గీర్వాణకవుల కవితా గీర్వాణ౦-4 –
284-ప్రసన్న రాఘవ నాటకకర్త –పీయూష వర్ష (13 వ శతాబ్దం )
13 వ శతాబ్దికి చెందిన మహా మహోపాధ్యాయ జయదేవ మిశ్రానే పీయూష వర్ష అంటారు .సుమిత్ర,మహాదేవ ల పుత్రుడు .కౌండిన్య గోత్రుడు .అమృతం లాంటికవిత్వాన్ని వర్షిస్తాడు కనుక జయదేవ మిశ్రాను ‘పీయూష వర్ష ‘’అంటారు .ఈయన రాసిన ఏడు అంకాల ప్రసన్నరాఘవం నాటకం .రసార్ణవం రాసిన సింహభూపాలునికి ఈ కవి బాగా తెలుసు .1464 కు చెందిన పక్షధర జయదేవుడు విష్ణు పురాణం రాసినట్లు తెలుస్తోంది .
285- ధూర్త విడంబన నాటక కర్త –అమరేశ (14 వ శతాబ్దం )
సర్వేశునికొడుకు అమరేశ లేక అమరేశ్వర బ్రహ్మదత్తుని మనవడు .దరిహర వంశం లో బ్రహ్మపుర శాఖకు చెందినవాడు .ఇతను రాసిన రెండంకాల ధూర్త విడంబన నాటకం హాస్యం పుట్టిస్తుంది.
286-ధూర్త సమాగమ నాటకకర్త –కవి శేఖరాచార్య జ్యోతిరేశ్వర (1240)
ధర్మేశ్వరుని కొడుకు దీరేశ్వరుని మనుమడు జ్యోతిరేశ్వర హరి సింహ దేవుని ఆస్థానకవి .ఇతని ధూర్త సమాగమం ఏకాంకిక .సుల్తానులను ఓడించిన తనరాజు జైత్ర యాత్ర సందర్భంగా రాశాడు .దురాచార ,అతని గురువు విశ్వనగర అనంగ సేనను ప్రేమిస్తారు . ఎవరికి వారు ఆమె తనకే దక్కాలని ప్రయత్నిస్తారు .ఆమెకు ఈవిషయం తెలిసి వారిద్దరిమధ్య తగాదా పరిష్కరించుకో మంటుంది .ఎత్తులు జిత్తులు విదూషకుని ప్రవేశాలతో బాగా రక్తి కట్టించాడు కవి .ఈ కవి మరోప్రహసనం ‘’ముండజత ప్రహసనం కూడా ‘’రాశాడట .మిధిల నేపధ్యంగా నాలుగు నాటకాలు వచ్చాయి .పంచాశాయక ,రంగ శేఖర అనే మరో రెండు రచనలు జ్యోతిరేశ్వర రాశాడు .మిదిలకవులలో వచనం రాసిన వారిలో ఇతడే మొదటివాడు ఆ రచనే ‘’వర్ణ రత్నాకర ‘’.
గౌరీ దిగంబర ప్రహసనం ను మహామహోపాధ్యాయ శంకర మిశ్రా రాశాడు . హాస్యం కారి ఊరించే ప్రహసనం .శివ పార్వతుల కళ్యాణ౦ లో కన్యాదాన సమయం లో శివుడు తన గోత్రనామాలను, తన తండ్రి,తాత ,ముత్తాత ల పేర్లను చెప్పలేక పోతాడు . అందరు పగలబడి నవ్వుతారు .ఈ కవి మరో రెండు నాటకాలు -మనోభావ ప్రభావం ,కృష్ణ వినోదం రాశాడు .కాని అలభ్యాలు
287-అతంద్ర చంద్రిక నాటకకర్త –జగద్ధార(17 వ శతాబ్దం )
మహా మహోపాధ్యాయ జగద్ధార లేక జగన్నాధ ఉపాధ్యాయ గోకులనాధ ఉపాధ్యాయుని తమ్ముడు .ఘర్వాల్ రాజు ఫతే షా కోసం అతంద్ర చంద్రిక నాటకం రాశాడు .ఇతడు గోమ్దీ మిశ్రా సంప్రదాయం లోసారయాన్త్రి విభాగం లో పదవ గురువు .
మహోపాధ్యాయ వంశ మణి ఝా ‘’గీతా దిగంబర ‘’నాటకం రాస్తే ఖాట్మండులో ప్రతాపమల్ల రాజు 1655లో పట్టాభిషిక్తుడైనప్పుడు ప్రదర్శించారు .
17 వశతాబ్దం లో త్రిభాషా నాటకాలు వచ్చాయి .అందులో గోవిన్దమిశ్ర నలచరిత ,రామదాస ఝా –రాదా కృష్ణుల అమర ప్రేమను నాలుగంకాల నాటిక’గా రాసిన ’ఆనంద విజయం’’ ,దేవాన౦దుని ‘’ఉషారణ ‘’ప్రసిద్ధాలు .
18 వ శతాబ్దం లో బాలకవి క్రిష్ణదత్త కువలయాశ్వీయ ,పురంజన చరిత్ర నాటకాలు రాశాడు .మొదటిది 7 ,రెండవది 5 అంకాల నాటకాలు .
1856- 1924 కాలం వాడు మహామహోపాధ్యాయ పరమేశ్వర ఝా ‘’మహిషాసుర వధ నాటకం ‘’రాశాడు .మహామహోపాధ్యాయ హర్షనాధ ఝా (1847-1898)అయిదు అంకాల రెండునాటకాలు ‘’ఉషార్నవ ‘’మాధవానంద రాశాడు
288-జానకీ పరిణయ నాటకకర్త -దేవకీ నందన(1840 )
ముకుంద ,మధుసూదన ,దేవకీ నందన అని పిలువబడిన ఈకవి అభిరామకవి మనవడు .నైయాయకుడుగా ప్రసిద్ధి .మహారాజా మహేశ్వర సింహా ఆస్థాన పండితుడు .నాలుగు అంకాల జానకీ పరిణయ నాటకం ఒక్కటే రాశాడు .
భాను నాధుడు మైధిలి సంస్కృత మిశ్రనాటకం ‘’ప్రభావతీ హరణం ‘’రాశాడు.
289-గజానన చరితం నాటకకర్త –శివానంద మిశ్రా(1880-1930)
1880లోపుట్టిన శివానంద మిశ్రా గజానన చరితంఅనే 7 అంకాల నాటకం రాశాడు .కృష్ణ సింహ ధక్కూర శిష్యుడు .ఖండ బాల వంశీకుడు .1930 లో 50 ఏళ్ళకే చనిపోయాడు
290-అర్ఘ్య లంబోదర నాటకకర్త –రవినాద ఝా(19 వశతాబ్దం )
రావినాద ఝా బాబుదత్త ఝా కొడుకు .మందార వంశీకుడు కాశ్యప గోత్రీకుడు .తాధి గ్రామ నివాసి .మహా వ్యాకరణ వేత్త .ముజఫర్ పూర్ డి ఎస్ ఎస్ కాలేజి వ్యాకరణ శాఖ హెడ్ గా పని చేశాడు . గణేశుని ప్రతాప పరాక్రమాలను తెలియ జేసే ‘’అర్ఘ్య లంబోదర ‘’నాటకం రాశాడు .
దేవీకాంత దక్కూర కవి దుర్గా సప్తశతి ఆధారంగా ‘’మహిషాసుర వధ ‘’నాటకం రాశాడు .
284 నుండి 290 వరకు ఆధారం ‘’Contribution Of Midhila To Sanskrit
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –25-2-18 –ఉయ్యూరు

