రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -29
సంస్కరణలు అమలు చేయండి అణచి వెతకాదు అని శాస్త్రి అనేక సార్లు ప్రభుత్వానికి మొరపెట్టాడుశాస్త్రి . .బెంగాల్ లో దౌర్జన్యకాండ పెరిగి బెంగాల్ గవర్నర్ లార్డ్ లిట్టన్ సలహాతో గవర్నర్ బెంగాల్ ఆర్డిననేంస్ తెస్తే వైస్రాయ్ వెంటనే ఆమోది౦చె శాడు .ఇది రౌలట్ చట్టానికి కొనసాగింపే .శాస్త్రి దీన్ని రౌలట్ చట్టం కంటే మరీ దారుణం అన్నాడు .బీసెంట్ దీన్ని సమర్ది౦చ గా ఆమెనుకలవటానికి మనసొప్పక రెండు లెటర్స్ రాశాడు నవంబర్ 1924లో .ఆమె వైఖరిని ఖండించాడు .బెంగాల్ పై ఆమె వైఖరి ,ఆమె చేస్తున్న రాజకీయ ఐక్యత కు విఘాతం కలిగిస్తుందని నొక్కి చెప్పాడు .దీనితో శాస్త్రి ఆమె మార్గాన్ని వదిలి భిన్నమార్గం లో ప్రవేశించాల్సి వచ్చింది .దీనికి కాంగ్రెస్ వారి నుంచి గొప్ప ప్రశంసలు పొందాడు .కాంగ్రెస్ నాయకుడు సత్యమూర్తి శాస్త్రికి ఒక ఉత్తరం రాస్తూ-‘’హృదయపూర్వక అభినందనలు .మనసులో ఉన్నది చక్కగా మొహమాటం లేకుండా చెప్పావు .నువ్వు కాంగ్రెస్ లో చేరితే మేమంతా సంతోషిస్తాం .కారణాలు నేను నీకు చెప్పక్కర లేదు నీకు అన్నీ తెలుసు .నిన్ను కాంగ్రెస్ కోరుతోంది అని మాత్రమె చెప్పగలను .ఒంటి బుజం పై కాడి మోస్తూ నువ్వు న్యాయం విజయం సాధించలేవు ‘’అన్నాడు .
1923లో తన కుమార్తె కమలా ముఖర్జీ ఆకస్మిక మరణం జరిగాక ఆశుతోష్ ముఖర్జీ ,కలకత్తా యూని వర్సిటిలో కమలాముఖర్జి స్మారక ఉపన్యాసాలు ఏర్పాటు చేసి శాస్త్రి ప్రసంగించమని కోరాడు ఆరోగ్యం సహకరించక పోయినా శ్రమపడి తయారయ్యాడు .మొదటిప్రసంగం బీసెంట్ కు తర్వాత శాస్త్రికి అవకాశం .కానీ శాస్త్రిని ఆహ్వానించటానికి ముందే ఆశుతోష్ కూడా అకస్మాత్తుగా చనిపోయాడు .ఆయన కొడుకులద్వారా మరణ వార్త అందుకొన్న శాస్త్రి ఆయనపై ఉన్న అత్యంత గౌరవంతో డాక్టర్లు వద్దని వారిస్తున్నా వెళ్ళాడు .23-2-1926నుండి వరుసగా నాలుగు రోజులు శాస్త్రి ప్రసంగించాడు .ఈవిషయం కూతురుకు రాస్తూ శాస్త్రి –‘’గంట౦బావు నేను నిలబడి కమల మీద ఉచ్చైస్వరంతో మాట్లాదగలిగాను నిన్న .ఉపన్యాసం మొదటి పదినిమిషాల్లో చాతీలో నొప్పి ప్రారంభమై పూర్తీ అయ్యేదాకా ఉండి పోయింది .తర్వాత సెనేట్ హౌస్ లోఉన్న పక్క రూం లో విశ్రాంతి తీసుకొన్నాను. తర్వాత నన్ను కుర్చీలో నా కారు దగ్గరకు తీసుకు వెళ్లారు ‘’అని రాశాడు .
నీలరతన్ సర్కార్ ,దా బిసి రే శాస్త్రిని నిరంతరం వెన్నంటి ఉన్నారు ఆరోగ్యవిషయంలో .శాస్త్రికి ఏదో ప్రమాదం జరిగిందని అందరూ వణికి పోతున్నారు భయంతో .ఏవోకొన్ని కొటేషన్లు ,ముఖ్య విషయాలు తప్ప ఆయన ప్రసంగ పాఠం ఏర్పాటు చేసుకోలేదు .ఆయన ఎక్కువ సేపు మాట్లాడటం వలన వచ్చిన బాధ అది .అయన నాలుగు ప్రసంగాలు మరీఅరీ చదివి ఆనందిన్చాల్సినవి మనసులో భద్ర పరచుకోవాల్సిన విలువైన విషయాలవి .ఆయనమాటలలో కొన్ని ఆణిముత్యాలు –‘’rights flow from duties ..every citizen to be well instructed in his rights and to be well prepared for defending them .’’law breakers గురించి మాట్లాడుతో ‘’లా బ్రేకర్స్ కంటే లాను పాటించే వారే దేశంలో తక్కువమంది మీకంటే ఉన్నారు అని అనుకొంటే తప్పు .వాళ్ళు ‘’will use your precedent and make the extreme medicine of the constitution its daily bread ‘’అని హెచ్చరించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-23-ఉయ్యూరు
