మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-9

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-9

            పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -4

                          ఎలక్ట్రానిక్ పారమాగ్నేటిక్ రిజోనెన్స్

3-నూతన విధానాలు

అయాన్స్ యొక్క EPR విశ్లేషణ లో భాగం గా స్పిన్ విలువ ఒకటి లేక ఒకటి కంటే ఎక్కువ ఉంటె ,సున్నా క్షేత్రం వద్ద క్రిస్టల్ ఫీల్డ్ పారామీటర్ విషయాలు తెలిసే వీలున్నది.సూటిగా ఈ సమాచారం రాబట్టటానికి వెంకటేశ్వర్లు గారి బృందం జీరో ఫీల్డ్ EPR స్పెక్ట్రా మీటర్  ను మైక్రో వేవ్ స్పెక్ట్రా మీటర్ గా   నిర్మించి GHz పరిధిలో సాలిడ్ సాంపిల్స్ యొక్క శోషణ (అబ్సార్ప్సన్ )గణించారు .ఇలాంటి స్పెక్ట్రా  మీటర్ ఇండియాలో ఇదే మొట్టమొదటిది .ఇది X,K బాండ్ లలో పని చేసే సామర్ధ్యం కలిగి ఉన్నది .ఈ స్పెక్త్రా మీటర్ ఉపయోగించి ఆయన బృందం అమ్మోనియం క్లోరైడ్ యొక్క డై వలేంట్ Mn ,ట్రైవలేంట్ Fe ల జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ల సమాచారం తెలుసుకున్నారు .EPR వలన ఎక్కువ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ సమాచారం గ్రహించటం చాలా కష్టతరం అయినందున వీరు రాబట్టిన సమాచారం చాలా ప్రాముఖ్యమైంది .

4-NLO పదార్ధాల EPR

ప్రేరణ ,అంతర్ దృష్టి ఆధారం గా వెంకటేశ్వర్లు గారు  ఘన పదార్ధాలలో  పాయింట్ డిఫెక్ట్ ల నిర్మాణ ధర్మాలను  ,తాను నాన్ లీనియర్ ఆప్టిక్స్ ,హోలోగ్రఫీ లపై పూర్తిగా దృష్టిని కేంద్రీకరించి పని చేస్తున్నా కనిపెట్టగలిగారు .ఫోటో EPRఅధ్యయనానికి అలబామా A and M యూని వర్సిటిలో ఒక లేబరేటరి నెలకొల్పి ,Ba Ti O3,Li Nb O3,బిస్మత్ సిలికాన్ ఆక్సైడ్ ల  ,ఫోటో రిఫ్రాక్టివ్ ల మెకానికల్ అన్వేషణ హాలోగ్రఫీ సంయుక్త పరిశోధనలకు తగినట్లు దీని నిర్మాణం చేశారు .ఆయన బృందం సూటిగా Fe3+మలినాలు ఫోటో ఇండ్యూసేడ్ చార్జి  మార్పు తెస్తాయని   ప్రయోగాత్మక పరిశోధనా సాక్ష్యాలుగా నిరూపించి ,ఇది B a T I O 3స్పటికాల నిర్మాణ గ్రేటింగ్ లో ప్రముఖ పాత్ర వహిస్తుందని చూపారు .దీని ఆధారం గా  ఫోటో రిఫ్రాక్టివ్ B a T I O 3స్పటికాలు ,మిగిలిన పీజో ఎలక్ట్రిక్  సిస్టం ల గ్రేటింగ్ లమోడల్స్ నిర్మాణాలకు  కొత్త  సూచనలు చేయగలిగారు .

5-న్యూక్లియర్ మాగ్నెటిక్ రెజోనెన్స్

ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటీలో ఉండగానే వెంకటేశ్వర్లుగారు NMRలో రిసెర్చ్ సౌకర్యాలు కల్పించారు .భారతీయ యూని వర్సిటీలలో ఇలాంటిది ఇక్కడే ప్రారంభమై దిశా నిర్దేశం చేసింది .తర్వాత కాన్పూర్ ఐ. ఐ.టి. లోనూ ఇలాంటి సౌకర్యం యేర్పరచారాయన .ఆయనా ఆయన విద్యార్ధులు H1,F19 ,Cl35,C13లలో న్యూక్లియర్ మాగ్నెటిక్ రిజోనేన్స్ పరిశోధనా ఫలితాలను అనేక రిసెర్చ్ పేపర్లుగా రాసి ప్రచురించారు .అతి ముఖ్యంగా NMR స్పెక్ట్రా యొక్క నాలుగు స్పిన్ విధానాలను అత్యంత స్పష్టంగా అధ్యయనం చేయగలిగారు .1- ఫ్లోరో 2-డై నైట్రో బెంజీన్ ,3-పారా డిస్ట్రిబ్యునల్  బ్యూటేడ్ బెంజీన్స్,ఆల్ఫా బీటా, గామా పైకోలైన్స్ లH1 ,F1ల రెజోనేన్స్ స్పెక్ట్రా  అధ్యయానాలు చాలా ముఖ్యమైనవి .ఫ్లోరో బెంజీన్స్ .పారా సబ్స్టి ట్యూ టెడ్ ఫ్లోరియో బెంజీన్స్ లో H1,F19 NMRస్పెక్ట్రా అధ్యయనాలు  చాలా ప్రశస్తమైనవి .ఆల్కలి క్లోరైడ్ లలో Cl 35 రెజోనేన్స్ అబ్జర్వేషన్స్  కూడా చేశారు .

  సి .యెన్ ఆర్ .రావు గ్రూప్ తో కలిసి థయో బెంజాయడ్ ఆసిడ్ ,ఫినాల్ ,అనిలిన్ ధయో ఫినాల్ ,ఇథనాల్ ,2,2,2 ట్రై ఫ్లోరో ఇథనాల్ మొదలైన మాలిక్యూల్స్ లలోని హైడ్రోజెన్ బాండింగ్ ను ఆసక్తికరంగా అధ్యయనం చేసి ఎన్నో కొత్త  ఆసక్తికర అవసరంమైన విషయాలు లోకానికి తెలియజేశారు .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-12-17 –ఉయ్యూరు

 

 

        


Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.