తెలుగు కవి తేజం
తెలుగులో ఎందరెందరో మహాకవులు మరుగున పడిపోయారు .వారినివెతికి వారిలోని ప్రతిభను లోకానికి చాటి పుణ్యం కట్టుకున్నారు కొందరు మహానుభావులు .అందులో శ్రీ వంశీ గారు ముఖ్యులు .వారుసేకరించిన సమాచారాన్ని మా అబ్బాయి శర్మ నాకు పంపితే అందులో కొందరిని గురించి అందునా ఇదివరకు నేను వారి గురించి రాయని వారిలో ఆణిముత్యాలవంటి వారిని ‘’తెలుగు కవి తేజం ‘’పేరిట పరిచయం చేసే సాహసం చేస్తున్నాను –దుర్గాప్రసాద్
1-శ్రీ బ్రహ్మానంద భారతీ స్వామి వారి తత్వ సంగ్రహ రామాయణం అనువదించిన –ఆకొండి వెంకట కవి (1820 )
శ్రీ బ్రహ్మానంద భారతీ స్వామివారు సంస్కృతం లో రచించిన తత్వ సంగ్రహ రామాయణం ను తెలుగులో తొట్ట తొలిగా అనువదించిన వారు వారణాసి వారు . శ్రీ ఆకొండి వెంకట కవి 1820 లో అన్మించారు .తల్లి అచ్చమాంబ తండ్రి జగన్నాధ శాస్స్త్రి .పై అనువాదం తోపాటు రమా శతకం ,నారాయణ ,భాక్తపోషణా శ్రీ రమణా శతకం ,రామ ప్రభు శతకం రచించారు .వీరి రామాయణం లో అనేక పురాణ గాధలు ఎన్నో ఉన్నాయి .
2- ఆంద్ర కాళిదాసు ఆలూరి కుప్పన కవి (18 వ శతాబ్దం )
చెన్నపుర ప్రాంతీయుడు 18 వశతబ్దానికి చెందినా ఆలూరి కుప్పనకవి అభినవ కాళిదాసు బిరుదాంకితుడు .పంచనదీ స్థలీపురాణం ,రామాయణ యక్షగానం ,దశమస్కంద యక్షగానం ,పార్ధ సారధీ విజయం ,పరమభాగవత చరిత్ర ,ఇందుమతీ పరిణయం ,హరికధా సుధారసం ఆచార్య విజయం రాశారు .వీటిని బట్టే కవి ప్రతిభ తెలిసిపోతోంది .ఆ బిరుదు సార్ధకమనీ అర్ధమౌతోంది .
3-మండపాక పార్వతీశ్వర శాస్స్త్రి (1833-1897 )
జోగమ్మ కామకవి దంపతులకు బొబ్బిలి దగ్గర పాల తేరు లో 1833 జన్మించిన మండపాక పార్వతీశ్వర శాస్స్త్రిశ్రీ వెంకటగిరిద్వ్యర్దికావ్యం ,బ్రహ్మేశ ,చిత్రి ,వెంకటశైలనాయక ,విశ్వనాధ ,కాశీ విశ్వనాధ ,పార్దివలింగ ,పరమశివ ,సూర్య నారాయణ బాల శాశాన్కమౌలి ,చంద్ర ఖండ కలాప ,కలిపురుష ,ఈశ్వర ,జనార్దన ,పార్వతీశ్వర ,పరమాత్మ వెంకటరమణ వరాహ నరసింహ జగద్రక్షక ఆంజనేయ గోపాలకృష్ణ బాలకృష్ణ ,సర్వకామదా గణపతి హరి హరేశ్వర శతకాలు ,సీతారామ ద్వ్యర్ధి శతకం ,బొబ్బిలి రాజ వంశావళి ,కాన్చీమహాత్మ్యం అమరుకం అక్షరమాలి నిఘంటువు ,యాత్రాచరిత్ర గురు చిత్రకధ ,లఘు చిత్రకధ గుణ శ్లోకాది చిత్ర రచన ,కవితా వినోద కోశం ,మంగళాస్టక చతుస్టయంమొదలైన వైవిధ్యభరిత రచనలెన్నో చేసి ‘’అభినవ ఆంద్ర కవితా పితామహుడు ‘’అని పించుకున్నారు .శతక రచనతోపాటు ఆశుకవిత్వం లోనూ దిట్ట .వీటికి మించి ప్రబంధకవి కూడా అవటం ఆయన ప్రతిభకు నీరాజనం .శతకకవులలో మొదటి స్థానం మండపాక పార్వతీశ్వర కవి గారిదే .
5 ) మంత్రి ప్రగడ సూర్య ప్రకాశ కవి (1808 -187 5 )
సీతమ్మ శరభరాజా మాత్యుల కుమారుడే మంత్రి ప్రగడ సూర్య ప్రకాశ కవి 1808లో అన్మించి 1875 లో చనిపోయారు .గొప్ప విద్వత్కవిగా ప్రసిద్ధుడు. మాడుగుల శ్రీ కృష్ణ భూపాలుని ఆస్థానకవి రాజు .సంస్థానానికి వచ్చే కవి పండితుల ప్రతిభను అంచనాకట్టి తగిన గౌరవ పురస్కారాలను రాజుగారి చే ఇప్పించేవారు .సాటికవులలో మహా ఆదరం సంపాదించిన సంస్కారి.
282–బ్రహ్మ సూత్ర రోమథము-కర్త -భగవత్కవి శ్రీ ముడుంబ నృసింహా చార్య (1841-1927)
శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మం దగ్గర అచ్యుత పురిలో 1841లో జన్మించి 86ఏళ్ళు జీవించి 1927 లో మరణించిన శ్రీ ముడుంబ నృసింహా చార్య తండ్రిగారిపేరు వీర రాఘవాచార్యులు . తెలుగులో శతకాలు సంస్కృతం లో భాష్యాలు రాసిన పండితకవి . శ్రీ కృష్ణ చాటువులు ,సత్య శతకం ,గరుడాచల నాటకం ,బ్రహ్మ సూత్ర భాష్యం ,బ్రహ్మ సూత్ర రోమథము,ప్రపత్తి చింత ,నృసింహ శారీరక భాష్యం ,ఉజ్వలానంద చంపువు ,వాసవ పరాశరీయ నాటకం ,జయసిమ్హాశ్వమేదీయం, చిత్సూర్యాలోకం ,కావ్య సూత్రా వ్రుత్తి ,ముగ్దా శృంగారం అంగ శృంగారం ,సంకీర్ణ శృంగారం ,రంగేశ శతకం రాశారు .’’భగవత్కవి ‘’గా సుప్రసిద్ధులు ‘
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –22-2-18 –ఉయ్యూరు
