’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -5 సంస్థాన ఉన్నత సైనికాధికారి ఫకీర్ మోహన్ సేనాపతి
ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -5
సంస్థాన ఉన్నత సైనికాధికారి ఫకీర్ మోహన్ సేనాపతి
ఒరిస్సాలోని కియోన్ ఝార్ జిల్లా ఒకప్పుడు రాష్ట్రమే .భంజా వంశీకులు పాలించారు .ఒరిస్సామధ్యయుగా కవి ఉపేంద్ర భంజా ఇక్కడి వాడే .ప్రఖ్యాత భంజా వంశమైన మామూర్ భంజా వంశపు శాఖకు చెందిన వారు, కోయున్ ఝార్ భంజా వారు .వీరు ఒరిస్సా సాహిత్య సంస్కృతులకు విశేష సేవ చేశారు .1887లో ఫకీర్ 45వ ఏట కియోన్ ఝార్ కు మేనేజర్ గా వచ్చాడు .రాజు ధనంజయ భంజ .రాజు ప్రవేశపెట్టిన సాగునీటి పధకాలు ఆయన పాలనా సామర్ధ్యానికి ఇప్పటికీ గుర్తులుగా మిగిలి ఉన్నాయి .
భూయాన్ తెగ వారి మాతృభూమి కియోన్ ఝార్ .ధనంజయ నారాయణ భంజా అభ్యుదయ భావాలున్న రాజు .ఆయన భూయాన్ యువకుడైన ధరణీ ధర ను భూములసర్వే లో శిక్షణ పొందటానికి ప్రభుత్వం ఖర్చు పై కటక్ పంపాడు .శిక్షణ తర్వాత ప్రోబేషనరి సర్వేయర్ గా నియమించాడు .ఆ కాలం లో ఒరిస్సా అంతా వెట్టి చాకిరీలో మగ్గి పోతోంది .ప్రతి కుటుంబం సంవత్సరం లో కొన్ని రోజులు వెట్టి చాకిరి చెయ్యాల్సిందే .యువకులను పొలం పనులకు వదిలి ముసలి వారే వెట్టి చాకిరీ చేసేవారు .పెద్ద పెద్ద సంభారాలు ,పనిముట్లు ఈ ముసలివారు మోసుకు పోవాల్సి వచ్చేది .రోజంతా వెట్టి చాకిరి చేసి ,రాత్రి తమ అన్నాలు తామే వండుకొని తిని ఆరుబయట పడుకొనేవారు.భూయానులు కూడా ఇలా గొడ్డు చాకిరీ చేయాల్సి వచ్చేది .బ్రాహ్మణులు సంపన్నులు అధికారులు వెట్టి చాకిరీ నుండి తప్పి౦ప బడ్డారు .కియోన్ఝార్ అసిస్టెంట్ మేనేజర్ విచిత్రానంద దాస్ ఒక చిన్న ఆనకట్ట పనిలో కియోన్ లను మాత్రమె నియమించి రాక్షసంగా పని చేయించు కొంటున్నాడు .కాలే కడుపులతో వాళ్ళు పని చేస్తున్నా ,నిర్దాక్షిణ్యంగా కొరడాతో బాదేసే వాడు .మౌనంగా భరిస్తూ కోపం తో ఉడికిపోతూ ప్రతీకారం తీర్చుకోవటానికి నాయకుడి కోసం ఎదురు చూస్తూ సర్వేయర్ ధరణీ ధర ను నాయకుడిగా చేసుకొన్నారు .భూయానులకు ఒకప్పుడు రాష్ట్రం అంతా తమదే నని ,హిందువుల చేత అన్యాయంగా బలవంతంగా అడవుల్లోకి ,కొండ ప్రాంతాలకు నెట్ట బడ్డామని తెలుసు.ఒకప్పుడు ఇది మయూర్ భంజ్ పక్కనే ఉండేది .రాజధాని చాలాదూరంగా ఉండటం చేతతమ మొరను రాజుకు చెప్పుకోవటానికి కష్టంగా ఉందని ,మయూర్ భంజ్ వంశీకులలో ఒక బుల్లి రాజును ఎత్తుకొచ్చి తమ రాజు ను చేసుకొన్నారు .రాజుకు కావాల్సిన గుర్రాలు ఏనుగులు వారికి లేవు .చిన్న రాజాను వీపుపై ఎక్కించుకొని ఒక భూయాన్ పెద్దాయన చేతులతో నేలమీద పాకుతూ గుర్రపు స్వారీలా ఉపయోగ పడేవాడు .ఇలా అతడి సార్వభౌమాధికారాన్ని ప్రకటించారు .ఇంకోడు ఆయువరాజు ముందు సాష్టాంగ పడేవాడు .చిన్న రాజా తన కత్తితో అతడి మెడను తాకే వాడు .ఇలా అతడికి తప్పు చేసిన భూయానులను దండించే అధికారం కట్ట బెట్టారు .కియోన్ ఝార్ కొత్తరాజు పట్టాభి షేకం జరిగినప్పుడుల్లా ఈ ఆచారం పాటించేవారు .కనుక అమాయకులైన కియోనులకు తమ రాజును ఎన్నుకోవటం ఎన్ను కోక పోవటం అనే హక్కు ఏర్పడింది .తమ గడ్డ మీద తమను భయ పెట్టె వారు ఉండరని అనుకున్నారు .
ఉత్తుత్తి రాజు
భూయాన్ యువకుడైన ధరణీధర్ కు దేశ భక్తీ ,అభ్యుదయ భావాలు అలవడ్డాయి .పొరుగు జిల్లా సి౦గ్ భం తో వచ్చిన సరిహద్దు తగాదాలో తన రాష్ట్ర అధికారులకు సాయం చేస్తున్నప్పుడు ,అతని తమ్ముడు గోపాల్ ను ఇతర బంధువుల్ని రాజు అరెస్ట్ చేయించి జైలులో పెట్టాడని తెలిసి వెంటనే ఉద్యోగం వదిలేసి ,అన్నిచోట్లా పర్యటించి తనవారిలో ఐక్యత తెచ్చి రాజరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తెచ్చాడు .తననుమహా రాణి పెంపుడు కొడుకుగా ప్రకటించుకొని ,ఆహోదాతో సంతకాలు చేసి ఫర్మానాలు పంపేవాడు .వందలాది కొండజనం విల్లంబులతో యుద్ధానికి సిద్ధంగా అతడి చుట్టూ చేరారు .రాజు పశువుల శాలలు ,పోలీస్ స్థావరాలను ముట్టడించి మారణాయుధాలు ఆహార సామగ్రి దోచుకొని పోయారు .
ఫకీర్ మోహన్ మేనేజర్ గా వచ్చి ,రాజు ఉండే కియోన్ ఝార్ నున్చికాక ,రాష్ట్ర ఆర్ధిక కేంద్రమైన ఆనందపురం నుంచి వ్యవహారాలు నడిపాడు .విప్లవకారుల విషయాలు తెలుసుకొవటానికి ఎందరో వార్తావహులని నియమించాడు .విప్లవం ప్రారంభమైన మూడోనాడు రాత్రికే రాజు తన రాణీవాసాన్ని వాళ్లఖర్మకు వారిని వదిలేసి తన సైన్యంతో కటక్ కు జంప్ జిలానీ కావటం ఫకీర్ ను ఆశ్చర్య పరచింది . కర్తవ్యోన్ముఖుడైన ఫకీర్ రాష్ట్ర సైనిక సిబ్బందిని విప్లవ కారులని ఎదుర్కోమని ఆజ్ఞలు జారీ చేశాడు .వణికి పోతున్న రాజును కటక్ కు భద్రంగా చేర్చి మిలిటరీ సాయానికి ప్రయత్నించాడు .చాలావరకు విజయం సాధించి రాజుతో ఆనంద పురం తిరిగి వచ్చాడు .మహారాజు ఏనుగు మీద ,ఫకీర్ ఆ వెనుక మరో ఏనుగు మీద వెడుతూ విప్లవకారుల గెరిల్లా దాడుల నుంచి తప్పించటానికి సైన్యం కాపలా కాస్తుండగా రాత్రి వేళ అడవి మార్గం గుండా రాజధాని వైపు వెళ్ళాడు .
సైన్యాధికారి ఫకీర్ సేనాపతి
రెండవ రాత్రి మజిలీలోనే విప్లవకారులు రాజభవనం ముట్టడించిన వార్త చేరింది .హడలి పోయిన రాజు మళ్ళీకటక్ కు ఉడాయి౦చేశాడు .అంతకు ముందే అయన మేనేజర్ ఆత్మరక్షణకు ,ఆస్తి రక్షణకు ,రాణివాసపు మాన ప్రాణ రక్షణకు భూయానులను చంపవచ్చు అనే అధికార పత్రం సంపాదించాడు మెలకువగా .సేనాపతి ఇంటిపేరున్న ఫకీర్ మోహన్ ఇప్పుడు అసలైన సైన్యాధిపతిగా సైన్యాన్ని నడిపించాడు .కొత్త వ్యూహంతో సైన్యం నడిపిస్తూ ,ప్రతి మజిలీలో ఆయుధాలను తనిఖీ చేసేవాడు .ఇదంతా అతడికే ఆశ్చర్యం కలిగించేది కాని బయట పడ లేదు .సిపాయీలంతా వృద్ధులే .బహుశా వారి తాత ముత్తాతలెవరైనా మరాఠీలకాలం లో ఇలాంటి సైనిక దాడుల్ని చూసి ఉంటారేమో .కానీ ‘’డేక్స్ బ్రిటానిక ‘’ప్రకారం వారి ఆయుధాలన్నీ తుప్పు పట్టిపోయినవే .తొందర ప్రయాణంలో తమ తుపాకులను పరీక్షించుకోలేదు .తగినంత తుపాకీ మందు కూడా తెచ్చుకోలేక పోయారు ఆహడావిడిలో .
తప్పుడు సమాచారం భంగపాటు
ఈలోపాలన్నిటికీ అతీతంగా ఫకీర్ సైన్యాన్ని నడిపించాడు .కొందరు సైనికులు తుప్పు పట్టిన కత్తులతో భూయాన్లను చంపుతాం నరుకుతాం అంటూ వీరంగం వేశారు ఫకీర్ ముందు .రాజధాని దగ్గరకు వచ్చేసరికి భూయాన్లు నిజంగా రాజభవనాన్ని ముట్ట డించలేదని ,రాజధాని వెనక రైసన్ గ్రామం కొండల్లో ఉన్నారని ,త్వరలో ముట్టడించ బోతున్నారని వార్త తెలిసింది .విప్లవకారులని వారి రహస్య స్థావరాలలోనే మట్టు బెట్టటానికి గూండాల గుంపును నియమించాడు ఫకీర్ సేనాపతి .వారి బలగాలను గూర్చి సమాచారం తెలుపమని నియోగించిన గూఢ చారుల తప్పుడు సమాచారం నమ్మి ,సూటిగా శత్రువు గుడారం లోకి వెళ్ళిపోయాడు .
లొంగిపోయిన సేనాపతి
అతడు రైసన్ కనుమ దాటుతుంటే శత్రువుల తుపాకి మోతలు వినిపించాయి .విల్లంబులతో నాటు తుపాకులతో వాళ్ళు పొదల చాటున దాగి ఉండటం చూశాడు .ఏమి చేయ్యాలోఆలోచించే లోపు ఒక బాణం రివ్వున దూసుకువచ్చి అతని మెడకు గాయం చేయబోయింది తప్పించుకొన్నాడు .శత్రువులు అధిక సంఖ్యలో ఎక్కువ ఆయుధాలతో ఉండటం గ్రహించి అనవసర రక్తపాతం ఎందుకని లొంగి పోయాడు .
తెలివి తేటలే ఆయుధం
అప్పటి పరిస్థితులలోలొంగి పోయిన సేనాపతి గడుసుగా తెలివి తేటలతో శత్రు నాశనం చేయటానికి సమాయత్తమైనాడు .కియోమ్ఝార్ సింహసనాదికారి అనుకొంటున్న ధరణీధర్ దగ్గరకు ఫకీర్ తీసుకుపోబడ్డాడు .అతడి గురించిపూర్వమే తెలుసు .తాను తన కుటుంబాన్ని పోషించుకొనే ఒక ఉద్యోగిని మాత్రమే అని ఆయువకుడికి చెప్పాడు తెలివిగా .ఈ కొత్త రాజావారికి దివాన్ గా పని చేయాలని ఉందని ,అంగీకరిస్తే తన జన్మ ధన్యం అనీ అన్నాడు .అంత పెద్ద రాజ్యాన్ని తానొక్కడే పాలించటం కష్టంకనుక ఈ మేనేజర్ తనకు సహాయకారిగా ఉంటె మంచిది అనుకోని ‘’వాయస్ ‘’అనగా మామూలుగా అనుమానించే మాయానులు నాయకుడి మాటకు ఎదురు చెప్పలేక పోయారు .పాచిక పారిందిఫకీర్ కి .
వాళ్లకు నమ్మకం కలిగేట్లు ప్రవర్తిస్తూ విల్లు బాణాలతో రాజభవనం ముట్టడించ టం కన్నా మందుగుండు సామగ్రితో పని తేలిక అవుతుందని చెప్పి ,కలకత్తానుంచి డైనమైట్ తెప్పించమని చెప్పాడు ..ఇద్దరికీతమలపాకులు నమలటం అలవాటు కనుక మరింత సన్నిహితులయ్యారు .మరికొన్ని తమలపాకులు పంపమని రాజుకు లేఖ రాస్తున్నట్లుగా రాస్తూ అందులో తీవ్ర సైనిక చర్యతప్పదని సూచింఛి నమ్మకామైన గూఢ చారి ద్వారా పంపాడు .1891మే 16న రాసినఈ ఉత్తర౦ బోలానాథ్ కు అందేట్లు చేశాడు .దీన్ని ధరణీధర్ సెన్సార్ చేశాడు .అందులో ఉన్న విషయం’’నా ఏజెంట్ బోలానాథ్ కు .మహారాణి కుమారుడికి చాలా అవసరం కనుక కనీసం ఒక వంద బెటేల్స్(బెటాలియన్ల సైన్యం ) రెండువందల వక్కలూ పంపండి .నా చెరకు పొలం ఉత్తరాన గోయ్యితవ్వి నీరు పెట్టండి .లేకపోతె పంట పాడవుతుంది ‘’.
ఈ జాబు మూడు తీగముక్కలతో కట్టబడి ఉంది .అదృష్టవశాత్తు అందులోని మర్మాన్ని అధికారులు గ్రహించి వెంటనే సైన్యం పంపారు. ఒక రోజు అకస్మాత్తుగా సైన్యం ధరణీధర్ స్థావరంపై విరుచుకు పడి,బంధించి జైలులో పెట్టారు .కఠిన కారాగార శిక్ష పడటంతో ఉత్తుత్తి రాజు కలలన్నీ ఫకీర్ మాయాజాలంతో కల్లలై ఫకీర్ సేనాపతి వ్యూహం విజయవంతమైంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-1-23-ఉయ్యూరు