దృశ్య కావ్యం తీయబోయి దిష్టి కార్యం చేసిన రు(గు)ణ శేఖర్ ?

దృశ్య కావ్యం తీయబోయి దిష్టి కార్యం చేసిన రు(గు)ణ శేఖర్ ?
జర్మనీ పండితుడు ,తత్వవేత్త కవి ,నాటకరచయిత ,విమర్శక విశ్లేషకుడు ,ఆసాహిత్యానికి మార్గ దర్శి గోథే- పూర్తిపేరు జోహన్ వుల్ఫ్ గాంగ్ గోథే కాలిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలం నాటకం చదివి ,తన్మయం చెంది ,పరవశంతో నాట్యం చేస్తూ ‘’దివి భువులను ఏకం చేసిన మహోత్కృష్ట నాటకం ‘’అని ప్రశంసా వర్షం కురిపించాడు .ఆ నాటకం అంతా ఒక ఎత్తు అయితే ,అందులో నాలుగవ అంకం, మరీ అందులో శ్లోక చతుష్టయం నభూతో నభవిష్యతి అంటారు .అలాంటి నాటకాన్ని దృశ్య కావ్యంగా మలచే ప్రయత్నం చేసినట్లున్నాడు దర్శకుడు గుణ శేఖర్ .బాలరామాయణం నిజంగా అలానే తీశాడు .సొగసు చూడతరమా సాంఘిక దృశ్య కావ్యమే .మరీమరీ చూడాలనిపించేదే .చిరుతో తీసిన సినిమా హిట్ అయినా అది మణిశర్మ మ్యూజిక్ కు, వేటూరి పాటలకు దక్కిన గౌరవం . మహేష్ సినిమా కంటెంట్ నాకు బాగా నచ్చింది .మిగిలిన సినిమాలు నేను చూసిన జాడ లేదు .
ఇప్పుడు ఈ శాకుంతలం .శా– అంటూ సాగదీయటం లోనే కొంత దెబ్బతిందేమో .నిజంగా నేను ఈ సినిమా చూడలేదు ఈక్షణం వరకు .చూద్దామని అమెజాన్ లో ప్రయత్నించినా నాకు కనిపించలేదు .మా అమెజాన్ లోనేనా ?మీ వాటిల్లో కూడానా ?అంటే పూర్వం ఒక జోక్ చెప్పుకొనే వారు ‘’బావగారూ మా రేడియోలో చెప్పారు మీరేడియోలో కూడా చెప్పారా’’ ?అని బావగారికబుర్లలో అనుకోనేవారట.అంత చూడని వాడికి నీకెందుకు ఆసినిమాపై అంతటి ఉత్కంత ?అంటారేమో ?అందరూ నెగటివ్ భాష్యం చెప్పిన వారే .చూస్తె పాజిటివ్ గా నాలుగులైన్లు బరుకుదామని ఆశ .అందుకు అవకాశం లేకుండా పోయి౦దికదా అని దుగ్ధ .కనుక నిన్నా ఇవాళ కొన్ని సీన్లు చూశానుఅక్కడక్కడ .వాటి వలన ఏర్పడిన భావ పరంపరే ఇది .శాంతం పాపం .
ఒక దేశం తన కుమారుడి పేరు మీద పిలువబడే తల్లి కి ఎంతటి మహోత్కృష్ట గౌరవం దక్కాలి ?అంటే శకుంతలకు .కానీ ఆపాత్రకు ఎన్నుకొన్న ఆమె తీరు ,నటన స్థాయి ఎంత ఉదాత్తంగా ఉండాలి ?కనిపిస్తే చేతులెత్తి నమస్కరించేట్లు ఉండాలి .కానీ ఇక్కడ అంతా ఉల్టా సీదా .గోడకు వేసిన సున్నంలా ,ఒంట్లో నరాలు కండరాలు నమిలేయబడిన బొమ్మలా ,సిమెంట్ తో చేసిన కరెంట్ స్తంబానికి గుడ్డ పేలికలు చుట్టినట్లుంది .చనులచుట్టూ పూల తోరణమేమిట్రా బాబూ .కళ్ళు మూసుకోవాలని పించటం దారుణం .కణ్వ ముని ఆశ్రమం పవిత్రతకు ,ప్రశాంతతకు నిలయం .ఆ వాతావరణం ఉందా ?గ్రాఫిక్స్ వాడకం ఎక్కువైంది కనుక ఆశ్రమ జంతుగమనానికి వాడటం అసంబద్ధం .ఆశ్రమం లో ప్రతి చెట్టూ మొక్క తీగ శకుంతల పెంపకం లోనివే . వాటితో ఆమె సంబంధం చిరస్మరణీయం .అదికూడా ఉన్నట్లు అనిపించలేదు .మాటలు ,పాటలు హృదయానికి హత్తుకోవాలి .అసలే మణి శర్మ . డ్రమ్ములమోతలో హార్ట్ బీట్ పెంచుతాడు .మెలోడీ చేస్తే కరిగిపోతాం .బహుశా ఆ ఛాయలూ కనిపించలా .
గుణ శేఖర్ బుర్రనిండా భావాలే .వరుడు సినిమా తీస్తున్నప్పుడు రామోజీ లో చూశాం .అయిదు నిమిషాలలో చెప్పాల్సింది అరగంట లాగిస్తాడు.నిర్మాతకు నిండా బొక్క .దానయ్య అలానే దెబ్బతిన్నాడు .ఇందులో తనడబ్బేదో తాను పెట్టుకొని –ఆనందం తీర్చుకొన్నాడు ముతక సామెత లో చెప్పినట్లు .ఇంతలో’’ దిల్ ‘’కరాబై, బలగం తో డబ్బు బలిసిన రాజు ,శేఖర్ నెత్తిన పాలుపోసి,పూర్తి ‘’రుణ శేఖర్ ‘’కావటాన్నితప్పించి,తాను మునిగిపోయాడు . కాలం, జనం, ఆలోచన అన్నీ గాలికి వదిలేసి ఇలా సినిమా వండితే పండదు .మండుతుంది.హీరోయిన్ కేజీల బంగారాన్నీ ,భరత బుడత ను చూడాలనుకొంటే చూడండి తప్పు లేదు . .ఇంతకంటే ఎక్కువ రాయటం మంచిది కాదు పైగా పూర్తిగా చూడకుండా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.