ఆత్మానందారామం
నిరతాన్నదాత అపార అన్నపూర్ణ కీశే శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఇని మనవడు శ్రీ డొక్కా రామ భద్ర గారు నాకు నాలుగేళ్ల క్రితం సీతమ్మగారి ని మళ్ళీ తెలుగు వారికి పరిచయం చేస్తూ సరసభారతి నిర్వహించిన కార్యక్రమం తో పరిచయమయ్యారు ఆమె పేర నగదు బహుమతులను పేద ప్రతిభగల విద్యార్థులకు సరసభారతి చేత 10 వేల రూపాయలు అందింపజేస్తూ వారి తలిదండ్రులను పాల్గొనేట్లు చేశారు .
మళ్ళీ 2017 ఏప్రిల్ లో మేము అమెరికా లో షార్లెట్ కు మా అమ్మాయి గారింటికి రాగానే ఫోన్ చేసి కుశలప్రశ్నలడిగి ఆస్టిన్ రమ్మని కోరారు నాలుగు రోజులక్రితం మేము ఇండియా వచ్చేవారం లో వెడుతున్నామని తెలిసి ఫోన్ చేసి తమ పుస్తకాలు పంపిస్తామని చెప్పి అభిప్రాయం రాయమని కోరి పంపగా ఇవాళేమధ్యాహ్నం చేరాయి అందులో ‘’ఆత్మానందం ‘’ను ఇప్పుడే ఆబగా చదివేశా బహుశా నేను రాయటానికి ఏమీ లేదు జగమెరిగిన వారిని నేనేం పరిచయం చేస్తానుచేయగలను ? ఆయన విద్వత్తు సామర్ధ్యం సేవ ల ముందు నేనెక్కడ నిలుస్తాను ?అయినా అడిగారుకనుక నా ధర్మం నేను నెరవేర్చాలిగా .ఆపని చేస్తున్నా .
ఇందులో 116 కవితాలున్నాయి అన్నీ అర్ధవంతమైనవి హృదయం లోపటి నుంచి వచ్చినవి ఆన0దాన్నిచ్చేవి. ఆనందం రామ్ గారు పొంది మననూ పాలు పంచుకోమంటున్నారు ..మధురపదార్ధాన్ని ఒంటరిగా తినరాదని పది మందితో పంచుకొంటే మాధుర్యం మరింత పెరుగుతుందని పెద్దల ఉవాచ ..రాంగారు సకల శాస్త్రాలు వేదాంతం ఔపోసనపట్టిన వ్యక్తి .కనుక వారేది చెప్పినా ‘’నిష్కర్షగా కర్కశం గా ‘’ నే ఉంటుంది .ఎందుకంటె అంత నిబద్ధత వారిది . కవితలకు శీర్షికలో ఆనంద దాయకాలుగానే ఉన్నాయి .నాకు నచ్చిన నేను గమనించిన వాటిని తెలియజేస్తాను . ‘’మనిషిని ప్రేమించి ,పయనాన్ని ఆస్వాదించి ,అక్షరాన్ని ఆరాధించి ,మాటను నియంత్రించి ,మార్పును ఆహ్వానించి ,సత్కార్యం సంకల్పించి ,శక్తిని గుర్తించి ,మానవత్వం ఆచరించి జ్ఞాన జ్యోతిని దర్శించి కాలం తో జతకట్టి ,ప్రకృతిని పరిశీలించి అంతరంగాన్ని జయిస్తే ఆనందో బ్రహ్మ’’ అని ‘’రామోపనిషత్ ‘’గా మొదటికవిత ‘’ఆత్మానందం ‘’లో చెప్పారు ‘
తనను సేవించవద్దని ,ఆరాధించవద్దని హితవు చెప్పారు .లేకుంటే అంతా’’ డేరాబాబా’’లై ,చివరికి ‘’’’మోసం గురో’’అని అఘోరించాలి ..కలలు కనటం కంటే వాటిని నిజం చేసుకోవటానికి ధైర్యం కావాలి ‘’ప్రణయం -ప్రళయం ,ప్రశ్న -సమాధానం ,ఖేదం -మోదం ‘’లాంటి ద్వంద్వాలనుఁ అర్ధనారీశ్వరంగా భావించి చెప్పి అవి విడదీయలేనివని అనుభవించాలని తత్వ బోధ చేశారు ‘’పదాలతో పరవశింప జేయటం -అక్షర బ్రహ్మ యోగం ‘’అని బాగా చెప్పారు .అందరి తో ఉంటున్నా కవి మానసికం గా ‘’ఒంటరి వాడే ‘’నన్న సత్యం బోధించారు .పక్షిలో ఉక్కు సంకల్పం చేప లో ఆత్మ విశ్వాసం కలుపుగోలుతనం మొక్కలో నిలువెత్తు చైతన్యం గమనించిన కవి శ్రీ డొక్కా .సృష్టిలో నీవెంత ప్రత్యేకమో -నీ ప్రతి సృష్టి అంత ప్రత్యేకం ‘’అంటూ రచనలోనైనా సేవలోనైనా ,పనిలో నైనా దాని ప్రత్యేకత ఉండాలి . కృషి యోగ సంబంధి అవాలి అప్పుడే అది పరిపూర్ణం మార్కెట్ సరుకైపోతున్న మనిషి కథను వ్యధతో దర్శించారు ..అన్నిరూపాల్లోనూ తానె దిగివచ్చిన వాడిని గుర్తించమని కోరారు .నీకు మిగిలిన సమయం లోనే బ్రతకడం లో ‘’ఆస్కార్ అవార్డు ‘’వచ్చేలా నలుగురితో నామినేట్ చేయించుకో ‘’అని సరికొత్త సినీ భాషలో చెప్పటం ఆయన పరిశీలనకు నిదర్శనం .త్వమేవాహం కవితలో ‘’నాలో నిన్నే గుర్తిస్తా -నీలో నేనే నర్తిస్తా ‘’అనటం ఆభావనకు పరాకాష్ట . ఉపనిషత్ రహస్యానికి సరైన అర్ధం .’’నిశ్శబ్దం నిఖిలత్వం -నిశ్శబ్దమే శాశ్వతం ‘’అనటం వేదాంతాన్ని ఎంతో లోతుగా తెరచిన వారికే సాధ్యమయే విషయ0 . అందుకే ‘’Un heard melodies are sweeter ‘’’’అన్నాడు ఇంగ్లిష్ కవి ‘’రామ్ దృష్టిలో ‘’ప్రతిపదం సృష్టికి ప్రతి రూపం ‘’అంటూ దాన్ని ‘’ప్రకృతి కూర్చిన వ్యాకరణం ‘’అన్నారు గడుసుగా ..కవికి ఒక సూచనగా ‘’అక్షరాలనుస్వేచ్ఛగా అందరిలో కలిసిపోనీ -తమ గుర్తింపు ను అవే సాధించుకొంటాయి ‘’ మంచి మాట .మనిషి ఎపుడో మరణించాడు ‘’అని బాధపడ్డారు .’’మార్పు నెగడు ‘’లో ‘’జన మానస సరోవరం లో భావ కుసుమమై వికసించటానికి ‘’లేచి రమ్మని కేకేశారు ‘’మిణుగురు లాంటి చిన్న ప్రశ్న లైనా ఆలోచన దివిటీలు వెలిగించాలి ‘’అనడం పరమ భావుకమకం గా ఉంది ‘’నిండు జీవితం లో నిజాయితీ వాకిట్లో నిజ జీవిత పుస్తకమై పరచు’’కొమ్మన్నారు స్వప్నం సత్యం చేసుకొంటే శాశ్వత శాంతి ఒప్పందం పై ఒక చిరు సంతకమై మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది .’’సెల్ఫీ ‘’‘’ని కవితాత్మకం చేసి రాయటం కవి కున్న పట్టు తెలియ జేసింది .మానవత్వపు మనసు ముగ్గు ‘’ను ముచ్చటగా తీర్చుకోవాలట ..చివరగా ‘’ప్రకృతి తత్త్వం ఆనందం -జీవన సత్యం ఆనందం -జగతి రహస్యం ఆనందం -జనహితమే పరమానందం ‘’అంటూ బహుజన హితాయ బహుజన సుఖాయచ ‘’అన్న ఆప్త వాక్యాన్ని అందంగా చెప్పారు .
నేను చెప్పినవి కొద్దిగానే .మీరు చదివి ఇందులోని మాధుర్యాన్ని ఆనందాన్ని అనుభవించండి .ప్రతికవితా రస బిందువే .ప్రతి ఉక్తి సూక్తి గానే దర్శన మిస్తుంది .ముద్రణ ,ముఖ చిత్రం కూడా అందంగా ఉన్నాయి . ఈ ‘’ఆత్మా నందారామం ‘’లో అందరూ భాగస్వాములవాలని కోరుతున్నా మరో పుస్తకం పై తర్వాత రాస్తాను .
గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-17 -కాంప్-షార్లెట్- అమెరికా
రామ్ గారి చిరునామా -rdokka@yahoo.com
cell-001-91-40-271-74577
.

