ప్రపంచ దేశాల సారస్వతం
10- ఐరిష్ సాహిత్యం -2(చివరిభాగం )
ఆలివర్ గోల్డ్ స్మిత్ వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్ నవలతో ప్రసిద్ధుడయ్యాడు.గోప్పకవికూడా . రాబర్ట్ బర్న్స్ స్థానిక రచయితగా ప్రసిద్ధుడు. డబ్లిన్ లో పుట్టిన ఎడ్మండ్ బర్క్ హౌస్ ఆఫ్ కామన్స్ కు విగ్ పార్టీ ప్రతినిధి,గొప్ప ఆరేటర్ ఫిలసాఫికల్ రచనలు చాలా చేశాడు .1730-50కాలం లో రైమింగ్ వీవర్స్ పోయెట్రి ని జేమ్స్ కాంప్ బెల్ ,జేమ్స్ ఒర్,ధామస్ బగ్స్ రాశారు .మేరియా ఎడ్జి వర్త్ వాస్తవ నవలాకారిణిగా రాణించింది.జాన్ బానిన్ ,జేరాల్ద్ గ్రిఫిన్ విలియంకార్లేటాన్ లు మంచి నవలారచయితలు .డ్రాకులానవల రాసిన బ్రాం స్ట్రోకర్,ఘోస్ట్ స్టోరి రైటర్ అంకుల్ సిలాస్ కార్మిల్లా నవలా రచయిత షెరిడాన్ లి ఫాను చెప్పుకోదగినవారు .జార్జి మూర్ చాలాకాలంపారిస్ లో గడిపినా ఫ్రెంచ్ టెక్నిక్ లను ఇంగ్లిష్ లో రాసిన తొలి రచయిత .ఐర్లాండ్లో పుట్టి పెరిగిన ఆస్కార్ వైల్డ్ (1854-1900)జీవితం చివర్లో ఇంగ్లాండ్ లో గడిపి గొప్ప రచనలు విమర్శ కవిత్వం రాశాడు .
ఐర్లాండ్ అస్తిత్వవాదమైన గేలిక్ రివైవల్ ఐరిష్ సాహిత్యంపై పెద్ద ప్రభావం చూపింది .జే.ఏం సింజి నాటకాలలో ,విలియం బట్లర్ యేట్స్ కవిత్వం లో ప్రతిఫలించింది .పాట్రిక్ పియర్స్ ఐరిష్ ఆధునిక సాహిత్యానికి ఆద్యుడు .పెడ్రిక్ ఓ కనైర్ ,సియోమామాక్ లు గొప్ప రచయితలు .స్వీయ జీవిత చరిత్రలు రాసుకొన్న ధామస్ ఓ గ్రియన్నా ,ఐరిక్ ప్రాఫెట్ గా గుర్తి౦పు పొందాడు .కార్దిన్ లాంగ్వేజ్ యాక్టివిస్ట్ .నువాలాని దాంనహాల్, మైకేల్ హార్నేట్ లు ఆధునిక దృక్పధంతో రాశారు .ఫ్రాన్స్ లో ఎక్కువ ఏళ్ళు గడిపిన సామ్యుల్ బెకెట్ ‘’వైటింగ్ ఫర్ గొడాట్’’నాటకంతో ప్రపంచ ప్రసిద్ధిపొంది నోబెల్ పొందాడు .బెహాన్ రాసిన నాటకం డక్వేర్ఫెలో డబ్లిన్ దియేటర్లో ప్రదర్శింపబడింది .లియోనార్డ్స్ నాటకాలు బ్రాడ్వేలో ఆడేవారు వీటికి ఎన్నో పురస్కారాలు వచ్చాయి .ధియేటర్ రైటర్ టాం మర్ఫీ ఫామిన్ మొదలైన నాటకాలతో హోరెత్తించగా , ‘’అవార్డ్ ఆఫ్ మోస్ట్ ప్రామిసింగ్ ప్లే రైటర్ ‘’అందుకున్నాడు మెక్ గిన్నిస్ .20వ శతాబ్దికి ముందు ఐరిష్ నాటకశాల లేనేలేదు .గేలిక్ రివైవల్ తర్వాత వచ్చాయి .1957లో బెహాన్ రాసిన ఆన్ గియాల్ నాటకం డబ్లిన్ దియేటర్ లో ప్రదర్శించారు .ఎయిస్లింగ్ ఘేయిర్ వంటి అత్యాదునికనాటకకర్తలు కొత్తరచనలతో ముందుకు వెడుతున్నారు .
విలియం బట్లర్ యేట్స్ ,జార్జి బెర్నార్డ్ షా ,సామ్యుల్ బెకెట్ ,సీమాస్ హీర్ని లు ఐరిష్ సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకొన్నారు.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-20-ఉయ్యూరు

