మధ్యయుగ ఐస్ లాండిక్ సాహిత్యం
15వ శతాబ్దం నుంచి 19వ శాతాబ్దివరకు ఐస్ లాండిక్ సాహిత్యం పవిత్ర కవిత్వం అందులో ముఖ్యంగా ‘పాషన్ వెర్సెస్ ఆఫ్ హల్లిగ్రిముర్ పీటర్సన్ ,’’రిమూర్ లు రైమ్స్ తో పాదానికి నాలుగు లేక రెండువాక్యాలలో ఉండేది .వచన రచనజోన్ మాగ్నూసన్ రాసిన ‘’పీసియర్ సాగా ‘’తో ప్రారంభమైంది 19శతాబ్ది చివరలో .బైబిల్ అనువాదం 16వ శతాబ్దిలోనే వచ్చింది ,జర్మన్ ,డేనిష్ భాషలలోని మత సంబంధరచనలు అనువాదమైనాయి .18వ శతాబ్ది ప్రసిద్ధకవి ఎగ్గార్ట్ ఒలాఫ్ సన్(1726-1768).జోన్ పోర్తాక్సన్ అ బెగేసా జాన్ మిల్టన్ రాసిన పారడైస్ లాస్ట్ తో సహా ఎన్నో అనువాదాలు చేశాడు .సాగాలుమాత్రం పాత మధ్యయుగ మూసలోనే వెలువడ్డాయి. ప్రీస్ట్ జాన్ హాడ్సన్ , హజాలితాన్ వీరిలో ముఖ్యుడు .
ఆధునిక సాహిత్యం
19వ శతాబ్దిలో ముఖ్యంగా 1830కాలం లో రొమాంటిక్ కవిత్వం పునరుద్ధరణ జరిగింది .జామి తోరాన్సేన్ (1786-1841),జోనాస్ హాలింగ్సన్ 1807-45)లు సిద్ధహస్తులు .హాలింగ్ సన్ చిన్నకధలు రాసిన మొదటి రచయితకూడా .ఇతని ప్రభావంతో జాన్ తరోడ్ సన్(1818-68)మొదటి ఐస్ లాండిక్ నవల 1850లో రాసిప్రచురించి నవలా పిత అనిపించుకొన్నాడు .1820-96కు చెందిన గ్రిమూర్ తాం సెన్ఎన్నో వీరగాదాకావ్యాలు ,మట్టియాస్ జోసుమ్సన్ ఎన్నో నాటకాలు రాసి నాటక పిత అనిపేరుపొండాడు .ఈకాలం ఐస్ లాండ్ లో పున రుత్దానకాలం .
రొమాంటిక్ కవిత్వం నుంచి నేచురలిజం ,వాస్తవికవాదం బయల్దేరాయి .వాస్తవవాద కధారచయితలు గేస్తర్ పాల్సన్ వ్యంగ్యవైభావానికి ,ఐస్ లాండిక్ –కెనెడియన్ కవి స్తేఫాన్ జి స్తేఫాన్సన్ 1853-1927ఐరనీ కి ప్రసిద్ధులు . ఎల్నార్ బెనె డిక్సన్ నియో రొమాంటిసిజం లో ప్రముఖకవి .ఐస్ లాండిక్ కవిత్వ స్వర్ణయుగానికి ఇతడే మకుటం లేని మహారాజు .20వ శతాబ్దిలో చాలామందికవులు డేనిష్ భాషలోరాయటం మొదలుపెట్టారు .జోహాన్ సింగూర్ జాన్సన్ ,గున్నార్ గున్నార్ సన్లు వీరిలో ముఖ్యులు .హాల్డోర్ లాక్స్నేస్ 1902-98 కు 1950లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .ఇతను చాలావ్యాసాలు కవిత్వం ,చిన్నకధలు నవలలు రాశాడు .అభి వ్యక్త వాదనవలలు ఇండిపెండెంట్ పీపుల్ ,ఐస్ లాండ్స్ బెల్ వంటి వి చాలా అనువాదం చేశాడు.మొదటి ప్రపంచయుద్ధం తర్వాత క్లాసిక్ శైలి పునరుద్ధరణ జరిగింది .డేవియో స్టెఫాన్సన్, టోమాస్గుయో ముండ్సన్ లు 20వ శతాబ్ది సంప్రదాయ కవిత్వానికి మూలస్థంభాలు .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత క్లాసికల్ మోడరన్ శైలి కలిసిపోయాయి .ఇటీవలికాలం లో 1961లో పుట్టిన ఆర్మదూర్ ఇండ్రియాన్సన్ రాసిన క్రైం నవలలు ఐస్లాండ్ దేశం వెలుపల బాగా ప్రాచుర్యం పొందాయి.
సశేషం
భోగి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-1-20-ఉయ్యూరు

