మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -356

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -356

· 356-పవిత్ర బంధం ,ఆజ్ కా రక్వాలా చిత్ర దర్శకుడు –జొన్నలగడ్డ శ్రీనివాసరావు

జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. పవిత్రబంధం, సోగ్గాడి పెళ్ళాం వంటి చిత్రాలకు సహ దర్శకత్వం వహించిన ఈయన 2001లో అక్కినేని నాగార్జున నటించిన ఎదురులేని మనిషి సినిమాతో తెలుగు సిజననం
శ్రీనివాసరావు 1964, నవంబర్ 4న జన్మించాడు.

సినిమారంగ ప్రస్థానం
దర్శకత్వం చేసినవి

  1. ఎదురులేని మనిషి (2001)
  2. వాళ్ళద్దరూ ఒక్కటే (2004)
  3. జగపతి (2005)
  4. జ్యోతి బనే జ్వాల (హిందీ) (2006)
  5. బంగారు బాబు (2009)
  6. మా అన్నయ్య బంగారం (2010)
  7. ఆజ్ కా రక్వాల (హిందీ) (2011)
  8. ఢీ అంటే ఢీ (2015)[1]
  9. ప్రేమెంత పనిచేసే నారాయణ (2017)[2]

357-కార్తీక పౌర్ణమి ,ముఠా మేస్త్రి నిర్మాత –డి.శివ ప్రసాద రెడ్డి

డి. శివప్రసాద్ రెడ్డి (- అక్టోబర్ 27, 2018) తెలుగు చలనచిత్ర నిర్మాత. 1985లో కామాక్షి మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి కార్తీక పౌర్ణ‌మి, శ్రావణ సంధ్య, విక్కీదాదా, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, ఆటోడ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్, కింగ్‌, కేడి, రగ‌డ‌, ద‌డ‌, గ్రీకు వీరుడు వంటి చిత్రాలను నిర్మించారు

నిర్మించిన సినిమాలు

  1. కార్తీక పౌర్ణ‌మి
  2. శ్రావణ సంధ్య
  3. విక్కీదాదా
  4. ముఠా మేస్త్రి
  5. అల్లరి అల్లుడు
  6. ఆటోడ్రైవర్
  7. సీతారామరాజు
  8. ఎదురులేని మ‌నిషి
  9. నేనున్నాను
  10. బాస్
  11. కింగ్‌
  12. కేడి
  13. రగ‌డ‌
  14. ద‌డ‌
  15. గ్రీకు వీరుడు

మరణం
గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న శివప్రసాద్ రెడ్డి 2018, అక్టోబర్ 27న ఉద‌యం 6.30 ని.ల‌కి చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్సపొందుతూ మరణించాడు.[1][2]

358-రవీంద్రా ఆర్ట్ పిక్చర్స్ అధినేత ,సారధి స్టూడియో నిర్మాత రాలి జనరల్ మేనేజర్ ,అభ్యుదయవాది ,వహీదాను తెలుగు సినిమాకు పరిచయం చేసినవాడు ,పల్లెటూరు ,ధర్మదాత సినీ నిర్మాణ ఫేం ,రఘుపతి వెంకయ్య అవార్డీ–తమ్మారెడ్డి గోపాల కృష్ణ మూర్తి

తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి (అక్టోబరు 4, 1920 – సెప్టెంబరు 16, 2013) హేతువాది, వామపక్షవాది.

జననం
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రులో తమ్మారెడ్డి వెంకటాద్రి, సౌభాగ్యమ్య దంపతులకు1920 అక్టోబరు నాలుగో తేదీన జన్మించాడు. ‘గోరా’ ప్రభావానికి లోనయ్యాడు. మాలపల్లిలో సహ పంక్తి భోజనాలు చేసిన అభ్యుదయవాది. కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరి ‘స్వతంత్ర భారత్’ అనే పత్రిక వ్రాతప్రతిని చుట్టుపక్కల గ్రామాల్లో సర్క్యులేట్ చేశారు. సూరపనేని శేషగిరిరావుతో కలసి ట్యుటోరియల్ ప్రారంభించాడు. సినిమాలవైపు ఆకర్షితుడయ్యాడు. 1945లో కృష్ణవేణిని వితంతు వివాహం చేసుకున్నారు. 1950 నవంబరులో మద్రాసుకు మకాం మార్చిన కృష్ణమూర్తి మొదట్లో ట్యూషన్లు చెప్పుకుంటూ కొంత కాలం గడిపారు. కొడవటిగంటి కుటుంబరావు పేరు పెట్టిన ‘పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్’ సంస్థలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో తొలిసినిమా పల్లెటూరు తీసాడు. సారథి సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, జనరల్ మేనేజర్‌గా ఎన్నో చిత్రాల నిర్మాణానికి కృషి చేశాడు. సారథి నా విశ్వవిద్యాలయం అంటాడు. తెలుగు, తమిళం లలో సుప్రసిద్ధ నటీనటులతో పదమూడు చిత్రాలు తీశాడు. హైదరాబాద్‌లో ‘సారథి స్టూడియో’ ఏర్పాటుకు కృషి చేశాడు. ఆయనే దానికి తొలి జనరల్ మేనేజరు. ‘ఏరువాక సాగారో’ పాటకు నర్తించిన వహీదా రెహమాన్‌ను తీసుకొచ్చింది కృష్ణమూర్తే. 1962 లో తానే సొంతంగా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించాడు. ఆయనకు రవీంద్ర కవి అంటే ప్రాణం. ఆయన సంస్థలన్నీ రవీంద్రతోనే మొదలయ్యాయి. లక్షాధికారి, జమీందారు, బంగారుగాజులు, ధర్మదాత, సిసింద్రీ చిట్టిబాబు, దత్తపుత్రుడు, డాక్టర్ బాబు, అమ్మా నాన్న, లవ్ మ్యారేజ్… ఇలా ఎన్నో చిత్రాలు. జూబ్లీ హిల్స్‌లో ఫిల్మ్‌నగర్ వ్యవస్థాపకుడు. జంట నగరాల్లో ఇరవైమూడు కాలనీలను ఒక గొడుగు క్రిందకు తెచ్చి, ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు. తెలుగు భాషా చైతన్య సమితికి గౌరవాధ్యక్షుడు. తెలుగు భాషాభ్యుదయ సమాఖ్యకు సలహాదారు. ప్రజానాట్యమండలి పోషకులు. నంది అవార్డు ల కమిటీలో సభ్యుడు, ఛైర్మన్ అయ్యాడు. చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ సభ్యుడు. వృద్ధాప్యంలో ఎవరికీ భారం కాకూడనే అభిప్రాయంతో కన్నుమూసే వరకు వృద్ధాశ్రమంలో కాలం గడిపారు. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ సభ్యుడు. ఆ సంస్థ నడిపే వృద్ధాశ్రమంలోనూ సేవ చేస్తున్నాడు. ‘సినిమా ఒక మజిలీ… సమసమాజం నా అంతిమ లక్ష్యం’ అంటారు. ఇతడు2007 లో “రఘుపతి వెంకయ్య అవార్డు”ను పొందినాడు.[1][2]

ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈయన కుమారుడు.[3]

కుటుంబ నేపథ్యం
వారి నాన్న పేరు తమ్మారెడ్డి వెంకటాద్రి, అమ్మ పేరు సౌభాగ్యమ్మ. వారికి ముగ్గురు సోదరులు. ఇద్దరు సోదరీమణులు. సోదరుల పేర్లు సత్యనారాయణ, రఘురామయ్య, వెంకటేశ్వరరావు, ఇద్దరు సోదరీమణులలో ఒకరిని పొట్లూరి హనుమంతరావుకు మరొకరిని పొట్లూరి వెంకట సుబ్బయ్యకు యిచ్చి వివాహం చేశారు.

విద్య
వారి ఊరిలో అప్పుడు కేవలం పాతిక ఇళ్ళుండేవి. ఊరికి దూరంగా మాలపల్లి ఉండేది. వారి ప్రాథమిక విద్య నాలుగో తరగతి వరకు వారి ఊళ్ళోనే జరిగింది. వారి బడిలో చరచూరి వెంకట బ్రహ్మం అనే టీచరు ఉండే వారు. ఆయన చాలా ఆసక్తిగా పాఠాలు చెప్పేవాడు. చదువు విషయంలో వారు ఎప్పుడూ ముందుండే వారు.

రహస్య జీవిత౦]
1946లో నిర్భంధ విధానం వచ్చింది. అప్పుడు రెండు సంవత్సరాలు వానపాముల గ్రామంలో వారి కుటుంబాన్ని ఉంచి వారు రహస్య జీవితానికి వెళ్ళారు.

మరణం
సెప్టెంబరు 16, 2013 న తుదిశ్వాస విడిచారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-11-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.