రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -30

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -30

కమలాముఖర్జీ స్మారక ప్రసంగాలపై కలకత్తాలోని గార్డియన్ పత్రిక –‘’శాస్త్రి ప్రసంగాలను అత్యంత శ్రద్ధతో జనం విన్నారు .కారణం –‘’Rarely does the opportunity come to most of us to listen to utterance of so mature a mind ,,so generous ,a lover of youth ,so qualified a man of public affairs who looms large whichever the stage ,whether academic ,or political or social whether  Indian  or Imperial or International shining –not through any adventitious

Aid or pose ,but by the breadth of his knowledge of the world ,by the scrupulosity of his fairness to foes and friends ,and by matchless poise of his judgement ‘’.కలకత్తా విశ్వవిద్యాలయం చేత గౌరవిమ్పబడి ,గవర్నమెంట్ హౌస్ కు ఆహ్వానిమ్పబడి ,కార్పోరేషన్ ఛే సన్మానం పొంది ,విధ్యుక్త ధర్మం పై తనకున్న  అచ్చ స్వచమైన ఆరాధన చూపాడు .అది మంచి రిపోర్ట్ అయినా,చెడుదైనా తను తన దేశానికి అసలైన నిజాయితీ గల సేవకుడు అని రుజువు చేశాడు ‘’అని రాసింది .ఇవే ప్రసంగాలు మళ్ళీ మద్రాస్ యూని వర్సిటిలో  15-3-1926 నుంచి అత్యంత ఆసక్తి ,శ్రద్ధ ఉన్న ప్రేక్షకుల మధ్య చేశాడు శాస్త్రి .మద్రాస్ యూని వర్సిటి పరమానందం పొంది ఆయనకు బంగారు పళ్ళెం బహూకరించింది .యూని వర్సిటి హాల్ లో శాస్త్రి తైల వర్ణ చిత్రాన్ని నెలకొల్పింది గౌరవ సూచకంగా .శ్రీనివాస శాస్త్రి పేరిట లెక్చర్స్ నిర్వహించింది .

          దక్షిణాఫ్రికా

 గోఖలే ,గాంధీలపనిని వారి తరఫున దక్షిణాఫ్రికా లో నిర్వహించాల్సిన బాధ్యత శాస్త్రిపై పడింది . గోఖలే వారసుడుగా ఇండియాలో ప్రజల సాంఘిక, నైతిక,ఆర్ధిక ఆసరా ను సంపాదించిన శాస్త్రికార్యరంగం ఇప్పుడు దక్షిణాఫ్రికా కు మారింది .1913 డిసెంబర్ లో శాస్త్రి లార్డ్ హార్దిన్జ్ కు ఇచ్చిన మద్రాస్ మహాసభ విన్నపం చదివి ,అప్పుడు ఆనాటి వైస్రాయ్ మంచితనంతో సానుభూతితో ;;సౌతాఫ్రికాలోని మాతోటి వారు అనుభవిస్తున్న బాధలకు సానుకూలంగా స్పందించాడు .1919లో లార్డ్ చేమ్స్ ఫోర్డ్ శాస్త్రిని సర్ బెంజమిన్ రాబర్ట్ సన్ తో లంజి కమిషన్ ముందు ఇండియన్ కేస్ ఎంతవరకు వచ్చిందో తెలుసు కోవటానికి పంపాలనుకొన్నాడు .ఈ కమిషన్ ను జనరల్ స్మట్స్ నియమించాడు .శాస్త్రి ప్రతినిధి వర్గం రావటానికి స్మట్స్ అనేక అడ్డంకులు కల్పించాడు .సౌతాఫ్రికా గవర్నర్ జనరల్ లార్డ్ బక్స్ స్టన్ తో బెంజమిన్ తో పాటు సమాన స్థాయి శాస్త్రికి కల్పించ వద్దని చెప్పాడు .ఈ విషయాన్ని అతడు చేమ్స్ ఫీల్డ్ కు చెప్పాడు .దీన్ని ఒక వార్నింగ్ గా భావించారు శాస్త్రిపట్ల .కనుక శాస్త్రి అన్నీ ఆలోచించి ఆ డెలిగేషన్ లో తాను  పాల్గొనటం వివేకమైన చర్యాకాదనుకొని కారణంగా –‘’for one who was to plead for the equality of his countrymen with other subjects of His Majesty to begin by admitting his inferiority ‘’అన్నాడు ,శాస్త్రి నిర్ణయం ఇండియన్స్ బాగా వ్యతిరేకించగా ,దక్షిణాఫ్రికా ఇండియన్లు బాగా నిరుత్సాహ పడ్డారు .ఈ విషయాలన్నీ సీక్రెట్ కేబుల్స్ ద్వారా జరిగినందువలన శాస్త్రి వీటిని బహిర్గతం చేయలేదు .

  1923 లో జరిగిన ఇంపీరియల్ కాన్ఫరెన్స్ లో స్మట్స్ ,తన వైఖరిని మరింత బిగించి ,మరికొంచెం ముందుకు వెళ్లి బ్రిటీష సామ్రాజ్యంలో సమాన పౌరసత్వమే ఉండ రాదు అన్నాడు .ఇంతటితో ఆగక జనరల్ హోదాలో శత్రువుల సరిహద్దులపై యుద్ధానికి బయల్దేరుతూ –‘’శాస్త్రి ఇక్కడికి వచ్చి తన రాతలతో మాటలతో వాతావరణం చెడగొట్టాడు .అతడికిచ్చిన  ఏ అవకాశాన్నీ సౌతాఫ్రికాలోని ఇండియన్లకు న్యాయం కల్గిన్చాతానికి వదులుకోడు.చాలా సున్నితంమైన సమస్యను డొమినియన్ లో చిచ్చు రేపాడు .లేనిపోని తగాదాలు సృష్టించాడు ఇక్కడికి వచ్చి .గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చాడు .ఈ చిచ్చు స్థానికంగా అన్ని చోట్లా మండుతోంది .దీన్ని నేను ముందే గమనించి శాస్త్రిని దక్షిణాఫ్రికాకు ఆహ్వానించలేదు ‘’అన్నాడు .క్రమక్రమ౦గా ఇండియా వ్యతిరేకత దక్షిణాఫ్రికాలో పెరుగుతోంది .వర్తకం భూముల పైనా ఆంక్షలు ఎక్కువయ్యాయి .1924లో జాతులమధ్య వైరం తీవ్రం చేసే క్లాస్ ఏరియాస్ అండ్ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టబడింది .ఈ బిల్ ప్రవేశ పెట్టటానికి ముందు సౌతాఫ్రికన్ పార్టీ జనరల్ స్మట్స్ నాయకత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేయాలి బిల్ పాస్ కావాలంటే .  దురదృష్ట వశాత్తు జనరల్ హీర్త్జాగ్ నేతృత్వంలోని నేషనలిస్ట్ పార్టి ప్రభుత్వం ఆ  బిల్లు నే ప్రవేశ పెట్టింది .బిల్లును ప్రవేశపెడుతూ ఇంటీ రియల్ మినిస్టర్ డా.మలాన్ –‘’ఈ దేశం లో ఇండియన్ జాతి ఈ దేశజనానీకం లో పరాయి జాతి .   ఇండియన్ జనాభా బాగా తగ్గిపోయే దాకా ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం  అంగీకరించము ‘’అన్నాడు .అంటే  ఇండియన్  ల పై  పిడుగు పడ్డట్టే .ఆశలు అడియాసలు అయినట్లే .

  ఈ సంకట స్థితి లోనుంచి బయట పడటానికి ఇండియా ప్రభుత్వం మళ్ళీ చర్చల విధానం ప్రారంభించి మిస్టర్ పాడిసన్ ఆధ్వర్యంలో ఒక ప్రతినిదివర్గాన్ని దక్షిణాఫ్రికాలో పరిస్థితిపై ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ పొందటానికి పంపింది .ఇది జరగేలోపే ,సౌతాఫ్రికా ఇండియన్ కాంగ్రెస్ ప్రతినిధి వర్గం ఇండియా వచ్చి ,ఇక్కడి ప్రభుత్వ ,ప్రజల సహాయం కోరింది .పాడిసన్ ప్రతినిధి వర్గం వెళ్ళాక  మళ్ళీ సౌతాఫ్రికా పార్లమెంటరి ప్రతినిధి వర్గం ఇండియా వచ్చింది .ఈ బృందాల చర్చోపచర్చల వలన సౌతాఫ్రికా యూనియన్ ప్రభుత్వం తాము ప్రవేశ పెట్టిన బిల్లుపై ముందుకు వెళ్ళమని ,పెండింగ్ లో బిల్లును పెట్టి ఉంచుతామని ,ఇండియా ప్రభుత్వంతో ,ప్రతినిధులతో సంపూర్ణంగా చర్చిస్తామని తెలియ జేసింది .ఇలా ఆబిల్లు తాత్కాలికంగా అటకెక్కి ఇండియన్లకు కొంత ఊరట కలిగించింది .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-23-ఉయ్యూరు     

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.