![]() ![]() | |||
![]() | |||
రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -27
పై సంఘటన వలన శాస్త్రి గాంధీ ల మధ్య ఎంతటి సుహృద్భావం ఉన్నదో తెలుస్తోంది .1924లో సెల్ఫ్ గవర్నమెంట్ ల ఏర్పాటును త్వరితం చేసేందుకు అన్నిపార్టీల సహకారం కోసం ప్రయత్నం జరిగింది .అపెండి సైటిస్ ఆపరేషన్ జరిగి కోలుకున్నాక గాంధీ విడుదలయ్యాడు జైలు నుంచి .సహాయ నిరాకరణ ఉద్యమం లో జరిగిన దారుణ హింసాత్మక సంఘటనలు విని మహాత్ముడు చలించిపోయాడు .తాను పరీక్ష పెట్టుకొని ,శుద్ధి పొందటానికి ప్రయత్నించాడు అనుచరులూ అలానే చేశారు .బీద జనోద్ధరణకోసం ,దేశాభి వృద్ధికోసం నిర్మాణాత్మక విధానమే సరైనదని నిశ్చయించి ఆ మార్గంలో ప్రజలని నడిపించే ప్రయత్నం చేశాడు .చరఖాతో నూలు తీయటం .ఖద్దరు ధరించటం బోధించాడు .ఇవి పల్లెప్రజల వృత్తులకు,సంక్షేమానికి ప్రోత్సాహకరం అని ఉద్బోధించాడు..కల్లు దుకాణాలు మూసేయ్యాలనీ , అస్పృశ్యత పాటి౦చరాదని ఉద్బోధించాడు.
కాంగ్రెస్ లో ఒక కొత్త పరిణామం ఏర్పడింది .మొదటినుంచి కుడిపక్షంలో ఉంటూ కౌన్సిల్ల ఏర్పాటు ను బాయ్కాట్ చేయాలన్న చిత్తరంజన్ దాస్ ,మోతీలాల్ తో కలిసి స్వరాజ్య పార్టీ పెట్టాడు .సహాయ నిరాకరణ సమర్ధించిన వారికి మార్పు ఉండరాదు –నో ఛే౦జ్ అనే వారికి మధ్య వివాదం ఏర్పడింది .ఇరువైపుల వారూ గాంధీపై పూర్తీ అపేక్షతోనే ఉన్నారు .గాంధీ మాత్రం స్వరాజ్య పార్టీ వాళ్లకు వాళ్ళ దారిలో వారిని వెళ్ళమన్నాడు .సెంట్రల్ అసెంబ్లీకి వీళ్ళు మోతీలాల్ నాయకత్వంలో ఎక్కువ సంఖ్యలో ఎన్నికయ్యారు .విఠల్ భాయ్ పటేల్ ను అ సెంబ్లీ ప్రెసిడెంట్ గా ఎన్ను కొని మొదటి ఘన విజయం సాధించారు .శాసన సభలను కూల్చటానికే ఏర్పాటైన వీరు ,ప్రభుత్వం చక్కని చాకచక్యం చూపిస్తే ,సహకారులుగా ,రాజ్యాంగ బద్ధంగా దేశ పురోభి వృద్ధికి తోడ్పడేవారు.అసెంబ్లీలో కాలుపెట్టిన మొదటి రోజే మోతీలాల్ ‘’ఇప్పటిదాకా చేయలేకపోయిన దాన్ని ఇప్పుడు చేయవచ్చు అని వచ్చాం .అవకాశమిస్తే మీసహకారం మాకు ఉంటే మీకు సహకరిస్తాం మేమంతా బయట నాన్ కో ఆపరేటర్స్ గా ఉన్న వాళ్ళమే ‘’అన్నాడు .
స్వరాజ్య పార్టీ వారు అధిక సంఖ్యలో అసెంబ్లీకి ఎన్నికవటం శాస్త్రికి చాలా సంతోషం కలిగించింది .మధ్య పరగణాలు బేరార్ లలో అధిక సీట్లు పొందినా ,వాళ్ళు అధికారం కోరుకోకపోవటం ఆశ్చర్యం కలిగించింది .మోతీలాల్ మోకాలు అడ్డేప్రయత్నాలకు శాస్త్రి చీదరించుకొన్నాడు .దీనికి బదులు దేశాభి వృద్ధికి,ఐశ్వర్యాభి వృద్ధికి అతడి తెలివి తేటలు ఉపయోగిస్తే బాగుంటుంది అన్నాడు .1923ఫిబ్రావరిలో అనిబిసెంట్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సభకు ఒక సందేశం పంపిస్తూ శాస్త్రి –‘’ప్రభుత్వాన్నిఒక్క క్షణమైనా బలహీనపరచితే ,అడ్డుకొంటే ,ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వరాజ్యం పొందేదాకా కదలనివ్వకపోతే ఆతర్వాత మనం ఎలుగెత్తి ఏద్వాల్సి రావచ్చు ‘’అంటూ –‘’జాతీయ విద్యావిధానాన్ని అక్షరాలా సాధిస్తూ ,పారిశుధ్యాన్ని అలవర్చుతూ,దేశీయ పరిశ్రమలు స్థాపించి ప్రజలకు ఉపాధి కలుగజేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తే సత్ఫలితాలు వస్తాయి .అప్పుడే అసలైన రాజాకీయ స్వరాజ్యం సిద్ధిస్తుంది అన్నాడు శాస్త్రి .
స్వరాజ్య పార్టీ వారు బ్రిటీష ప్రభుత్వానికి జాతీయ డిమాండ్ ను అందజేయటానికి సిద్ధమౌతుంటే శాస్త్రి ఒప్పుకోని న్యు ఢిల్లీలో 3-2-1924 నఎన్నికైనకేంద్ర ,రాష్ట్రాల శాసన సభ్యుల సమావేశానికి శాస్త్రి హాజరయ్యాడు .ఈ సభ రాజకీయ ,ఆర్ధిక ,విదేశీ ,రక్షణ మొదలైన వాటితో సహా పూర్తీ బాధ్యతాయుత ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది .బ్రిటన్ లో లేబర్ పార్టి అధికారం లోకి రావటం వారికి మనదేశంపై పూర్తిసానుభూతి ఉందని భావించటం వలన తమ డిమాండ్ తప్పక సఫలమౌతుంది నమ్మారు .లేబర్ ప్రభుత్వానికి మన సహాయ సహకారాలు అందించాలని శాస్స్త్రి చెప్పాడు .రాజ్యాంగ త్వరిత దశలో ఉన్నాం కనుక ఇప్పుడు డిఫెన్స్ పొలిటికల్ ఫారిన్ అఫైర్స్ విషయాలు డిమాండ్ లో ఉండటం మంచిది కాదన్నాడు .ఆయన మాట ఎవరూ వినలేదు, పట్టించుకో లేదు .దీనితో పాటు ప్రభుత్వం కూడా ఒక పెద్ద తప్పు చేసింది . హోమ్ మెంబర్ అయిన మాల్కం హయిలీ అసెంబ్లి లో ఒక స్టేట్ మెంట్ ఇస్తూ మాంట్ ఫర్డ్ రిఫారమ్స్ ప్రకారం రేస్పాన్సిబిల్ గవర్నమెంట్ అంటే డొమినియన్ స్టేటస్ కాదు ‘’అన్నాడు. శాస్త్రి .ఉన్న సమస్యలే జటిలం అవుతుంటే ఇది మూలిగే నక్కపై తాటిపండు పడినట్లై ,జాతీయ సమైక్యతా ప్రయత్నాలు విఫలమయ్యాయని బాధ పడ్డాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-23-ఉయ్యూరు


