దురదృష్ట వశాత్తు చర్చిల్ మాటమీద నిలబడలేదు .తెల్ల సెటిలర్స్ నాయకుడు బ్రిటన్ కు వ్యతిరేకంగా విప్లవం తెస్తామని బెదిరించాడు .ఈలోపు ఇండియా ఆఫీస్ ,లండన్ లోని కాలని ఆఫీస్ లమధ్య నిరంతర చర్చలు జరిగి వుడ్-వింటర్ టన్ ఒడంబడిక కుదిరి ,ఇండియా సెటిలర్స్ కు అనుకూలంగా కొన్ని విషయాల జరిగాయి .చర్చిల్ పదవిలో ఉండగా పూర్తీ పరిష్కారం కుదరలేదు .చర్చిల్ స్థానం లో వచ్చిన డ్యూక్ ఆఫ్ డైవిన్ షిర్ ,లార్డ్ పీలెలు పై అగ్రిమెంట్ ను తిరస్కరించారు .తర్వాత జరిగిన సంఘటనలు జనరల్ స్మట్స్ ,చర్చిల్ లకంటే ఇండియన్ సెటిలర్స్ పైన ఎక్కువ సానుభూతిగాఉన్నట్లు తేలింది .దీనిపై ఇండియాలో ఆందోళన పెరిగి ,ప్రభుత్వం శ్రీనివాస శాస్త్రి నాయకత్వంలో ఒక ఇండియన్ లేజిస్లేటర్స్ బృందాన్నిపంపి కెన్యాలోని ఇండియన్ లకు సమాన పౌరహక్కులు ,ఇరు జాతులమధ్య సమానత్వం సాధించామని పంపింది .ఇక్కడ కూడా శాస్త్రి మొదటి రాయబారిగానే ఉన్నాడు .కెన్యాలోని యూరోపియన్ సెటిలర్స్ నాయకుడు లార్ద్ డేల్మార్ లండన్లోని బ్రిటీష ప్రభుత్వాన్ని ,లండన్ రాజకీయ సరిల్స్ ను ప్రభావితం చేశాడు .తూర్పు ఆఫ్రికా నేటివ్ జాతుల అభిరుచులకు తన మద్దతు ఉన్నట్లుగా చెప్పుకొన్నాడు .కెన్యాలోని బ్రిటీష సెటిలర్స్ కు వ్యతిరేకంగా బ్రిటీష ప్రభుత్వం ఏదైనా చేస్తే విప్లవం సృష్టిస్తానని హెచ్చరించాడు .కనుక ఇప్పుడు శాస్త్రి బాగా ప్రభావశీలి ,క్రూరమైన ప్రత్యర్ధితో తలపడ బోతున్నాడన్నమాట .అంతేకాదు అన్ని హామీలను ,జాతులమధ్య న్యాయాన్నీ ,సరస సంభాషణలను తిరస్కరించే బాగా పకడ్బందీ వ్యూహంతో ఉన్న బృందంతో తలపడాల్సి వచ్చింది .యూరోపియన్ స్టేట్మెంట్ లో-‘’డర్బాన్ వెనుక ద్వారాన్ని మూసేసింది ,ముంబాసా ముందు తలుపు మూసేస్తుంది ‘’.
లండన్ చేరగానే కెన్యా, ఇండియన్ డెలిగేషన్ లు చర్చలు జరపాలని ఒక ప్రణాళిక తయారు చేశాయి .22-5-1923న శాస్త్రి జి యే నటేశన్ కు ఒక ఉత్తరం రాస్తూ –‘’ఈ నెల మూడవ తేదీ ఆగాఖాన్ రిట్జ్ హోటల్ లో ఏర్పరచిన సుదీర్ఘ చర్చలు జరిపి ఒక అగ్రిమేంట్ కు వచ్చాం .1-ఇండియా ఇమ్మిగ్రేషన్ హక్కుకెన్యా విషయం లో పూర్తీ నిబద్ధత ఉన్దిమాకు2-వుడ్ –వింటర్ ఒడంబడికలోని మిగిలిన విషయాలైన విడదీయటం ,-హైలా౦ డ్స్ సమస్య పై మాట్లాడుకోవచ్చు .ఒకే రకమైన అర్హతలతో మా జాతులలో పది శాతం వారికి వోటు హక్కు ఇవ్వాలి ,పద కొండు లో మాకు నాలుగు నియోజక వర్గాలు కేటాయించాలి .శాస్త్రి ఎన్నో నిద్రలేని రాత్రులు సంభాషణలతో రాతలతో,ఇంటర్ వ్యులతో మనకు సపోర్ట్ గా అభిప్రాయాన్ని కూడా గట్టటంలో గడిపాడు తన సోదరుడు రామస్వామి శాస్త్రికి ఉత్తరం రాస్తూ శాస్త్రి –‘’లార్డ్ పీల్ ,వింటర్ టన్సర, లూయీ కేర్షాలతో సుదీర్ఘ ఇంటర్వ్యూలు జరిపాను .ఏదీ దాచలేదు .నాస్వభావానికి విరుద్ధంగా మరీ కరకుగా –బ్ల౦ట్ గా మాట్లాడా .చాలా సూటిగా వాడిగా వేడిగా మాట్లాడిన సందర్భాలున్నాయి జమ్నాదాస్ చాలా ఆశ్చర్యపోయాడుకూడా . పీల్ మనకు అనుకూలం .అనేకవిందు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభావిత వ్యక్తులతో మాట్లాడే అవకాశం కల్పించాడు ‘’అని తెలిపాడు .
పొలాక్ ,యాన్దర్సన్ లకు సమస్యలపై గొప్ప అవగాహన ఉన్నది .మన హక్కులపై , మనం పోరాడే న్యాయంపై సానుభూతి ఉంది .ఇండియన్ సమస్యను అర్ధవంతంగా పరిష్కరించాలనే తపన ఉన్నది .పొలాక్ కూడా ఉభయ డెలిగేషన్ లపై మంచి ప్రభావం చూపాడు .ఇండియన్ డెలిగేషన్ కు మన కేసు వారికి చెప్పగాలిగామని సంతృప్తి వచ్చింది .తర్వాత బ్రిటీష గవర్నమెంట్ తెచ్చిన రాజీ ఫార్ములాపై తీవ్రంగా ఎదురు దాడి చేశారు .అదిఒప్పుకొంటే మనం పూర్తిగా హక్కుల్ని వదలుకొని లొంగి పోవటమే అవుతుందని గ్రహించారు .వైట్ పేపర్ ప్రకటన లో ఇండియాకు చెందిన మూడు విషయాలలోరెండిటిని తిరస్కరించి మొండి చెయ్యి చూపారు .కామన్ వోటర్ల జాబితా ,హైలాన్డ్స్ విషయాలను తిరస్కరించి ఇండియన్ లకు ఈస్ట్ ఆఫ్రికాలో ఇమ్మిగ్రేషన్ మాత్రం ఒప్పుకున్నారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ –-5-7-23-ఉయ్యూరు

