• మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -381
• 381-నటుడు ,గబ్బర్ సింగ్ ,బాద్షా సినీ నిర్మాత –బండ్ల గణేష్
బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీనిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో చిత్రాలు నిర్మించాడు. 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు.ఆయన 2021లో జరిగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేయనున్నాని ప్రకటించాడు.[1]
రాజకీయాలు
2018 తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో సెప్టెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] కానీ టికెట్ దక్కలేదు.[3] ఏప్రిల్ 5, 2019 న తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.[4]
నిర్మాతగా తీసిన చిత్రాలు
• అంజనేయులు – 2009
• తీన్ మార్ – 2011
• గబ్బర్ సింగ్ – 2012
• బాద్ షా – 2013
• ఇద్దరమ్మాయిలతో – 2013
నటుడిగా
• సుస్వాగతం
• సూర్యవంశం
• సాంబయ్య (1999)
• భరతసింహారెడ్డి (2002)
• విలన్ (2003)
• మనసులో మాట
• నువ్వు నాకు నచ్చావ్
• మల్లీశ్వరి
• ఆంధ్రావాలా (2004)[5]
• 143 (2004)[6][7]
• సరిలేరు నీకెవ్వరు (2020)
• డేగల బాబ్జీ
వివాదాలు
గణేష్ తమని కులం పేరుతో దూషించారంటూ హైదరాబాదుకు చెందిన ఒక డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకు మునుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టే నేతలు కొంతమంది తమ ఎమ్మెల్యే రోజా మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను విజయవాడ జాయింట్ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. 2017 నవంబరులో సినీ రచయిత వక్కంతం వంశీ ఇతనిపై హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టులో చెక్ బౌన్సింగ్ కేసు వేశాడు. కోర్టు ఇతనికి ఆరు నెలలు కారాగార శిక్ష, సుమారు 16 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అయితే వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిలు లభించింది.[8]
382-గీతాఆర్ట్స్ వ్యాపకుడు ,100పర్సెంట్ లవ్ ,పిల్లా నువ్వు లేనిజీవితం సినీ నిర్మాత ,డిష్ట్రిబ్యూటర్ –బన్నీ వాసు
న్నీ వాసు తెలుగు సినిమా నిర్మాత. ఆయన సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్, పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, చావు కబురు చల్లగా (2021) సినిమాలకు నిర్మాణసారధ్యం వహించాడు. [
జీవిత విశేషాలు
ఆయన గీతా ఆర్ట్స్ ను ముందుకు తీసుకొని వెళ్ళే వ్యక్తులలో ఒకరు. ఆయన అల్లు అర్జున్‌కి మంచి స్నేహితుడు అయినందున ఆయనను బన్నీ వాసు గా పిలుస్తారు. ఆయన ఎం.ఐ.టి (మాస్టర్ ఇన్ ఐ.టి) కోర్సు నుండి తప్పుకొని పెంటా సాఫ్ట్ వద్ద 3D ఆనిమేషన్ నేర్చుకున్నారు. జానీ చిత్రం యొక్క లోగో ఏనిమేషన్ కొరకు అల్లూ బాబీ (అల్లు అర్జున్ యొక్క అన్నయ్య) వద్ద చేరారు. ఆయన బన్నీ వాస్ పనిని యిష్టపడ్డాడు. బన్నీ వాసు పాలకొల్లు వాసి. ఆయన గీతార్ట్స్ లో శిక్షకునిగా చేరాడు. ఆయన వంశీ (యు.వి.క్రియేషన్స్) తో కలసి 57 చిత్రాలను గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాఅల్లో పంపిణీ చేసారు. వాటిలో మంచి సినిమాలైన పోకిరి, ఆర్య, మగధీర మొదలైనవి ఉన్నాయి. చివరిగా గబ్బర్‌సింగ్ చిత్రాన్ని పంపిణీ చేసారు. ఆయన బన్నీ అన్ని చిత్రాల నిర్మాణంలో, సృజనాత్మక అంశాలలోనూ పాల్గొన్నారు. [2]
ఫిల్మోగ్రఫీ
Year Film Notes
2011 100% లవ్
నిర్మాత
2014 కొత్త జంట
నిర్మాత
2014 పిల్లా నువ్వు లేని జీవితం
నిర్మాత
2015 భలే భలే మొగాడివోయ్
నిర్మాత
2016 సరైనోడు
సహా నిర్మాత
2017 నెక్స్ట్ నువ్వే
నిర్మాత
2018 నా పేరు సూర్య
Co-నిర్మాత
2018 గీత గోవిందం
నిర్మాత
2019 ప్రతి రోజు పండగే
నిర్మాత
2021 చావు కబురు చల్లగా
నిర్మాత
2021 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
నిర్మాత
2022 పక్కా కమర్షియల్
నిర్మాత
2022 18 పేజెస్
నిర్మాత
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-1-22-ఉయ్యూరు
వీక్షకులు
- 978,715 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం
- బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-3(చివరి భాగం )
- ముదు నూరులో డా.ఎన్.భాస్కర రావు గారింట్లో జీవిత చరిత్రల గ్రంధాలయ వార్షికోత్సవ 0లో 29.01.2023
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, ప్రభావతి దంపతులు
- ‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.20 28.01.2023
- అరుణ మంత్రార్థం. 5వ భాగం.28.1.23
- (no title)
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -11(చివరి భాగం )
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,920)
- సమీక్ష (1,275)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (298)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (357)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు