గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 (మూడవ భాగం )అంకితం ,స్పాన్సర్ వ్యాసాలూ వగైరా

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 (మూడవ భాగం )    రచన –గబ్బిట దుర్గా ప్రసాద్

 

అంకితం

 

దయార్ద్ర హృదయులైన హృద్రోగ నిపుణులు

శ్రీ డా .బండారు  రాధా కృష్ణ మూర్తి ,డా. శ్రీమతి సులోచన దంపతులకు

జీవిత విశేషాలు

జననం

ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణా నదీ తీరాన నందిగామ తాలూకా వేములపల్లి గ్రామం లో శ్రీ బండారు రాధాకృష్ణ మూర్తిగారు కీ. శే . శ్రీ బండారు రాజేశ్వర రావు ,కీ.శే .శ్రీమతి సత్యవతి దంపతులకు 1-7-1929 న జన్మించారు .వీరి అన్నగారు శ్రీభోగేశ్వరావు గారు స్వాతంత్ర సమర యోధులు ,నందిగామలో ప్రముఖ సాంఘిక సేవకులు .వీరికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు .అమరావతి పాలకులు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వీరి కుటుంబానికి వేములపల్లి గ్రామాన్నిఈనాముగా రాసిచ్చారు .కనుక వీరు వేములపల్లి అగ్రహారీకులు .

కళాశాల విద్య –ఉద్యమ నిర్వహణ

 శ్రీ రాధాకృష్ణ మూర్తిగారు 1946 లో విజయవాడ లోని ఎస్ ఆర్ ఆర్ . అండ్ .సి.వి . ఆర్.కాలేజీ లో ఇంటర్ చదివి ఉత్తీర్ణులయ్యారు . స్వాతంత్రోద్యమం దేశం లో విస్తృతంగా  విస్తరిస్తున్న కాలంలో దేశభక్తి వారిలో పురివిప్పగా మాతృదేశ సేవలో తరించాలన్న ధ్యేయం తో నాయకుల పిలుపు నందుకొని విద్యకు ఎగనామం పెట్టి స్వాతంత్రోద్యమం లో స్వచ్చందం గా చేరి,తమ వంతు పాత్ర పోషించిన దేశభక్తులు .  . తరువాత 1947 లో దేశం  స్వతంత్ర పొందాక  భారత దేశం లోని సంస్థానాలను భారత దేశ  అంతర్భాగంలో   చేయటానికి నాటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేస్తున్న ప్రయత్నాలకు దాదాపు అందరు సంస్థానాధిపతులు స్వచ్చందంగా కలిసి వస్తే ,ఒక్క నైజాం నవాబుమాత్రం మొండి కేసి నయానా భయానా చెప్పినా లొంగకపోతే , నైజాం నవాబు పెంచి పోషించిన రజాకార్లు ప్రజల ధన మాన ప్రాణాలను హరిస్తుంటే  రజాకార్ ల దౌష్ట్యాన్ని యెదిరించి  పోరాడే ప్రజా ఉద్యమం లో ప్రజల తరఫున ప్రాణాలకుతెగించి పోరాడిన పోరాట యోధులు శ్రీ మూర్తిగారు . గత్య0తరం లేని పరిస్థితులలో సర్దార్ పటేల్  1949 లో పోలీస్ యాక్షన్ జరిపి తరతరాలబూజు నైజాం నవాబును గద్దె దింపి నైజాం సంస్థానాన్ని భారత దేశం లో విలీనం చేశాడు .

ఉన్నత విద్యాభ్యాసం –ఉద్యోగంరచన

 

పోలీస్ యాక్షన్ తర్వాత  నాటి ముఖ్యమంత్రి మహా విద్యావేత్త డా బూర్గుల రామకృష్ణారావు ,డా మేల్కొటే మొదలైన ప్రముఖుల సలహా తోశ్రీ మూర్తిగారు ఉస్మానియా యూని వర్సిటీ లో చేరి ఆగిపోయిన విద్యను కొనసాగించి విద్యారంగంలోను మేటి అనిపించారు .ప్రముఖ స్వతంత్ర సమరయోధులు ,మహా విద్యావేత్త , గ్రంథకర్త , ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ప్రధమ సభాపతి డా శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారు వీరికి ముఖ్య బంధువు .

     మూర్తిగారు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి 1953 లో ఏం ఎస్ సి ,1958 లో పి. హెచ్ . డి .పొందారు . 19 53 నుంచి 61 వరకు యూనివర్సిటీ సైన్స్ కాలేజీ లెక్చరర్ గా పని చేశారు . 1961 లో ‘’ఫుల్ బ్రైట్ఎక్స్చేంజి ప్రోగ్రాం ‘’లో అమెరికాలోని లూసియానా రాష్ట్రయూనివర్సిటీ కాలేజీ మెడికల్ కాలేజీ లో హృద్రోగ0పై రీసెర్చ్ చేయటానికి ,గ్రాడ్యుయేట్ స్కూల్ లో బయో కెమిస్ట్రీ బోధించటానికి అమెరికా వెళ్లారు . 1961 నుంచి 1992 వరకులూసియానా స్టేట్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి ,అసోసియేట్ ప్రొఫెసర్ గా ,ప్రొఫెసర్ గా పదోన్నతి పొంది మూడు దశాబ్దాలు సేవలందించారు . 1992 నుంచి  టులేన్ యూనివర్సిటీ లోని స్కూల్ ఆఫ్పబ్లిక్ హెల్త్ లో గుండె జబ్బులపై పరిశోధనలు చేశారు .హృద్రోగాలకు సంబంధిన అనేక అమెరికా జాతీయ , అంతర్జాతీయ రీసెర్చ్ సమావేశాలలో ఆహ్వానితులుగా పాల్గొన్నారు .గుండె జబ్బులపై 200 లకు పైగా రీసెర్చ్పేపర్లుసమర్పించారు . ”గుండె జబ్బు -నివారణోపాయాలు ”పుస్తకాన్నిమూర్తిగారు ఆంగ్లం లో రచిస్తే ,వారి అర్ధాంగి సులోచనగారు తెలుగులోకి అనువాదం ,చేసి ప్రచురించిన ఘన వైద్యులు శ్రీ మూర్తిగారు .

వివాహ బంధం –సంతానం

 రాధా కృష్ణ మూర్తిగారు శ్రీమతి శకుంతల గారిని వివాహమాడా రు .వీరి సంతానం  1-శ్రీ రాజేశ్వరరావు2- శ్రీమతి ఉమ3-కుమారి హేమ 4-శ్రీనివాస ప్రసాద్  గార్లు . ఈ నలుగురూ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం లో ఆరోగ్య శాఖా సంబంధ  వృత్తులలో స్థిరపడ్డారు .  దురదృష్ట వశాత్తు శ్రీమతి శకుంతలగారు కేన్సర్ వ్యాధితో 1981 లో మరణించి కుటుంబానికి తీరని శోకం కలిగించారు .

                       బండారు వారి బంగారు దాంపత్యo

1983 లో మూర్తిగారు గుంటూరు జిల్లా రేపల్లె లోని యల్లాప్రగడ వారి ఆడబడుచుప్రొఫెసర్ శ్రీ యల్లాప్రగడ రామ మోహన రావు గారి చెల్లెలు   డా శ్రీమతి సులోచన ఏం డి . గారిని ద్వితీయ వివాహం చేసుకొన్నారు .శ్రీమతి సులోచనగారు 1969 కాకతీయ యూని వర్సిటీ లో ఏం. బి . బి. ఎస్.,1973 లో ఉస్మానియా యూనివర్సిటీలో డి. జి

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.