రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -19
ఆ కాలం లో బాల్ఫార్ ,,బ్రియాండ్ ,వివాని ,సేసిల్ ,రామ్సే మాక్ డోనాల్డ్ వంటి మహా వక్తలున్నారు .ఫ్రెంచ్ లో బ్రియాండ్ , ఇంగ్లిష్ లో శ్రీని వాస శాస్త్రి లీగ్ ఆఫ్ నేషన్స్ లో గొప్ప వక్తలుగా గుర్తింపు పొందారు .1921 నవంబర్ లో శాస్త్రి బ్రిటీష సామ్రాజ్య ప్రతినిధి గా అమెరికాలోని వాషింగ్ టన్ లో జరిగే ‘’లిమిటేషన్ ఆఫ్ ఆర్మ మెంట్స్’’ సమావేశానికి హాజరయ్యాడు .ప్రెసిడెంట్ హార్డింగ్ అధ్యక్షతన అమెరికా ,బ్రిటన్ ,ఇటాలి ఫ్రాన్స్ ,జపాన్ అగ్రరాజ్యాల సమావేశం అది ..నౌకా యుద్ధ సామగ్రిని తగ్గించుకోవటమే ఈ సమావేశ ముఖ్యోద్దేశం..బ్రిటీష దేశ ప్రతినిధి సెక్రెటరి ఆఫ్ స్టేట్స్ బాల్ఫార్ ,చార్లెస్ ఎవాన్స్ అమెరికాకు ,బ్రియాండ్ ఫ్రెంచ్ కు ,ప్రతినిధులు .అమెరికన్లకు అప్పటిదాకా శాస్త్రి ఎవరో తెలియదు .జెనీవా లో మొదటి సారే అయినా ఫినిషింగ్ స్పీచ్ ఇచ్చి శాస్త్రి అందరి దృష్టి ఆకర్షించాడు .బ్రిటీష్ అఫీషియల్ భావాలనే వ్యక్తం చేశాడు ,ఇండియా తరఫున సాధికార ప్రతినిధి గా జాతీయ సంస్కృతీ వ్యక్తిత్వాల ప్రదర్శన చూపాడు .ఆమెరికన్ ల పై శాస్స్త్రి ప్రభావం ఇంతింత అనరానిదిగా మహా ప్రభావం కలిగించాడు .అమెరికన్ కాంగ్రెస్ లో భారత దేశ రాజకీయ పరిస్థితి కళ్ళకు కట్టినట్లు చూపించాడు .
వాషింగ్ టన్ నిరాయుధీకరణ సమావేశం విలువైన తక్షణ చర్యలకు నాంది గా ప్రత్యేకతను చరిత్రలో సంతరించు కొన్నది .ప్రెసిడెంట్ హార్డింగ్ సమావేశం ప్రారంభిస్తూ –‘’నేను అమెరికా తరఫున మాత్రమె సాధికారంగా మాట్లాడుతాను .మా లక్షలాది ప్రజలు యుద్ధం కన్నా ,నిరాయుధీ కరణనే మనస్పూర్తిగా వా౦ఛి స్తున్నారు ‘’అన్నాడు .తర్వాత ఆయన తప్పుకోగా ,సెక్రెటరి హగ్స్ సమావేశానికి చైర్మన్ గా నియమింప బడి ఇలా –‘’ఈ సమావేశం ఒకరికొకరు హితవులు చెప్పుకోవటానికి కాదు కర్తవ్యమ్ వెంటనే అమలు చేయాలని ‘’అన్నాడు .వెంటనే స్పూర్తిదాయకమైన స్టేట్ మెంట్ తో తక్కువ మాటలతో నౌకా యుద్ధ సామగ్రి పై పరిమితులను తెలియ జేయగా ,వెంటనే అమెరికా గొప్ప ఉదాహరణగా నిర్ణయం తీసు కొన్నది ,బాల్ఫార్ కు రాబోయే ఉపద్రవం గురించి సూచన కూడా చేయలేదు .కానీ ఈ కొత్త దౌత్యం వెంటనే ఫలితాలిచ్చింది .ముందుగా బాల్ఫార్ ఆతర్వాత అందరూ ఒప్పుకున్నారు .జపాన్ మాత్రం ఒక సెంటి మెంటల్ షిప్ విషయం లో తటపటాయించింది..శాస్త్రి నాటకీయంగా చేసిన దౌత్యం అందర్నీ ఆకర్షించింది .ఈ విషయం పై ఆయన ఒక ఉత్తరం రాస్తూ –‘’వాషింగ్ టన్ సమావేశం కొత్త దౌత్యం తో శక్తి వంతమైంది .ప్రపంచమంతా యూరోపియన్ చాన్సలరీతో విసిగి వేసారి పోయింది .అందుకే నూతన అంతర్జాతీయ నైతికత ఆవర్భవించింది .బాల్ఫార్ ,కాటో లు తమ దేశప్రభుత్వాల ఆమోదం తెలియ జేయటం సకల మానవాళి యొక్క బాహ్య ఆనందమే .పాత డిప్లోమసి చచ్చి పోయింది .’’Long live the new diplomacy ‘’.అన్నాడు .
ప్రజా విజయం మధ్యలో శాస్త్రికి ఒక దుఃఖ వార్తా షాక్ ఇచ్చింది .శాస్త్రి చిన్నకూతురు సావిత్రి మరణించిన వార్త చేరి , ఆయన్ను కలచి వేసింది .ఆడుఖం లోనే వాషింగ్ టన్ నుంచి వెంటనే పెద్ద కూతురు రుక్మిణికి ఉత్తరం రాస్తూ –‘’ఇప్పటికే మీరంతా తీవ్ర దిగ్భ్రాంతి లో ఉండి ఉంటారు .ఇప్పుడు నేను ఆబాద అనుభవిస్తున్నాను .ఏమని రాయాలో కాళ్ళూ చేతులూ ఆడటం లేదు మనసు బుద్ధి మోద్దుబారాయి .అమ్మా ఏడవకు .నేను యేడుసుస్తున్నాను చాలు .అమ్మను జాగ్రత్తగా చూసుకోండి .విధి ఆమె పై దారుణంగా దెబ్బతీసింది .నేను మీకోసం కొన్న వాచ్ మొదలైన వాటినిఈపాటికి మీకు పంపించి ఉంటే చూసి సంతోషించేది .ఎంత ఫూలిష్ గా ఆలోచిస్తున్నాను నేను .చెల్లి నా కోసం తపించి నన్ను చూడాలని అనుకొని ఉంటుంది .దైవమా!నేను తట్టుకోలేక పోతున్నాను ‘’అని విలపించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-23-ఉయ్యూరు

