గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 271-వీర పృథ్వి విరాజనాయక కర్త –మధురా ప్రసాద్ దీక్షిత్ (18 7 8-19 9 6 ))
ఉత్తర ప్రదేశ్ హర్దోయి జిల్లా భగవంతనగర్ లో 1878 లో జన్మించిన మధురా ప్రసాద్ దీక్షిత్ 25-9-1966 న 88 వ ఏట మరణించాడు .రాసిన 15 లో అందులో అత్రి నిర్వచనం , వీర పృథ్వి విరాజనాయక,భారత విజయం ,శంకర విజయం తోపాటు స్వీయ సంపాదకత్వం లో ‘’అభిదాన రాజేంద్ర ‘’తెచ్చాడు .మహా మహోపాధ్యాయ బిరుదున్నవాడు .
పవన్ కుమార్ దీక్షిత్ ‘’మనసిజ సూత్రం ‘’రాశాడు .పీయూష్ కాంతి దీక్షిత్ ‘’వ్యాప్తి సప్తక సారం ‘’రాశాడు .ప్రదీప్ కుమార్ దీక్షిత్ ‘’సంస్కృత గద్య సంకలనం ‘’తెచ్చాడు
272-విచార వాహిని కర్త –సాంబ దామోదర్ ఉపాధ్యాయ దీక్షిత్ (1934 )
వ్యాకరణ విద్వాన్ వేదం లో ఎం ఏ సాంబ దామోదర ఉపాధ్యాయ దీక్షిత్ 1934 ఫిబ్రవరి 14 కర్నాటక కార్వార్ జిల్లా గోకర్ణం లో జన్మించాడు .మహర్షి వేదిక్ విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ చేశాడు .14 గ్రంథాలు రచించాడు .అందులో గృహాగ్ని సారం, విచార వాహిని ,ఛందో దర్శనం ఉన్నాయి .వేద వార్నిధి ,వేద రత్న బిరుదులు పొంది రాష్ట్రపతి పురస్కార౦ అందుకున్నాడు .
273-కాళికా శతకోద్ది సార కర్త –శ్రీనివాస దీక్షిత్ (20 వ శతాబ్దం )
వ్యాకరణ ,శివాద్వైతాలలో విద్వాన్ ,అప్పయ్య దీక్షితుల వంశం వాడైన శ్రీనివాస దీక్షిత్. విజ్ఞప్తి శతకం ,కలి వైభవ శతకం ,ఆస్థానుభవశతకం ,కాళికా శాత కోద్ది సారం ,జగద్గురు ధామ సేవక శతకం రచించాడు
274-చిదంబర మహాత్మ్యం కర్త –సోం కేతు దీక్షిత్ (1928 )
తమిళనాడు చిదంబరం లో 1928 జన్మించిన సోం కేతు దీక్షిత్ శిరోమణి .సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీనివాస శాస్త్రి ల శిష్యుడు .చిదంబర మహాత్మ్యం ,నాగరాజ సహస్రనామ భాష్యం ,రీతి శాస్త్రం రాశాడు
275 –గోపస్వాప కావ్య కర్త –తురువేకరే సుబ్రహ్మణ్య విశ్వేశ్వర దీక్షిత్ (1924 )
శుక్ల యజుర్వేద వేదాంత అలంకార శాస్త్రాలలో విద్వాన్ తురువేకరే సుబ్రహ్మణ్య విశ్వేశ్వర దీక్షిత్ 1924 జులై 7 కర్నాటక తురువేకరే లో పుట్టాడు .ప్రొఫెసర్ . వెంకట రామావధాని ,రామ చంద్ర ,పతనాకర్ ల శిష్యుడు .స్తోత్ర విషయా చత్వారః ,లోభ సామ్రాజ్య౦ ఏకాంకికలు ,గోపస్వాప కావ్యం రాశాడు .
276-బృహతి కర్త-చిన్నస్వామి ద్రావిడ్ (1889-1956 )
1889 లో తమిళనాడు లో పుట్టి వారణాసి బి హెచ్ యు లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన చిన్నస్వామి ద్రావిడ్వెంకట రమణ శాస్త్రి ,కుప్పు శాస్త్రి , వెంకట సుబ్బా శాస్త్రిల వద్ద విద్య నేర్చాడు వ్యాకరణ ,సాహిత్య మీమా౦స లలో విద్వాన్ .రచించిన 5 గ్రంధాలలో మీమాంస కౌస్తుభం ,బృహతి ,తంత్ర సిద్ధాంత వల్లి ,వైదిక యజ్న మీమాంస యజ్న తత్వ ప్రకాశ ఉన్నాయి .,67 వ ఏట 1956 లో మరణించాడు .మహా మహోపాధ్యాయ బిరుదాంకితుడు .
277-కాళిదాసస్య బింబ విధానం కర్త –అయోధ్యా ప్రసాద్ ద్వివేది (1940 )
19 40 ఆగస్ట్ 1 మధ్యప్రదేశ్ సిది జిల్లా బెలాహ లో పుట్టిన అయోధ్యా ప్రసాద్ ద్వివేది దేవా ప్రసాద ద్వివేదీ శిష్యుడు. కాళిదాసస్య బింబ విధానం అన్నది ఒక్కటే రాశాడు
278-అధర్వ వేద శుభాషితావలి కర్త –భారతేందు ద్వివేది (1956 )
1-3-1956 ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ లో పుట్టిన భారతేందు ద్వివేది ఎం ఏ డి ఫిల్.భాదోహిలోని కాశీ నరేష్ గవర్నమెంట్ పిజి కాలేజి సంస్కృత ప్రొఫెసర్ హెడ్డు కూడా .20 పుస్తకాలు రాశాడు .ఋగ్వేద శుభాషితావలి ,అధర్వ వేద శుభాషితావలి మొదలైనవి .
శబ్దెందు శేఖరం పై ‘’రాధికా ‘’అనే వ్యాఖ్య రచించిన బ్రహ్మ దత్త ద్వివేది 1906 లో పుట్టి 1987 లో మరణించాడు ప్రొఫెసర్ .
279-రస వసు మూర్తిః కర్త –చంద్ర మౌళి ద్వివేది (1948 )
9-3-1948 వారణాసి లో పుట్టి బిహెచ్ యు లో సాహిత్య ప్రొఫెసర్ చేసిన చంద్ర మౌళి ద్వివేది –రేవా ప్రసాద్ ద్వివేది మహాదేవ పాండే లశిష్యుడై ,డా.శివరాం శర్మ ,డా అమరేంద్ర మిశ్రా వంటి సుప్రసిద్ధులకు గురువయ్యాడు ..వివేక లోకః చంద్రాలోకః ,కావ్య మీమాంశ భారత జీవనం కావ్యం ,రసవాసు మూర్తిః వంటి 9 పుస్తకాలు రాశాడు .
280-అభినవ రస సిద్ధాంత కర్త –దశరద్ ద్వివేది (1940 )
14-12-1940 యు.పి .జోన్ పూర్ జిల్లా పచ్వాల్ లో పుట్టిన దశరద్ ద్వివేది గోరఖ్ పూర్ యూని వర్సిటి ప్రొఫెసర్ .రాసిన 14 పుస్తకాలలో వక్రోక్తి జీవితం ,అభినవ రస సిద్ధాంతం తోపాటు కాదంబరి అనువాదమూ ఉన్నాయి .
258 నుండి -280 వరకు ఆధారం –Inventory of Sanskrit Scholors .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –19-2-18 –ఉయ్యూరు

