పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -7
ప్రజాకవి నజ్రుల్ ఇస్లాం
జైలులో ఉన్నా పత్రికలకు కవితలు రాసి పంపుతూనే ఉన్నాడు నజ్రుల్ .ఆయన మిత్రుల అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. విడుదలయ్యాక మిత్రులు ఆయనను తమతో ఉండటానికి ఒప్పించారు .మళ్ళీ రాజకీయ సాహిత్య సమావేశాలకు హాజరౌతూనే ఉన్నాడు .బార్డోలి తీర్మానం ఉత్సాహపు పొంగుపై నీరు కుమ్మరించినట్లయింది .చిత్తరంజన్ అన్నట్లు ప్రజాఉద్యమం చప్పగా చల్లారిపోయింది .పాలకులు రాక్షస౦ గా అణచి వేస్తున్నారు గాంధీని అరెస్ట్ చేసి ఆరేళ్ళు జైలు శిక్ష వేశారు .జైలు నుంచి విడుదలైన దాసు మోతీలాల్ లు సహాయ నిరాకరణానికి కొత్త రూపు తేవాలని ఆలోచించారు .శాసన సభను ప్రతి పక్షంగా ఉపయోగించాలని చెప్పారు .రాజాజీ వర్గం దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు .గయా కాంగ్రెస్ సమావేశం లో అధ్యక్షుడు చిత్తరంజన్ రాజీనామా చేశాడు .మార్పుకోరే మోతీలాల్ హకీం హజ్మత్ ఖాన్ మొదలైనవారు కాంగ్రెస్ లో ఉంటూనే ‘’స్వరాజ్యపార్టీ’’ ఏర్పాటు చేశారు .ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యెక సమావేశం లో వివాదం ముగిసి,ఎన్నికలలో పోటీ చేయటానికి స్వరాజ్య పార్టికి అనుమతిచ్చారు .కాంగ్రెస్ పేరు డబ్బు ఉపయోగించకూడదు అని ఆంక్ష పెట్టారు .1930 వరకు వీళ్ళు సాధించింది ఏమీలేదు .1929 డిసెంబర్ లో కాంగ్రెస్ చేసిన శాసనోల్లంఘన తీర్మానంతో ప్రజాఉద్యమం మళ్ళీ ఎగసి పడింది .మార్పు కోరేపక్షానికి నజ్రుల్ గోప్పవరంగా దొరికాడు .జిల్లాలన్నీ తిరుగుతూ భావ వ్యాప్తి చేశాడు .కొత్తకవితలు పాటలు రాసి పాడుతూ ఉత్సాహ పరచాడు .సార్వ జనీనక గీతాలు గేయాలు రాసి స్పూర్తి కలిగించాడు .
నజ్రుల్ కొమిల్లాలోని సేన గుప్తామేనకోడలు ,గిరిబాల కూతురు ప్రమీల ప్రేమలో పడిపెళ్లి దాకా వచ్చారు.దీనికి గిరిబాల తప్ప గుప్తా ,ఆయన భార్య అంటే నజ్రుల్ మాతృమూర్తిగా భావించి తన పుస్తకం అంకితం ఇచ్చిన విరాజ్ సుందరి అంగీకరించలేదు పెళ్ళికి గిరిబాల మాత్రమె హాజరైంది .1933 సంబంధాలు రద్దయి మళ్ళీ 1938లో కుటుంబాలు కలిసిపోయాయి ఈ పెళ్లిని ముస్లిం లు కూడా ఒప్పుకోలేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-2-23-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,536 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

