రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -15
మొదటి రోజునే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ లో శాస్త్రి ఒకతీర్మానం ప్రవేశపెడుతూ ,అణచి వేతకు సంబంధించిన సూత్రాలను తొలగించటానికి ఒక కమిటీ వేయామని కోరాడు ..కారణం ఇప్పటికే ఆ సూత్రాల వలన విపరీతమనిన అవమానాలకు బాధలకు గురై గాయపడిన ప్రజల మనసు కొంచెం ఉపశమిస్తుంది అన్నాడు .ఆ అణచి వేత సూత్రాలు మూడు రకాలని ,అందులో ష్టాట్యూట్ బుక్ లో ఉన్న మొదటి క్లాస్ రాజకీయంగా డేంజర్ అని ఎలాంటి పరిస్థితి లోనూ దాన్ని సహించ౦ అనీ ,రెండవ క్లాస్ బహిష్కరణకు సంబందించింది .అది ఆది నుంచి అందరికి కంటగింపుగా ఉండటం తో ప్రజలలో అసంతృప్తి విస్తారంగా ఉంది.ఇవి ‘’A relic on barbarous time ‘’అన్నాడు .కనుక వాటిని వెంటనే అబాలిష్ చేయాలన్నాడు .తర్వాత విద్వేష పూరిత సమావేశానికి సంబంధించిన చట్ట౦ ,న్యూస్ పేపర్స్ ఇన్సిట్ మెంట్ టు అఫెంసేస్ యాక్ట్ టు కాన్సిపిరసి ని జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన మార్పులు నిపుణుల సలహాలపై చేయాలి .చివరగా సభను ,ప్రభుత్వాన్నీ అత్యున్నత స్నేహశీల వాతావరణం తో నడిపించమని కోరాడు .బ్రిటీష ప్రభుత్వం లో రాజ్యాంగ బద్ధమైన స్వేచ్చ అత్యంత ప్రశాంత రాజ్యాంగ బద్ధమైన విధానంతో అనుభవిస్తున్నాము .ఇది ప్రపంచంలో ఎక్కడా లేని అపూర్వ విషయం అన్నాడు .
శాస్త్రి చొరవ ,ప్రభుత్వం ఆలోచనలో వచ్చిన మార్పు వలన వైస్రాయ్ ఆయన అనుచరులు ఒక కమిటీ ఏర్పాటు చేసి ,దాని సలహాతో శాస్త్రి చెప్పిన మార్పులు చేసి , ఎక్సి క్యూటివ్ చర్యలకు న్యాయ విచారణ ఉండాలని నిర్ణయించి రౌలట్ చట్టాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకొన్నది .ఇది శాస్త్రి సాధించిన ప్రజాస్వామ్య విజయం..ఆ కాలం లో శాస్త్రిని ‘’మోస్ట్ బ్రిలియంట్ పార్లమెంటేరియన్ ‘’అని మెచ్చుకొన్నారు .పౌరహక్కుల ,స్వేచ్చలకుపోరాటం లో శాస్త్రి ‘’చాంపియన్’’ అన్నారు .అహంకారం గర్వం మూర్తీభవించిన ఒక యూరోపియన్ చెప్పిన ఆశ్చర్యకర విషయం ఒకటి శాస్త్రి చెప్పాడు .-గుర్రం పై స్వారి చేస్తూ వస్తున్న ఆయన నా గదిలోకి వచ్చి ‘’ఇప్పుడు మేము మీకు మిమ్మల్నినమ్మి సెల్ఫ్ గవర్నమెంట్ ఇచ్చాం.దాని ఫలితంగా మీరు మమ్మల్ని జాతి విభేదాలను వెంటనే రద్దు చేయమనే కోరిక మాకు కానుకగా ఇస్తారా ?.నేను దానికి సరైన సమాధానం చెప్పా .అంతే రెండు నిమిషాల తర్వాత మా ఇద్దరి మధ్యా సుహృద్భావంగా మాటలు జరిగాయి .’’
చాలా ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించి ఇంగ్లాండ్ వెళ్ళాల్సి ఉన్నందున శాస్త్రి కౌన్సిల్ ఆఫ్ స్టేట్ కు తరచుగా దూరం అవాల్సి వచ్చేది .కెన్యా విషయమై పొందిన తీవ్ర నిరాశా బాధ వలన శాస్త్రి ఆరోగ్య౦ క్షీణించి కౌన్సిల్ సభ్యత్వానికి 1925 లో రాజీనామా చేశాడు .20-1-1925 న సభ్యులకు లార్డ్ వైస్రాయ్ రీడింగ్ –‘’లెజిస్లేచర్ లో కూడా కొన్ని అనివార్యమైన మార్పులు తేవాలి .ఉభయసభలు నన్ను మన్నించాలి తన ఆరోగ్యం బాగుండ నందువలన’ ఈ సభ ప్రారంభం నుంచి సభ్యుడిగా ఉన్న’’ ’రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి ‘’ లెజిస్లేచర్ కు చేసిన రాజీనామా తాత్కాలికమే అనీ ,ఆయన ఆరోగ్యం కుదుటపడగానే మళ్ళీ సభలో ప్రవేశించి ‘’Add distinction of his intellectual greatness to the legiislature and to devote his great capacities to public affairs ‘’అని శాస్త్రి సేవలకు కీర్తి కిరీటం పెట్టాడు .అంతేకాకుండా శాస్త్రికి పర్సనల్ లెటర్ కూడా రాసి త్వరగా ఆరోగ్య౦ పొందాలని కోరాడు లార్డ్ .దీనికి శాస్త్రి సమాధానమిస్తూ ‘’నేను ప్రజాసేవనుంచి దాదాపు దూరమయ్యాను .’’Beg you to imagine the feelings of a man of simple ways who finds himself suddenly smothered beneath garlands and bouquets of exquisite beauty and fragrance ?’’.సహజంగా రాజకీయాలు మనుషుల్ని కలపటం కంటే దూరం చేయటం ఎక్కువ .ఒక్కోసారి మనం ఏమిటో మనమే తెలుసుకోలేం.మనకు తెలియనంతగా మనలో పోలికలుంటాయి.The human touch I have experienced at your hands is a revelation of the golden chain that binds us all together ,but is so seldom seen’’అన్నాడు శాస్త్రి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-6-23-ఉయ్యూరు

