ఉండచ్చు ..మన క్లాసికల్ సాహిత్యం ప్రతి దానికీ అనేక పాఠాలు కనిపిస్తాయి .. వేదానికి ఒక్క దానికి మాత్రమే ఈ అనేక పాఠాలు కనిపించవు .అది ఎక్కడైనా ఒకే రకమైన పాఠంగా దర్శన మిస్తుంది ..కనుక సాహిత్య గ్రంధాలలో పాఠక భేదాలు కనిపిస్తాయి .దీనికి కారణాలు -1-ఒకే రకమైన అక్షరాలూ ,అక్షర సముదాయాలు 2-పదాలను తప్పుగా విడగొట్టటం లేక కలపటం 3-అక్షరాల మార్పిడి 4-ఉచ్చా రణలో దోషాలు 5-కొత్తపదా లను అర్ధం తెలీకుండా కూర్చటం 6-పంక్తుల మధ్య ,రాసింది కప్పి వేయబడటం
ఇవి కాక’’ కార్తె’’ మరి కొన్ని కారణాలు చెప్పాడు .మరి కొందరు మరిన్ని కారణాలు కనుగొన్నారు ..వ్యాఖ్యాత తానూ దేనిపై వ్యాఖ్యానం రాయ బోతున్నాడో దాని సరైన పాఠాన్ని ఎన్ను కుంటాడు ..పాఠక భేదాలుంటే పదం అర్ధం భావం కూడా మారిపోతాయి ..దీనివలన వ్యాఖ్యాతల మధ్య అభిప్రాయం భేదాలేర్పడతాయి .తమకు నచ్చినదాన్ని తీసుకొని మిగిలిన వాటిని ప్రక్కకు పెట్టటమే ,లేక లెక్క చేయకపోవటంతో జరుగుతుంది .ఇవన్నీ గమనించిన మల్లినాథుడు పాఠక భేదాలన్నీ తెలుసుకొని ,చర్చించి మంచి చెడు తేల్చి వాటిలో గుణగ్రాహకమైన వాటిని స్వీకరించాడు .సరైన పాఠాన్ని గ్రహించటానికి మల్లినాథుడు మూడు పద్ధతులు పాటించాడు -1-ఒక్కోసారి వాటిని గూర్చి ఊరికే చెప్పటం 2-మరోసారి వాటిని క్షుణ్ణంగా చర్చించి నిగ్గు తేల్చటం 3-తనకు నచ్చిన పాఠాన్ని గ్రహించి మిగిలిన వాటిని ,వాటిపై వ్యాఖ్యానం రాసిన వారినీ తిరస్కరించటం -రఘు వంశం లో 1-19 లో మల్లినాథుడు’’ శాస్త్రేష్వ కుణి ఠతా వృద్ధిహ్ ‘’ను ఇచ్చి వ్యాపృత పాఠ0 అన్నాడు ..రఘు వంశం -5-23 లో ‘’ప్రత్యగ్రహీత్సంగ గర మగ్రజ న్మా ‘’అనే దానికి ‘’తాంగిర0 ఇతి కేచిత్ పఠన్తి ‘’అని వ్యాఖ్యానించాడు
మరికొన్ని చోట్ల మల్లినాథుడు కారణాలు ముఖ్యంగా వ్యాకరణ విషయం లో తెలియజేసేవాడు -కుమార సంభవం లో 5-13 లో సూరి ‘’ద్వయీ ‘’అనే మాటను తిరస్కరించి ‘’ద్వయే ‘’ను సమర్ధించాడు .పాణిని ప్రకారం ద్వయీ అనేది ద్వయ మొదలైన వాటి స్త్రీలింగం అని దాని అర్ధం -’’ద్వై అవయవై యస్యాహః సా ‘’అని అంటే రెండు అవయవాలున్నదని భావం అని ఇది సందర్భానికి తగిన మాట కాదని చెప్పాడు .
కుమార సంభవం లో ‘’శుభ్రు ‘’పదాన్ని గురించి ‘’విమానానా శుభృకృతః పితుగృహే ‘’లో శుభ్రు పద ప్రయోగం లో అవమానం ఏమీ లేదు ‘’అందమైన కనురెప్పలుగల పితృగృహం లో ఉన్న ఓ పార్వతీ ‘’అనటం లో తప్పేమీ లేదని సమర్ధించాడు .కొందరు వ్యాఖ్యాతలు శుభ్రు అనేది వ్యాకరణ విరుద్ధ శబ్దం అన్నారు .మరొక పాఠాన్ని తీసుకొని వారివాదాన్ని సమర్ధించుకున్నారు ..మల్లినాథుడు వారి వాదాలను నిర్ద్వంద్వముగా తిరస్కరించి శుభ్రు నే సమర్ధించాడు .మేఘ దూతం లో కాళిదాసు ‘’సగంధ ‘’ పదం వాడితే లక్ష్మీ నివాసుడు ,మహిమాగని మొదలైన వ్యాఖ్యాతలు ‘’సగర్వ ‘’అన్న పాఠక భేదాన్ని సమర్ధించారు ..ఆపదం పై మల్లినాథుడు విభేదించలేదు కారణం రెండూ ఆ సందర్భం లో సమాన అర్ధాన్నే ప్రతిపాదిస్తున్నాయన్నాడు .దీనికి ‘’విశ్వ కోశం ‘’నుంచి ఉదాహరణ చూపించాడు -’’గంధో గంధక ఆమోదే లేశే సంబంధ గర్వయోహ్ ‘’.శాకుంతలం లో కూడా కాళిదాసు ‘’సగంధ ‘’శబ్దమే వాడాడు .
మరికొన్ని చోట్ల ఇతర వ్యాఖ్యాతలు ఉదహరించిన పాఠక భేదాలను తిరస్కరిస్తూ కారణాలు చక్కగా స్పష్టపరచాడు మల్లినాథుడు ..అలాకామ్ పదాన్ని దక్షిణావర్త నాధుడు ఒప్పుకున్నాడు .ఉత్తర మేఘం లో ‘’ఆలకే బాల కుందాను విధ్వం ‘’పై మల్లినాథుడు వ్యాఖ్యానిస్తూ -’’’’అలక మితి ప్రధమాంత పాఠే సప్తమీ ప్రక్రమ భాంగః స్యాత్ -నాధ స్తు నియత పుంలింగతా హానిశ్చేతి దోషాన్తరా మహతా దసత్ -స్వాభావ వక్రణ్య లకాని పారిత మురహ్ -కృత్సనీ ధరహః ఖండితః ఇత్యాదిషు ప్రయోగేషు నపుంసక లింగ గతాదర్శనాత్ ‘’
మరొక చోట ‘’మహాభాగా ‘’పదాన్ని మల్లినాథుడు సంబోధక ప్రధమా విభక్తిగా భావిస్తే ,భక్తి హేమాద్రి ,చారిత్రిక వర్ధనుల ’’తాయా ‘’ను తీసుకొని రెండూ నైరూప్య నామవాచకం యొక్క విభాగాలు అన్నాడు .-’’భక్తిహ్ ప్రతీక్షేషు కులోచితా తే పూర్వాన్ మహాభాగ తాయాతి శేషే ‘’-’’పూర్వాన్ మహా భాగవతయా విశేషే ‘’.
మేఘ దూతం లోని ‘’కామార్త హి ప్రక్రుతి కృపణా శ్చేతనా చేతనేషు ‘’వాక్యాన్ని ‘’ప్రణయక ప్రనాహ ;;పాఠం నువ్యాఖ్యాత వాసుదేవ అంగీకరించాడు ప్రణయ పదం ప్రార్ధన అనే అర్ధాన్ని ఇస్తోందికూడా .దీన్ని విక్రమోర్వశీయం లో కూడా కాళిదాసు వాడాడు .మల్లినాథుడు ప్రక్రుతి ప్రాణాహుని పాఠాన్ని గ్రహించాడు .ప్రేమికులలో ఉండే జ్ఞాన అజ్ఞాన వివరణలను ఇది సూచిస్తుందని మల్లినాథుని భావన .ఇక్కడ ప్రార్ధన అనే అర్ధం సరికాదు అని చెప్పాడు సూరి
రఘు వంశం లోని ‘’మరుత్సఖస్యేవ బలాహకస్య గతిర్విజ ధ్నే నహి తప్రతస్య ‘’వాక్యం తప్పనిసరిగా పరిశిలింప దిగింది ..వసిష్ఠుని శరీరం శక్తిని ప్రదర్శిస్తోంది దాన్ని గాలి గాలి అడ్డుకోలేక పోతున్నాయి ఇక్కడ మారుత్సఖ పదాన్ని బహువ్రీహిగా భావిస్తే పదం అందం చల్లారెట్లు పెరుగుతుంది పాణిని ప్రకారం అది తత్పురుష .మల్లినాథుడు పాణిని నే అనుసరించాడు హేమాద్రి ,చరిత్ర వర్ధను లు కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొన్నారు -’’మరుతః సఖేతి తత్పురుషో ,బహువ్రీహో సమాసాంతా భావత్ ‘’
మల్లినాథుడు అనేక చోట్ల అన్య పాఠాలను తిరస్కరించాడు శిశుపాల వధలో బాహ్లికుని అశ్వాలు రేపిన ధూళి వర్ణన ఉంది .భూమిపై గుర్రం యొక్క కదలిక లు ప్రేయసీ ప్రియుల సంధానంలాగా ఊహించాడు కవి .గుర్రం నిస్శ్వాసం దుమ్ముకణాల వెదజల్లుడుగా ఊహించాడు . భూమిపై వెంట్రుకల వ్యాప్తిలా అనిపించింది .ముక్కు పుటాలు ఎగర వేయటం రోమాలు నిక్కబొడుచుకొని మరింత ధూళి లేవటంగా అనిపించింది -’’నాసా విరొక పవనోల్లసితంతమీ యో -రోమాంచనామివ జగన్ రజః పృధివ్యాహ్ ‘’
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా
—

