గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
256 – బాల విధవ కర్త –దీనా రావు దయాలు –(1993)
బాల విధవ ఏకాంకిక కర్త దీనా రావు దయాలు ,బెంగళూర్ సురభారతి ప్రకాశన్ 1993 లో ప్రచురించింది .ఇందులో బాల విధవల దైన్యం ,గోడు ,సంఘం వారి పట్ల చూపుతున్న క్రూరత లను ప్రత్యక్షం చేసింది .ఈమె ‘’లీలా నాటక చక్రం ‘’పేరుతొ మరొక 21 నాటికలు రాసి ప్రచురించింది .
అనూప్ అనే 30 ఏళ్ళ రైతు బాల వైధవ్యం అనుభవిస్తున్న పార్వతి అంద చందాల గురించి తన స్నేహితునితో జరిగే సంభాషణలో నాటిక ప్రారంభమవుతుంది .స్నేహితుని మాటలకు అనూప్ కు ఆమె పై ఆరాధనా భావం కలుగుతుంది .
‘’కోశ పాశి విహీనాపి న లావణ్య దువ్యయుజ్జతా –కోవా నిసర్గ సౌందర్యం యౌవనస్య విలోయేత్ ‘’అని చెప్పిఆమేను పెళ్లి చేసుకుంటాను అంటాడు స్నేహితుడు లోకం ఒప్పుకోదు వద్దంటాడు –‘’అశక్యం అసంభవ మేతత్ పునర్వివాహో విధవానాం న జాతు లోకక్రియః ‘’అని వారిస్తాడు .పార్వతి రాత్రింబవళ్ళు చాకిరీ చేస్తూ బతుకుతోంది .నిద్రకూడా పశువుల పాకలోనే .ఆమె దుర్భర స్థితిని చూసి ఒకరోజు ఆమె తో మాట్లాడటానికి వెడతాడు .వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది –
‘’ఆపి స్మరసి నిజబాల పాలిం ?అనూప్
‘’న ప్రేక్షితం తన్ముఖమపి మయా –స్మరామి యదల్ప కాలోనైవ ఆదిస్టాహం మాత్రా సౌభాగ్య కుంకుమ మార్జనాయా ‘’ పార్వతి
‘’అహో దైవ గతిః’’
‘’పరిహ్తక్ష మే మంగళ సూత్రమపి శవోప హాసయా ‘’
‘’తతస్తతః’’
‘’బోధితా చాహం యద్ విధ వాహం జాతోతి’’.
అని చెప్పి పూనాలో ఇద్దరం పెళ్లి చేసుకుందాం అక్కడ అందరూ కొత్త వాళ్ళే కదా ‘’అనటం తో మొదటి రంగం పూర్తి .
పురోహితుడిని తమ వివాహం చేయించమని కోరితే తిరస్కరిస్తే ,ఆ విషయం ఆమెతో చెప్పటానికి రావటం తో రెండో దృశ్యం ఆరంభం .
అనూప్ -‘’పరం కృపణ చేతతస్తే నిర్వివేకా రూఢ ప్రాయః పౌరాణికాః నైక వారం భ్యార్దితా పరం నైకే నపి స్వీక్రుతో మే అనునయః ‘’అంటాడు .
ఆమె-‘’నిరాక్రుతం సర్వేః’’అని అడుగుతుంది .
అతడు –ధర్మలోప మాశ౦కం తే బ్రాహ్మణా ఇమే పునర్వివాహే విధవానాం’’అంటాడు .
చచ్చీ చెడి వెతికి వెతికి ఒక బకరాని కుదుర్చుకుని తీసుకొస్తే వాడు సరిగ్గా పెళ్లి ముందు ‘’నాకు విధవ ను పెళ్లి చేసు కొంటున్నట్లు ముందే చెప్పలేదు ‘’అని సాకు చెప్పి వెళ్ళిపోయాడు –వీరి సంభాషణ
‘’కుత్రే తస్తాఃపితరౌ ?’’పురోహిత్ ‘
‘’బాల్య ఏవ పరగతో తౌ’’అనూప్
‘’అధాన్యః కశ్చిత్ సంరక్షితః –దిక్ విజ్జతం మిధ్యా విశ్వాసితోడహం ‘’పురో
‘’కిమా పతితం ?’’
‘’కుతో నైదితం త్వయా విధవాం పరినయోష్యామితి’’
‘’కిమనేన తే ప్రయోజనం ‘’దక్షిణాద్రవ్యం సాదయ ‘’
‘’నాహం విత్త లోభీ ‘’అంటాడు వాడు
.బ్రతిమాలుతాడు .చివరికి ‘’ధర్మహాని కరోయం విధిః న కదాపి అనుస్టాస్సతే’’అంటే ధర్మ విరుద్ధం నేను ఈ పెళ్లి చేయించాను అంటాడన్నమాట .
మూడవ రంగం లో ఆమెబందువర్గం ఎలా పార్వతిని సూటీ పోటీ మాటలతో కష్ట పెట్టిందీ ఉంటుంది .ఇంట్లోకి రానివ్వరు .బయటే మట్టి ధూళి లో పడిఉంటుంది .ఆమె కోసం చీకట్లో అనూప్ వెతుకుతూ ఉంటాడు ఆమె చీకటిలో కలిసి పోతుంది .
ఈ ఎకా౦కికలో లీలా దయాలు సమకాలీన విధవ రాలి సమస్యను చాలా హృద్యంగా చూపించింది .ఇందులోని సంభాషణలు పాత్రోచితంగా సూటిగా గుండెకు తాకేవిగా ఉండేట్లురాసిన నేర్పు ఆమెది .కుటుంబమూ సంఘమూ విధవ రాలి విషయం లో చూపే విచక్షత కు అద్దం పట్టిన నాటిక .
చివరి సంభాషణ లు గుండెలను పిండి చేస్తాయి –
‘’హాం ప్రతికూలో మే విధిః – సాంప్రతం మరణ మేవ మే శ్రేయః ‘’అంటుంది ఇరుగుపొరుగు వారితో పార్వతి
‘’విదినాకు అనుకూలం గా లేదు .నాకు మరణమే శరణ్యం ‘’అని అర్ధం .
‘’తాహి గత్వా కృపే నిపాత యాత్మనం –తత్రైవ తే గతిః’’అంటుంది పేరులో ఉన్న మిత్రత్వం లేని పక్కింటి సుమిత్ర .
‘’అయితే వెళ్లి నూతిలో దూకు .అదే నీకు సరైన చోటు ‘’.
25 1-నుండి 2 5 6 వరకు ఆధారం –‘’Contribution Of Women To Post Independence Sanskrit Literature’’ –
శివరాత్రి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-2-18 –ఉయ్యూరు

