కళా విశ్వ నా (ద0 )ధ -7

కళా విశ్వ నా (ద0 )ధ -7

కళాతపస్వి సినిమాలంటే ఒక అరడజన్ సినిమాలనే ఎక్కువగా పేర్కొంటారు వీటితోనే ఆయన కళాతపస్వి అయ్యాడు . తపస్సుకు ఎవరికైనా కొంత నేపధ్యం ఉంటుంది . దాన్ని గూర్చి తెలుసుకొందాం .

 తేనె మనసులు సినిమా డైరెక్టర్ ఆదుర్తి అయినా ,ముఖ్యనటులకు శిక్షణ ఇచ్చింది ఈయనే . చిత్రీకరణలో కూడా సింహభాగం ఆయనదే . టైటిల్స్ లో పేరు పడింది ఆత్మగౌరవం తోనే . అదే ఆయన ఆత్మ గౌరవానికి కళా గౌరవానికి నాంది అని చెప్పాలి . శిష్యుడు విశ్వానికి దర్శకత్వం అప్పగిస్తానని ఊరించి ఊరించి ఈ సినిమా అప్పగించాడు గురువు ఆదుర్తి . అన్నపూర్ణా సంస్థలో కొంతకాలం పని చేయమని చెప్పి అక్కినేని ఇందులో ఆ అవకాశం రావటానికి కారకుడయ్యాడు . డాక్టర్ చక్రవర్తి కె డైరెక్టర్ ఛాన్స్ వచ్చినా ,తన అనుభవం పూర్తిగా చాలదని అనుమానించి ఆదుర్తికి అసోసియేట్ గానే అందులో పని చేశాడు . కధ చర్చాలలో పాల్గొన్నాడు . ఆత్మ గౌరవాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరిస్తున్నప్పుడు ,స్థానిక నటులకు ,సాంకేతిక నిపుణులకు అవకాశమిచ్చి ప్రోత్సహించాడు . అంటే ప్రతిభ ఎక్కడున్నదో  అక్కడ వెతికి పట్టి తెచ్చాడు . రామప్ప  చెరువు  పరిసరాల్లో ,రామప్ప గుడి దగ్గర ,దిండి  ప్రాజెక్ట్ వద్ద ఉన్న అద్భుత లొకేషన్స్ ను కనులపందువుగా చిత్రీకరించాడు చిత్ర విజయానికి మరింత సాయమందిం చాడు . సినిమా విడుదలై అందరికీ  సంతృప్తి నచ్చని  విజయం పొంది తనకీకచ్చిన బాధ్యతకు నూరు శాతం సంతృప్తి పొంది నిర్మాతలకు సంస్థ కు  ఆనందం చేకూర్చి వారి ఆత్మ  గౌరవాన్నీ  పెంచేశాడు .ఉత్తమాకధా చిత్రంగా ,తృతీయ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం పొందింది ఈ సినిమా . దాశరధి రాసిన -ఒకపూ ల బాణం తగిలింది మదిలో -తొలిప్రేమ దీపం వెలిగింది మదిలో ‘’పాట  ఘంటసా లతోనూ ,అందెను నేడే జాబిల్లి -పాటను సోలోగాను సుశీల కమకమ్మగా పాడింది . రాన ని రాలేనని ఊరికే అంటావు ,రావాలనే ఆశ లేనిదే ఎందుకు వస్తావు ?,పరువము పొంగే వేళలో పరదాలు ఎందుకో -చెంగున లేచి చేతులు చాచి  చెలియ నన్న0దు కో ‘’ సినారె పాటను ను ఘంటసాల సుశీల పాడితే ,ఆయనే రాసిన ‘’మారాజులోచ్చారు మహారాజులోచ్చారు మా ఇంటికొచ్చారు మా మంచి వారంట’’ సుశీల, వసంత పిల్లల ఉత్సాహం ఆనందం ,పర వళ్ళు తొక్కేట్లు పాడారు . శ్రీశ్రీ రాసిన -వలపులు విరిసే పూవులే కురిపించే తెనియలే ‘’పాట మాష్టారు సుశీల పాడి  తేనేలే కురిపించారు . ఈ పాటల చిత్రీకరణ పరమ ఆహ్లాదసంగా ఉంది .అక్కినేనిని మాంచి గెటప్ తో డ్రీమ్ బాయ్ గా చూపాడు దర్శకుడు . గీత  రచయితల, గానం చేసినగాయకుల ఆత్మ గౌరవ స్థాయి  బాగా పెంచగలిగాడు దర్శకుడు . సినిమా కధకు మూలం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారం. దీన్ని గొల్లపూడి భమిడి పాటి చిత్రిక పట్టి ‘’డైలాగూ లతో చొక్కాలతో’’ మరింత అందం తెచ్చి ,వాటి ఆత్మగౌరవం పెంచేశారు . రసా లూరే  స్వరరాజేశ్వరుని   సంగీతం ఊయలలూపించి  ,ఆనందపు డో ల లూగించి   చెవులు ,కళ్ళు  మరో వైపుకు తిప్పకుండా తెరకు అంటుకు పోయేట్లు చేసి వీటి ఆత్మ  గౌరవాన్నీ  అందలం ఎక్కించింది. కాంచన వాసంతి రాజశ్రీ ల అందాల మిరుమిట్లు యువకుల మతి చలించేట్లు  చేసి  గుండెల్లో నిండి పోయేట్లు చేసి  ఆత్మ  గౌరవ0   పెంచింది . ఒకరకంగా విజువల్ ఫీస్ట్ ఈ సినిమా . అందరి గౌరవం తార స్థాయికి పెంచేతలు చేశాడు దర్శకుడు విశ్వం  ఫోటోగ్రఫీ కూడా అదే స్థాయిలో ఉండటంతో ఆసినిమా అంత ఎత్తుకు ఎదిగి సక్సెస్ కు మంత్రం  అయింది .

  తర్వాత సినిమా ‘’అల్లుడు పట్టిన భరతం ‘’ఈయన దర్శకత్వంలో కృష్ణం రాజు ,జయసుధ ,రమాప్రభ నాగభూషణం నూతన ప్రసాద్ నటులు . జంధ్యాల మాటలు చెక్కితే చక్రవర్తి సంగీతం వినిపించాడు . ఈ సినిమాలో హీరో తో ముంత కింద పప్పు అమ్మించాడు విశ్వం . అత్తగారి గర్వం అణచటానికి రాజు పన్నిన మాయలు చేసిన చేష్ట లు కడుపుబ్బ నవ్విస్తాయి . డీ. వి . ఎస్ . రాజు నిర్మాత . ఈ సినిమాతోనే డీవీస్ ,విశ్వం కలిసి కొన్ని సీమాలు తీసి చేసి  సక్సెస్ తోపాటు ఫెయిల్యూర్ లు కూడా ఇచ్చారు . తారాగణం ఆడా మగా చాలామందే  ఉన్నారు . దాస్యం గోపాలకృష్ణ సినారె వేటూరి పాటలు రాశారు . ఒకమాదిరి సక్సెస్ పొంది ఉండచ్చు . హాస్యం పండింది పాటలు హుషారుగా ఉన్నాయి . ఎప్పుడు మొదలైందో వివాహ వ్యవస్థ అప్పటి నుంచి కోట్లాది మందిని కలుపుతున్నాయి అనే విశ్వం మాటలతో సినిమా మొదలవుతుంది . అహంకారం తో కన్నూ మిన్నూ కానక వివాహ బంధాన్ని వికచ్చిన్నం చేసుకో బోయిన ఒక యువతి కధ . తులసి ఒక చిన్న కుర్రాడి గా వేసి చండిక మొదలైన పరమగయ్యాళి  కధలను  నాగభూషణం అడిగితే రామాప్రభకు చెప్పి  నీతులు బోధిస్తుంది  . భర్త  నాగభూషణం అల్లుడు కృష్ణం రాజు లను రమాప్రభ  రౌడీలతో కొట్టించి ఇంట్లోంచి తరిమేస్తేతే  భార్య జయసుధను తన ఇంటికి తీసుకు వెళ్ళి బ్రెయిన్ వాష్ చేస్తూ దారికి తెస్తాడు హీరో .’’మనసు పండిన మనువు పండే నమ్మా ‘’అనే రాజు పాడిన  పాట  హీరోయిన్ కు కనువిప్పు అవుతుంది  . చివరికి రౌడీలను ఉతి కే పనితో కృష్ణం రాజు అత్తగారి భరతం పట్టి ,భార్యను దారికి తెచ్చుకొని ,అత్తగారు భర్తకు రెండు చేతులతో  దండం  పెట్టటం తో శుభం కార్డ్ పడుతుంది . తులసి పాత్ర ఇందులో చాలా బాగా ఉపయోగపడింది ముందుకు సాగటానికి  . మంచీ   ,చెడ్డ ల మధ్య  పెంపకపు తప్పులో వచ్చే అనర్ధాలు దాని ఫలితాలు విప్పి చెప్పి కనువిప్పు కలిగించే సినిమా . చివర్లో ఫైటింగ్ కూడా ఉంటుంది . ప్రయోజనాత్మక చిత్రంగా విశ్వం దీన్ని తీర్చి దిద్ది  ఫలితం పొందాడు ఆ బానర్ కు, తనకు నిర్మాత రాజుగారికి హీరో రాజుకు ఎలి వేషన్  ఇచ్చాడు .   సశేషం

మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ -12 -2 -23 -ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.