గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
257-కుమార సంభవ వ్యాఖ్య కర్త –విఠలదేవుని సుందర శర్మ (20 వ శతాబ్దం )
మనకు కాళిదాస కావ్యాలపై సంస్కృత వ్యాఖ్య రాసింది వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి అనే బాగా తెలుసు .తర్వాత చాలా మంది రాశారు .కాని మనకు పట్టలేదు చారిత్రిక సత్యంగా అవి ఉండి పోయాయి .కాని మన తెలుగువాడు ఇరవయ్యవ శతాబ్దం ?వాడు అయిన విఠల దేవుని సుందర శర్మ సంస్కృతం లో కుమార సంభవం కావ్యం పై చక్కని సంస్కృత వ్యాఖ్యానం రాశాడని అసలు తెలియదు అనే నేను అనుకొంటున్నా .కాని ఇది యదార్ధం. ఆయన కాలం జీవిత విశేషాలు గూగుల్ లో దుర్భిణీ వేసి వెదకినా దొరకలేదు .మూల౦ తో సహా విఠలదేవుని సుందర శర్మ సంస్కృత వ్యాఖ్యానాన్ని చిత్తూరు లోని ‘’సంస్కృత భాషా ప్రచారిణీ సభ ‘’ప్రచురించింది .దీని ముద్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ధిక సహాయమందించింది .ఇంతకు మించి ఏ రకమైన సమాచారమూ దొరకలేదు ఒట్టు ..ప్రధమ సర్గ లో ప్రధమ శ్లోకానికి సుందర శర్మ గారి వ్యాఖ్యానం చూద్దాం –
‘’అస్త్యుత్తరస్యే దివి దేవతాత్మ- హిమాలయో నామ నగాధి రాజా -పూర్వా పరౌ తోయ నిధీ విగాహ్య స్థితః పృదివ్యా ఇవ మాన దండః’’
అర్ధ వివరణ –ఉత్తరస్య దిశా =ఉదీచీ దిగ్భాగే ,దేవతాత్మా =దేవతాస్వరూపీ ,హిమాలయో నామ =హిమాలయ ఇతి ప్రసిద్ధ ,నగాధి రాజా = పర్వతానాం ఆధిప –పర్వత శ్రేష్ట ,పూర్వా పరౌ =ప్రాక్ పశ్చిమో ,విగాహ్య =ప్రవిశ్య ,పృదివ్యా =భూమే ,మానదండ ఇవ =ఆయామ పరిచ్చేదక దండ ఇవ ,స్థిత =విరాజమాన ,ఆస్తి=వర్తతే
దీనికి తాత్పర్యం –భారత వర్షో త్తర దిగ్భాగే దేవతా స్వరూపీ హిమాలయో నామ పర్వత రాజః ప్రాక్పశ్చిమౌ సముద్రే ప్రవిశ్య పృదివ్యా మానదండ ఇవ విరాజమానో వర్తతే ‘’
అలాగే విగ్రహవాక్యాలనూ ప్రతి శ్లోకానికి రాశారు .సర్గ చివరలో కద ఎంతవరకు అర్ధమైనదో తెలుసుకోవటానికి ‘’ప్రశ్నావళి ‘’ఇచ్చారు .వీటికి సమాధానం తెలిస్తే సర్గలోని ముఖ్య విషయాలు తెలిసి నట్లే .ప్రశ్నకు ఏ శ్లోకం లో సమాధానం దొరుకుతుందో క్లూ కూడా ఇచ్చారు .
1-హిమాలయ కుత్ర కధ మస్తి ? 2-సతీ దేవీ మేనకాయా కధ ముత్పన్నా ?
సశేషం
మహా శివరాత్రి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –13-2-18 –ఉయ్యూరు

