రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -21
శ్రీనివాస శాస్త్రి డొమినియన్ టూర్ కు బయల్దేరి వెళ్ళే ముందు ,’’ఆయన అప్రతిష్ట ‘’కాంగ్రెస్ వారిలో ,భారత ప్రజలలో శిఖరాయమానంగా ఉంది.జవహర్ లాల్ ఆయన్ను ‘’ఇంపీరియల్ దూత ‘’’అన్నాడు .కానీ శాస్త్రి మనసులో హృదయం లో బుద్ధిలో ఇండియన్ విషయాలపై ఆసక్తిలేని హెచ్ ఎల ఎస్ పొలాక్ వంటి వారిని చూసి తాను ఒక బృహత్తర దేశభక్తి యుతమైన విధిని డొమినియన్ లలో స్థిరపడ్డ భారతీయుల గౌరవ ప్రపత్తులను పెంచే ఉద్దేశ్యంతో త్రికరణ శుద్ధిగా చేబట్టిన కార్యక్రమం అని నమ్మాడు .ప్రపంచ దృష్టిలో ఇండియా ప్రతిరూపం ను పైకి ఎత్తి చూపటమే అని భావించాడు .అంటే ఇండియా ప్రతిష్ట పెంచి ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించటమే .
వెళ్ళిన ప్రతి చోటా శాస్త్రికి ఆదర స్వాగతమే లభించింది ఆయన ఉపన్యాస ఝరిలో వారంతా తడిసి ముద్దాయి అభిమానులైపోయారు .అష్ట్రేలియాలో శాస్త్రి అత్యంత ఘన విజయం సాధించాడు .అష్ట్రేలియా ప్రధాని హగ్స్ ,శాస్త్రి పర్యటన పూర్తియ్యాక అద్భుతమైన చిరస్మరణీయమైన మాటలు రాస్తూ –‘’your presence is here has been of itself an education to most of us .’’అంటూ మీ ప్రసంగాలు మీ వ్యక్తిత్వం లతో మన మధ్య ఉన్న పక్షపాతం తెరలు తొలగిపోయాయి .భారత దేశ ప్రతిభ ఏమిటో ఇప్పుడే మీవల్లనే మొదటి సారి మాకు తెలిసింది ఆదేశపు విజ్ఞానం మాకు మీద్వారా అవగతమైంది .మాదేశ ప్రజలకు ,పార్లమెంట్లోనూ బయటా కూడా మీ ఉపన్యాసాలతో మాకు జ్ఞానం అందించారు .మీరు రాక పోయి ఉంటే అంతటి మహా అదృష్టష్టాన్ని మేము పొందలేక పోయి ఉండేవాళ్ళం .ఉన్న రాజకీయ పరిమితులలో మీరు 1918 ,1921 సమావేశాలలో తెచ్చిన తీర్మానాలు ఉత్తమోత్తమమైనవి .మీ దేశం తరఫున మీఅసమాన ప్రతిభను ప్రదర్శించి సత్ఫలితాలు సాధించి చరిత్రలో నిల్చిపోయారు .ఒక వేళ మీరు సాధించాల్సిన వాటిలో ఆలస్యం జరిగితే సహనం మాత్రం కోల్పోవద్దు .you have achieved wonders ,and in my opinion removed for all time those prejudices and misunderstandings which formerly prevented the admission of your countrymen resident in Australia to the enjoyment of the full rights of citizenship .’’అని మనస్పూర్తిగా పొంగిపోతూ యదార్ధం రాశాడు .ఆస్త్రేలియా టూర్ సద్యో ఫలితాన్నిచ్చింది శాస్త్రికి .1925లో ఆస్త్రేలియా పార్లమెంట్ అక్కడున్న భారత పౌరులకు పూర్తీ పౌరసత్వాన్నిస్తూ చట్టం తెచ్చింది .ఇది అద్భుత విజయం శాస్త్రికి .అయినా శాస్త్రి పై ‘’వైట్ ఆస్త్రేలియా పాలసి ‘’కి లొంగిపోయాడు అనిముద్ర వేశాడు .కానీ ఇలాంటిదానినే పూర్వం గోఖలే నెహ్రూలు కోరారు అని వాళ్ళు మర్చి పోయారేమో ? శాస్త్రి ఆస్త్రేలియా పాలసీని ప్రశ్నించలేదు ,పోనీ దాన్ని సమ ర్దిం౦చ నూలేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు .బ్రిటీష సామ్రాజ్యంలో కామన్ సిటిజన్ షిప్ అంటే సామ్రాజ్యంలో ప్రజలు హాయిగా స్వేచ్చగా తిరగటానికి,ఎక్కడైనా నివసి౦చటాటానికీ ఏ వృత్తీ అయినా తన అర్హత ననుసరించి చేయటానికి ,తన శక్తి సామర్ధ్యాలు స్వయంగా పెంపొందించు కోవటానికి ,ఎక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొన్నా చట్ట పరిధిలో పూర్తిగా వికాసం పొందటానికి ఏర్పడిన హక్కు .డొమినియన్ ప్రభుత్వాలు తమప్రజలాభీష్టాన్ని అనుసరించి వారి సంస్కృతీ వికాసాలను పరిరక్షణ చేయటం . దీనిపై స్పందిస్తూ శాస్త్రి –‘’నా పర్యటనలో వైట్ ఆస్త్రేలియా పాలిసీ ను చర్చించటం లేదు .1918 ఇంపీరియల్ వార్ కాన్ఫరెన్స్ లో డొమినియన్ లకోరికలకు గౌరవం ఇవ్వాలని ఇండియాతీర్మానించింది కనుక ఆ విషయమై నేను ప్రశ్నించే అధికారం లేదు ‘’అన్నాడు .
శాస్త్రి పై మరో అభియోగం కూడా ఆయన శత్రువులు తెచ్చారు ఆయన బ్రిటీష ఎంపైర్ ను పొగడ్తలతో మున్చాడుఅని .But what Sastri actually did was to picture the Australians an ideal British Empire with justice ,fair play and perfect equality amongst its components which alone would have the moral authority to include India in it .’’శాస్త్రిపై మరో అభియోగం సహాయ నిరాకర ఉద్యమాన్ని తిరస్కరించాడు అని .కానీ ఆఉద్యమ నాయకుడు గాంధీ బహుముఖ ప్రతిభను ఆయన మెచ్చుకొన్నాడు .దానితో గాంధీని అభిమానించే వారు మరింత పెరగటమేకాదు ఆయన ఆరాధకులూపిచ్చపిచ్చగా పెరిగారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-7-23-ఉయ్యూరు

