రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -23
కెన్యా పోయింది అన్నీ పోయాయి
డొమినియన్ టూర్ తర్వాత శాస్త్రి 24-11-1922 న ఇండియా కు తిరిగి వచ్చాడు .అయన దగ్గర స్నేహితులు కానీ బంధువులుకానీ కొద్దిగా దుఖం కాస్త కన్నీరు చిలికారేకానీ అతడి విఫల టూర్ ను పట్టించుకోలేదు .కానీ తన సహజ గంభీర స్పూర్తితో శాస్త్రి మళ్ళీ తన కార్యరంగం లోకి అడుగుపెట్టాడు .ఆ డిసెంబర్ లో నాగ పూర్ లో జిగిన నేషనల్ లిబరల్ ఫెడరేషన్ సమావేశానికి అధ్యక్షత వహించాడు ..రాజ్యంగ సంస్కరణల విధానంగా భారత సైన్యాన్ని భారతీయ౦ గా పూర్తిగా తీర్చి దిద్దాలని ,చేసిన వాగ్దానాలన్నీ ప్రభుత్వం వెంటనే అమలు చేవాలని గట్టిగా వాదించాడు .ముందు పెట్టిన పదేళ్ళ గడువు కంటే ఇవి ముందే నెరవేర్చాలని చెప్పాడు . నాన్ కో ఆపరేషన్ ,నాన్ వయోలెన్స్ వైపు లిబరల్ పార్టీ ముఖం పెట్టరాదు అన్నాడు .విధి సక్రమంగా చేయకపోతే,అన్యాయంగా ప్రవర్తిస్తే , ఎంత పెద్ద నాయకుడి నైనా ఎంత పెద్ద ఆఫీసర్ నైనా ఎదిరిమ్చాల్సిందే అన్నాడు –‘’మన ఇంగ్లీష్ సోదరులు దీన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి .స్వరాజ్ విషయం ఎంతవరకు వచ్చింది అని రోజూ ప్రశ్నించాలి .స్వీయ ప్రభుత్వం విషయంలో ప్రతి ఆఫీసర్ ను అతడి వంతు కార్యక్రమం ఎంతవరకు జరిగింది అని అడగాలి.మనకోసం ,ఇండియా కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రతి రూపాయిని రాబట్టాలి .రాకపోతే నిలదీయాలి .బ్రిటీష కామన్ వెల్త్ ఆదర్శాలపై మనం నమ్మకం కలిగి ఉండాలి .అందులోనే మన సమాన హక్కులు హోదా గౌరవం ఉన్నాయని గ్రహించాలి .అవి రాతలు వాగ్దానాలలో కాక వెంటనే కార్య రూపం పొందాలని మనం కోరాలి .మన చర్యలు శాంతియుతంగా రాజ్యాంగ బద్ధంగా ఉండాలి .మనం కోరినవి అన్నీ అత్యంత అవసరమైనవే అనే అభిప్రాయం పైవారిలో సృష్టించాలి .మనం కోరుతున్నది ఆదేశిమ్పబడిన అభి వృద్ధి మాత్రమె – ఆర్డర్డ్ ప్రోగ్రెస్ .పబ్లిక్ అఫైర్స్ లో మనం గౌరవ ప్రదమైన రాజీ ని తృణీకరించం. ఉన్న స్థితి నుంచి ఇంకా మంచి స్థితి కి తీసుకు వేల్లెట్లుగా ఆ రాజీ ఉండాలి అంతేకాని ఉన్నదాన్ని అధ్వాన్నం చేసేట్లు ఉండరాదు .
డొమినియన్ టూర్ నుంచి తిరిగి రాగానే శాస్త్రి మెదడులో కెన్యాలోని క్రౌన్ కాలనీలో ఉన్న ఇండియన్ ల స్థితి ఎలా ఉన్నది అనే ఆరాటమే .కెన్యా కాలనీలలో ఇండియన్ల ,తెల్ల వాళ్ళ మధ్య సత్సంబంధాలు లేవు .లండన్ లోని పలుకుబడిగల వారంతా నిరాశతో చేతులెత్తేశారుఅని నాగపూర్ సభలో చెప్పాడుకూడా . కెన్యాలో ఇండియన్ సెటిలర్స్ క్రితం శతాబ్ది మధ్యభాగంలోనే తెల్లవారికంటే ముందే స్థిర నివాసాలు ఏర్పరచుకొన్నారు .చర్చిల్ పూర్వం లో ‘’ఈస్ట్ ఆఫ్రికన్ టూర్ ‘’లో చెప్పినట్లు ఇండియన్ సెటిలర్స్ అక్కడ బ్రిటీష కాలని ఏర్పడటానికి చాలా కాలం ముందే అవసరమైన దంతా చేసేశారు .బ్రిటీష వారిని ఆకర్షించి ,పారిశ్రామిక గ్రూపులుగా ఏర్పడటానికి ఇండియన్స్ ప్రోత్సహించారు .ఇండియన్ సెటిలర్స్ కొత్తగా వచ్చిన బ్రిటీష సెటిలర్స్ ను జర్మని ,హంగేరి లనుంచి మొదటి ప్రపంచ యుద్ధకాలం లో సంరక్షించారు .యుద్ధంలో ఇండియన్లు వేలాదిగా చనిపోయారు .మైనారిటి బ్రిటీష సెటిలర్స్ ఇదంతా మర్చిపోయి వాళ్ళకున్న చొరవ అధికారంతో ఆధిపత్యం సాధించారు .ఇండియన్లు అందువల జాతి దురహంకారానికి తీవ్రంగా గురై బాధ పడుతున్నారు ,వ్యాపార వ్యాణిజ్యాలలో తక్కువ రకం పౌరహక్కులతో తీవ్రంగా కలత చెందారు ,అవమానం పాలైనారు .క్రమంగా వారిలో స్వాతంత్ర ఇచ్చ తీవ్రమై ,హక్కులకోసం బ్రిటీష వారితో సమాన సిటిజెన్ షిప్ కోసం ఉద్యమించారు .భారత ప్రభుత్వం వారిని అన్ని రకాల బలపరచింది .కెన్యా భారతీయులకు రెండు సీట్లు ప్రత్యెక వోతర్లతో ఎన్నుకోనబడేట్లు స్వాగతించింది .దీనితో మండిపోయిన కెన్యా వైట్స్ ఎదిరించి కెన్యాలో ఇండియన్ ఇమ్మిగ్రేషన్ పై ఆంక్షలు విధించాలని నెత్తీ నోరూ కొట్టుకున్నారు .ఇంపీరియల్ కాన్ఫరెన్స్లో సమాన పౌరహక్కులు సూత్ర ప్రాయంగా ఒప్పుకోని ఇప్పుడు ఈరభాస చేస్తున్నారు .జనరల్ స్మట్స్ వ్యతిరేకించినా క్రౌన్ కాలనీల సెక్రెటరి ఆఫ్ స్టేట్ చర్చిల్ శ్రీనివాస శాస్త్రి గట్టి పట్టుదల వలన ‘’ఇక బ్రిటీష సామ్రాజ్యంలో జాతి రంగు విచక్షణ ఉండదు ,ప్రతిభ కలవారేవరికీ అడ్డంకులు ఉండవు .ఇంతకంటే గొప్ప మంచి నిర్ణయం మేము చేయలేక పోవచ్చు ‘’అని ప్రకటించా

