శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు,బిఏ బి ఎల్ గారు రచించిన ’శ్రీమదాంజనేయ శతకం శ్రీ బాలి ముఖచిత్రంతో 2006 నహైదరాబాద్ కు చెందిన శ్రీ వాహిని బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు .వెల-20రూపాయలు..ఈ శతకం యడ్లపాడు గ్రామం లో ద్వివిధ రూపాలతో విలసిల్లె శ్రీమదాంజ నేయ స్వామి పై కవి గారు రాసిన శతకం .’’ముందుగా నాలుగు మాటలు ‘’అంటూకుమారుడు రచన మాసపత్రిక సంపాదకుడు శ్రీ యడ్లపాటి .వి ఎస్ ఆర్ శేష తల్ప శాయి  రాసిన వాటిలో –తనకు జన్మ నిచ్చి,1954లో పరలోకం చేరిన తన తండ్రిగారి గురించిన వివరాలు అంతగా తెలియవనీ ,,తెలిసిన విషయాలుమాత్రం ఆయనకు సంబంధించిన కొన్ని పుస్తకాలు మాత్రమె నని –అందులో chembars డిక్షనరి ,స్టూడెంట్స్ ప్రాక్టికల్  డిక్షనరి  ఆఫ్ ది హిందీ లాంగ్వేజ్ ,జాన్ మిల్టన్ పైపుస్తకం ,1936 న్యుఎన్ సైక్లో పేడియా,మద్రాస్ వీక్లీ నోట్స్ ,ప్రిన్సిపుల్స్ ఆఫ్ మహామ్మడియన్ లాస్, శ్రీశొంఠి భద్రాద్రి రామశాస్త్రి  గారిపీఠికతో వావిళ్ళ వారి వసు చరిత్ర .వసు చరిత్ర పుస్తకం లో ఆయన రాసుకొన్న పద్యం –‘’’’భారత భారతీ నిలయ భాసురరంతి,నితాన్తకాల త్రాప –స్ఫార చరిత్ర చాటు విశాల సమంచిత భద్ర పేటి వి-స్తారగుణ ప్రబోధిని నిగారససారమున దీని గల్గేడిన్-పాయదు యడ్లపాటి వర వంశపుజు వేంకట సుబ్బరాయాఖ్యునిన్ ‘’  .వీటితోపాటు ఆయన వద్ద ,వేయిపడగలు రాఘవ పాండవీయం  కుమార సంభవం ,భీమేశ్వర పురాణం ,అసిధార అనేచారిత్రక నాటకం వగైరాలున్నాయని శ్రీ మదాన్జనేయ శతకాన్ని 1936లో బాపట్ల లో ప్రచురించారని గుర్తు చేసుకొన్నారు .తన తండ్రి బాపట్ల మాయాబజార్ లో 1940లో స్వంత ఇల్లు నిర్మించుకోన్నారని ,ఆ యింట్లోనే  తానూ 1944లో పుట్టి పెరిగానని ,తర్వాత అక్కడినుంచి మారిపోవాల్సి వచ్చిందని ,యడ్లపాడులో తమ ఇంటికి ఎదురుగా గుడికట్ట వద్ద ఆంజనేయ దేవాలయం ఉండేదని ,దానిలో తన తండ్రి గారిపేరు ధర్మకర్త గా లిఖి౦ప  బడిందని  ,శ్రీ మద్వీరాన్జనేయస్వామి భీకరం ,సౌమ్యం  రెండు రూపాలతో దర్శన మిస్తారని ,ఆవిగ్రహ రూపకల్పన పై ఒక చాటువు ప్రచారం లో ఉందని ఆవివరాలు చెప్పారు.

యడ్లపాడు నివాసి ఒక శిల్పికి స్వామి కలలో కనిపించి తన రూపాన్ని పై విధంగా చెక్కమని ఆదేశించారని ,తగిన రాయికోసం శిల్పి వెతుకుతూ ఆ వూరి కొండపై దొరకగా ,చుట్టూ పరదాలు కట్టుకొని విగ్రహం చెక్కటానికి సిద్ధపడ్డాడు..శిల్పం పూర్తయ్యే దాకా ఎవరు లోపలి వచ్చి చూడవద్దు అని కోరాడు .రోజూ భోజనం తెచ్చిచ్చే తల్లికి కూడా ప్రవేశం కల్పించలేదు .సంవత్సరం అయినా శిల్పం పూర్తికాలేదు .కొడుకును చూడ కుండా ఉండలేని తల్లి ఒక రోజు గుడారం కింది నుంచి లోపలి ప్రవేశించి స్వామివారి విశ్వరూపం చూసి భయంతో కెవ్వుమని అరచింది .తలవైపు ఉలితో చెక్కుతున్న శిల్పి వెనక్కి తిరిగి చూడగా ఒక ముక్క శిల్పం నుంచి జారి పడింది .ఆ విరిగిన భాగం ఇప్పటికీ విగ్రహంలో స్పష్టంగా కనిపిస్తుంది .ఆతర్వాత ఆ శిల్పి జాడ ఎవరికీ తెలియలేదు .రెండు నిలువుల ఎత్తున్న ఆ భారీ విగ్రహ౦ కొండరాయి నుంచి విడిపడలేదట .ఎలాగా అని గ్రామస్తులు మీమాంసలో పడ్డారు .ఒకరోజు అర్ధరాత్రి అనుకోకుండా స్వామి విగ్రహంకొండమీదనుంచి జారి,గ్రామం లో పడింది .స్వామికి ఎన్ని సార్లు గుడి కట్టే ప్రయత్నం చేసినా,నెరవేర లేదు .స్వామి గ్రామస్తులకు కలలో కనిపించి గుడి కట్టవద్దని ఆదేశించాడట ..తన తండ్రి గారు స్వామిపై శ్రీ మదాంజ నేయ శతకం ‘’రచించి 1935లో బాపట్ల విజయముద్రాక్షర శాలలో ప్రచురించారు .దాని కాపి ఒకటి తన ఇంట్లో ఉందని ,64,98పద్యాలను స్వదస్తూరితో తండ్రి సవరణలు చేశారని ,ఇప్పుడు యధాతధంగా ఆశతకాన్ని తాణు  ప్రచురించానని రచన శాయి తెలియ జేశారు .

  కవి సుబ్బారావుగారు ఆంజనేయస్వామికి శతకాన్ని అంకితమిస్తూ –‘’అతిభక్తిన్ భవ దీయ వర్ణనము పద్య వ్రాతమున్ జేర్చియీ –  శతకంబున్ రచియించి నాడ,మది నెంఛ న్ లేదుసామర్ధ్య మం –కిత మిత్తున్,గయికొమ్ము దేవ వినుతిన్ గేల్మోడ్చి  ప్రార్ధి౦ చెదన్  -పతితోద్ధారక ,యడ్లపాటి పుర సద్భక్తా౦జనేయ ప్రభూ’’.అలాగే కవిగారు మనవిలో –‘’మా ఊరి వీరాంజనేయస్వామి భీకరాకారంతో రణ వీరాన్జనేయులుగా ,సౌమ్యాకారంతో భక్తా౦జనేయులుగా ప్రతిష్టితుడయ్యాడు .నిత్య ధూప నైవేద్యాదులు సక్రమంగా జరుగుతున్నాయి  .మహా మహిమాన్వితుడై, దూర దేశస్తుల కోరికలను కూడా తీరుస్తూ భక్తులపాలిటి కల్ప వృక్షంగా విరాజిల్లుతున్నాడు .అంతటి మహనీయుని కీర్తి౦చ టానికే ఈ శతకం రాశాను .’’అని చెప్పుకొన్నారు యడ్లపాటికవి  .ఇది సీస పద్య శతకం .’’ఆంజనేయ ప్రభూ ‘’అనేది శతక మకుటం . శతకం లోని వివరాలు రేపు తెలుసుకొందాం.     

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-3-23-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.