గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 251-యోగినీ హృదయదీపికా వ్యాఖ్య కర్త – అమృతానంద నాధుడు (17 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4

251-యోగినీ హృదయదీపికా వ్యాఖ్య కర్త – అమృతానంద నాధుడు (17 వ శతాబ్దం )

త్రిపుర కు చెందిన వామతంత్రంగా ప్రసిద్ధి చెందిన వామకేశ్వర తంత్రంఅనబడే ‘’నిత్య షోడశికార్ణవం’’ లో చివరి మూడు అధ్యాయాలను అంటే 6 ,7 ,8 విశ్రామాలను  ‘’యోగినీ హృదయం ‘’అంటారు .దీనిని కాశ్మీర్ కు చెందిన వామాచారులు ‘’త్రిక ‘’గా గుర్తించారు .అంటే ఈ రెండు ఉపాసన విధానాలలో సమాన విషయాలున్నాయని తెలుస్తోంది .యోగినీ హృదయ౦ కు అమృతానంద నాధుడు ‘’దీపిక ‘’వ్యాఖ్యానం ,భాస్కరరాయ విరచిత ‘’ సేతు బంధన’’ వ్యాఖ్యానాలున్నాయి .18 వ శతాబ్దికి చెందిన భాస్కర రాయ వీటిని పెద్దగా ఒప్పుకోకపోయినా  దీపిక కు దగ్గరగా ఆయన అభిప్రాయాలున్నాయని భావించారు .అమరానాధుని తండ్రి పుణ్యానంద నాధుడు ‘’కామకలా విలాసం ‘’ఎప్పుడో రాశాడు .కనుక కాశ్మీరు వామతంత్ర వాదులు దీనిని యెంత క్షుణ్ణంగా అధ్యయనం చేశారో అర్ధమవుతోంది .నిత్యషోడశికార్ణవం ‘’కు   పు   ణ్యానందుడు   రాసిన వ్యాఖ్యానం ఆధారంగా శాక్త మతానికి చెందినా భాస్కరరాయ వ్యాఖ్యానం’’ సేతుబంధ ‘’ ఉంటుంది .

యోగినీ హృదయం కు నిత్య హృదయం ,సుందర హృదయం అని రెండు పేర్లున్నాయి . సంప్రదాయ శాక్త విధాన ఉపాసనలో 12 విభిన్న విధానాల ఉపాసన ఉన్నది .వీటిని మనువు ,కుబేరుడు ,లోపాముద్ర ,మన్మధ లేక ,కామదేవ,శివ ,దుర్వాసులు  స్థాపించారు కనుక వారి పేర్ల మీదనే ప్రచారం లో ఉన్నాయి .కాలగర్భం లో ఇందులో 10 పద్ధతులు కనుమరుగై ,రెండే రెండు పద్ధతులు లోపాముద్ర ,కామదేవ విధానాలు మిగిలి ఉన్నాయి .

15 అక్షరాలకు చెందిన కామ దేవ విద్య శాక్త , సంభావ అనే  రెండు విధానాలు   ,ఇందులో మొదటిది ఊర్ధ్వామ్నాయం దోషరహితమైనది .రెండవది పూర్వామ్నాయం కు చెందినది ,దోషాలతో ఉన్నది .లోపాముద్ర విద్య లోనూ 15 అక్షరాలే ఉంటాయి .ఇది తంత్ర రాజం లోనూ ,త్రిపురా  ఉపనిషత్ లోనూ ప్రాముఖ్యంగా ఉన్నది .హాదీ విద్యలోనూ 15 అక్షరాలే  .ఇది కొన్ని శాక్త ఉపనిషత్ లలో పెర్కొనబడినది .

దుర్వాస మహర్షి 13 అక్షరాల హదీ విద్య నే ఉపాశించాడు.ఈయన రాసిన లలితా స్తవరత్న౦ ప్రసిద్ది చెందింది . దుర్వాసుడు ‘’పరాశంభు స్తోత్రం ‘’కూడా రచింఛి ‘’క్రోధ భట్టారకుడు ‘’అని పించుకున్నాడు .త్రిపురా దేవిపై మహర్షి దుర్వాసుడు ‘’మహిమ్న స్తోత్రం ‘’కూడా రాశాడు .దీనికి శ్రీనివాస భట్ట అనే విద్యానందుని శిష్యుడు నిత్యానంద నాధుడు వ్యాఖ్యానం రాశాడు .

   కాది మతుడు రచించిన నాలుగు గ్రంధాలు తంత్ర రాజం ,మాతృకార్ణవం ,త్రిపురార్ణవం,యోగినీ హృదయం ఉన్నాయని కొందరి అభిప్రాయం .తంత్ర రాజం పై శుభగానంద నాధుడు రాసిన ‘’మనోరమ ‘’వ్యాఖ్యానం లో ,భావనా ఉపనిషత్ కు భాస్కర రాయడు రాసిన వ్యాఖ్యలో పై విషయాన్ని అంగీకరించారు .భాస్కర రాయ రాసిన ‘’వరి వస్య ‘’లో హాదీ వ్యాఖ్యానం యోగినీ హృదయానికి ఉందని చెప్పాడు .పరా మాత పూజా విధానం లో బాహ్య ,ఆంతరంగిక విధానాలు మాత్రమె ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పలేము .త్రిపుర తాపిని మొదలైన ఉపనిషత్తులలో నూ వీటి ప్రస్తావన ఉన్నది .భావనా విధానం కూడా చెప్పబడింది .వీటిలో కాల చక్రం లోని శ్రీ చక్రం పై భావన ఎలా నిలపాలో వివరణ ఉంది .ఖాదీ పధ్ధతి హాదీ పద్ధతుల లో వీటిపై కొన్ని భేదాభిప్రాయాలున్నాయి .అంతర్యాగ విధానం లో చక్రాలను శరీరం లోపలే వివిధ దశలలో వివిధ విదానాలలో  దర్శించాలని ఉంది .భావనా ఉపనిషత్ ఖాదీ మార్గాన్ని సమర్ధించింది .యోగినీ హృదయ బిందు సూత్ర, తంత్ర రాజాలు ఏకీభవించాయి .

  భావనా ఉపనిషత్ ప్రకారం మానవ శరీరమే శ్రీ చక్రం అంటే ఆత్మ అని  భావించాలి .కనుక శరీరం వేరు ఆత్మ వేరు కాదు .మొత్తం విశ్వ నిర్మాణం అంటే బాహ్య ప్రపంచం మన శరీరం లోనే ఉంది ,దానితో సంబందమై ఉన్నది .బాహ్య౦ దేశ ,కాలాలపై,ఆ రెండిటి కలయిక పై  ఆధారపడి ఉంటుంది .చంద్రునికి ఉన్న దర్శ,ద్రష్ట మొదలైన 15 కళలు ,15 తిధులకు సంబంధం కలిగి ఉంటాయి .ఇవే కామేశ్వరి, చిత్ర మొదలైన 15 నిత్య లు .16 వ కళనే’’సాధక్య ‘’అనే పరా దేవత లేక లలితాదేవిగా భావించాలి .అంటే కాలచక్రం లో ఉన్నది అంతా నిత్య లో అంటే శ్రీ చక్రం లో ఉన్నదే .భేదమేమీ లేదు .తిది చక్రం లేక కాల చక్రం నిత్యం భ్రమణం చెందుతూనే ఉంటుంది .శ్రీ చక్రం అందులో భాగమే .యోగుల రహస్య సాధన లో తిధులు అంటే మనవ శరీరం ద్వారా పీల్చే  2 1,600 శ్వాసలే .

  ఇక దేశ విషయానికి వస్తే -మన ప్రాచీన రుషి,పురాణ  సాంప్రదాయం ప్రకారం యావత్ ప్రపంచం భూమి నీరు మొదలైన  14 రకాల స్థాయీ భాగాల  భూ  జల భాగాలే .ఇవి జంబూద్వీపం నుండి మధుజల మహా సముద్రం అంటే ‘’మధు రోదం’’వరకు వ్యాపించి ఉన్నాయి .ఇందులో జ౦బూద్వీపానికి ఆవలున్న మేరువు ,మధు దేశానికి అవతలున్న పరావ్యోమ కూడా కలిసే ఉన్నాయి .నిత్యా మండల సంవత్సర ఆవర్తనం లో ప్రతి నిత్య, పై 14 భాగాలలో ఏదో ఒకదానితో సంబంధం కలిగి ఉంటుంది .మొదటి ఏడాది నిత్యల భ్రమణం   మేరువు నుండి ప్రారంభమై,16 వ నిత్య పరావ్యోమనుండి మొదలౌతుంది . ఈ మొత్తాన్నే ‘’దేశ చక్రం’’ అంటారు .

  యోగినీ హృదయం లో దానికి సంబంధించిన ప్రత్యేక విధి  విధానం ఉంది .ఇది పూర్తిగా మన ప్రాచీన విధానం లాగానే ఉంటుంది .క్రామ విధానం ఉన్న ‘’చిద్గగన చంద్రిక ‘’,మహార్త మంజరి గ్రంధాలలో దీని సంబంధ విలువైన సాహిత్యం చాలా స్పష్టంగా ఉంది . వాటిని చదివితే అద్భుతమైన సారం లభించి జ్ఞాన జ్యోతి వెలుగుతుంది . ‘’

 అంటూ ఈ గ్రంధాన్ని తన సంపాదకత్వం లో  యోగినీ హృదయం ‘’ వెలువరించిన ‘’గోపీనాధ కవి రాజ ‘’వివరించాడు ..

అమృతానందుడు తాను  కాష్మీరానికి చెందిన పుణ్యా నందనాధుని శిష్యుడనని చెప్పుకున్నాడు .గురు శిష్యులిద్దరూ పరమ యోగులై ‘’పరమహంస’’లని పించుకున్నారు .పుణ్యానందుని రచన ‘’కామకలావిలాసం ‘’ను శిష్యుడు భక్తిగా తన గురువు రచన అని చాల చోట్ల పేర్కొన్నాడు .యోగినీ హృదయ దీపికతో పాటు   అమృతానందుడు’’షట్ట్వి౦మ్ షత్తత్త్వ  సందోహం ,సౌభాగ్య శుభగోదయం కూడా రాశాడు . అజ్ఞాన బోధిని టీకా ,తత్వదీపన అనే మరో రెండు కూడా ఇతని రచనలే అన్నారు .కృష్ణ నందుని తంత్ర సారాన్ని సరి చేశాడనీ అన్నారుకాని ఇవి అనుమానాలే .

  సేతు బంధన వ్యాఖ్యాత భాస్కరరాయ దీపికను కొన్ని చోట్ల సమర్ధించి చాలా చోట్ల వ్యతిరేకించాడు,అమృతానండదునిది సంప్రదాయమార్గమైతే భాస్కరునిది తద్విరుద్ధమైనదిగా కనిపిస్తుంది .సాధకులకు అమృతానందమార్గమే సరైన మార్గ దర్శనం చేస్తుందని నిపుణుల అభిప్రాయం .

  దీపికలో చక్ర ,మంత్రం ,పూజ మూడు భాగాలు అంటే పటలాలు ఉన్నాయి  .చక్ర అంటే శ్రీ చక్రం లేక త్రిపురా  చక్రం .ఇది సకల చరాచారానికికి ఆది మధ్యాన్తమైనది .ఇందిలో 9 త్రిభుజాలు ,అందులో 5 త్రిభుజ శీర్షాలు కింది వైపుకు ,నాలుగు శీర్షాలు పైకి ఉంటాయి .మొదటి 5శక్తికి ,మిగిలిన 4అగ్ని అంటే లయానికి సంకేతాలు .శివ ,శక్తి లు అగ్ని చంద్రుడు .వీటి కలయికలో ఉన్నది సూర్యుడు అనే బిందు రూపం . శివుని స్పర్శవలన ప్రకాశం లభిస్తుంది .బిందువు సకల చేతనాలకు మూలం .

 రెండవదైన మంత్రం భాగం లో 9 చక్రాల అధిదేవతా మంత్రం వివరణ ,చిన్మరీచి అనే చైతన్య కిరణవిషయం ఉంటాయి మంత్ర సంకేతం భావార్ధ ,సంప్రదాయార్ధ ,నిగ ర్మార్ధ,కౌలికార్ధ ,సర్వ రహస్యార్ధ ,మహాతత్వార్ధ అని ఆరు రూపాలు .

మూడవభాగమైన పూజ లో పరా ,పరాపరా అపర పూజా విధానాల వివరణ ఉన్నది .మొదటిదానిలో పరమశివ తత్వ బోధన జరిగితే రెండవ దానిలో కర్మ జ్ఞానాలు కలిసి భావన మిగులుతుంది .మూడవది తక్కువ స్థాయి కల సాధారణ పూజా విధానం .

మొదటి శ్లోకం –

‘’దేవ దేవ మహాదేవ పరిపూర్ణ ప్రదామయ –వామకేశ్వర తంత్రేస్మి అజ్నాతార్ధ స్త్వనేకశః

తాం స్థాన ర్యశేషేణ వక్తు మర్హసి భైరవ’’ .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-18 –కాంప్- మల్లాపూర్ –హైదరాబాద్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.