రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -16
సమావేశాల యుగం
ఇండియన్ రైల్వేలపై ఏర్పాటైన ఆక్వర్త్ కమిటీ సమావేశాలలో పాల్గొనటానికి అందులో మెంబర్ అయిన శ్రీనివాస శాస్త్రి అప్పటికే ఇంగ్లాండ్ లో ఉన్నాడు .1921లో జరిగిన ఇంపీరియల్ కాంగ్రెస్ కుభారత ప్రతినిధిగా నామినేట్ చేయబడి ,కచ్ కు చెందిన మహారావ్ తో అక్కడే ఉన్నాడు .బొంబాయి కి చెందిన పురుషోత్తమ దాస్ థాకూర దాస్ అనే దేశభక్తి కలిగిన ఉత్తమ వాణిజ్య వేత్త ఆక్వర్త్ కమిటీలో ముఖ్యసభ్యుడు .రైల్వే మేనేజిమెంట్ జాతీయ ప్రభుత్వ ఆధ్వర్యలోనే నిర్వహి౦ప బడాలని గట్టిగా వాదించాడు .దానికి సంబంధించి అన్ని గణాంకాలతో వివరించాడు .శాస్త్రి ఇంపీరియల్ కాంగ్రెస్ సమావేశాలలో బిజీ గా ఉండటం తో ఈ సదస్సుకు ఎక్కువగా హాజరు కాలేకపోయాడు .శాస్త్రి ద్వారా దాస్ ఒక లెటర్ ను రైల్వేస్ స్టేట్ మేనేజ్ మెంట్ లోనే ఉండాలని పూర్తీ వివరాలతో సంపాదించి అంద జేశాడు .ఈ ఉత్తరం ఆక్వర్త్ ను బాగా మెప్పించి ,సుముఖతను వ్యక్తం అయేట్లు చేసింది .చైర్మన్ కాస్టింగ్ వోట్ తో రైల్వేలు స్టేట్ గవర్నమెంట్ అధీనం లో ఉండేట్లు తీర్మానం జరిగింది .
2-6-1921 న ఇంపీరియల్ కాన్ఫరెన్స్ సభలు ప్రారంభమయ్యాయి .శాస్త్రి మాంటేగ్ ప్రక్కనే కూర్చుని తరచుగా విషయాలు చర్చిస్తూ సూచనలు అందిస్తూ ఉన్నాడు ఈ నోట్స్ అంత తర్వాత శాస్త్రి చేత ప్రచురణ పొందింది .మాంటేగ్ పూర్తిగా భారతీయుల పక్షం వహించి అందరి మన్ననలు పొందాడు .శాస్త్రి సాయాన్నే ఎక్కువగా తీసుకొని భారతీయులకు మేలు చేయగలిగాడు .బ్రిటన్ ప్రైం మినిస్టర్ లాయడ్ జార్జ్ కాన్ఫరెన్స్ ను ప్రారంభిస్తూ ఇంపీరియల్ ప్రభుత్వ ఉన్నతభావాలను ఏకరువు పెడుతుంటే,శాస్త్రి ఆయనకు అడ్డు తగిలి తగ్గు బాలయ్యా అంటూ కట్ చేశాడు .ఇంపీరియల్ కాన్ఫరెన్స్ లో తన మొదటి ప్రసంగాన్ని శాస్త్రి జూన్ 21 న చేస్తూ –‘’మనముందు చాలా పెద్ద పెద్ద పనులున్నాయి చిల్లర పనులు చెప్పి సమయం వృధా పరచ వద్దు .మన ఉభయుల అభిప్రాయం తో బ్రిటీష సామ్రాజ్యంలో పని చేస్తూ సామ్రాజ్యానికి బయట విషయాలపై సుహృద్భావం చూపుతూ ప్రజలకు ఎక్కువ మేలు కలిగేట్లు చూడాలి .మీ ప్రసంగం ఆకర్షణీయమే కానీ ,పనులు జరిగేట్లుగా లేదు .ఇండియా ఇంకా డొమినియన్ కాలేదు .అంటే సార్వ భౌమాదికారం పొందలేదు .నేను ,కచ్ మహారావ్ డొమినియన్ ప్రతినిధులం గా అనిపించటం లేదు .ఇక్కడ ప్రైం మినిస్టర్ లు గా ఉన్నాం ..మా ప్రభుత్వాలు మమ్మల్ని నామినేట్ చేసి ఇక్కడికి పంపింది .కనుక మా హోదా లో చాలా తేడాఉంది .కానీ వచ్చే యేడుకానీ ఆతర్వాత కానీ మా వారసులు మాకంటే గౌరవప్రదంగా హక్కులతో హాజరవ్వాలని కోరుతున్నాం..మా వారసులు మాలాగా నామినేట్ కాకుండా ,సెంట్రల్ లెజిస్లేచర్ ద్వారా ఎన్నుకోబడి రావాలని మా ఆకాంక్ష .అప్పుడే ప్రతినిధికి గౌరవం.ఇప్పటికి మాకు ఇంకా పూర్తీ డొమినియన్ హోదా ఇవ్వబడ లేదు .కానీ మేము ఆ హోదాను సాధించే రహదారిలోనే ఉన్నామని మనవి చేస్తున్నాను .’’అన్నాడు .ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనటం వలన శాస్త్రి బ్రిటన్ లో, కామన్ వెళ్త లోని సర్వ శ్రేష్టులను కలిసి వారితో మాట్లాడే అవకాశం దొరికింది .ఇండియా మనోభావాలు వారితో అరమరికలు లేకుండా పంచుకొన్నాడు .ఒక రకంగా వారితో సమాన హోదా తో వ్యవహరించాడు .స్వయం ప్రభుత్వం కాని ఇండియా ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ శాస్త్రి పాల్గొన్నప్పటికీ ,’’He proved him self as effective as any representative of a Dominion could be.’’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-6-23-ఉయ్యూరు

