రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -31

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -31

 ఇలాంటి పరిస్థితులలో సౌతాఫ్రికాకు ఇండియన్ డెలిగేషన్ సర్ మహమ్మద్ అబ్దుల్లా నాయకత్వంలో ,ఫిరోజ్ సేత్నా ,సర్ డి.ఆర్ సి లిండ్సే,జార్జ్ పాడిసాన్ ,రైటానరబుల్ శ్రీనివాసశాస్త్రి సభ్యులుగా ,జిఎస్ బాజ్ పాయి సేక్రేటరిగా వెళ్ళింది .శాస్త్రి సర్వ సమర్ధతను గుర్తించి ఆయన తప్పక ఉండాలని పంపింది .శాస్త్రి చాల వినయంగా హబిబుల్లాకు ఐ సి ఎస్ .కేడర్ బ్రిటీష మెంబర్ ను అపాయింట్ చేయమని కోరగా ,కార్బెట్ ను వేసుకొన్నాడు .ఇంతమంది ఉన్నా శాస్త్రి కున్న ప్రాముఖ్యత ఆయనదే ..సౌతాఫ్రికా డెలిగేషన్ లో హెర్ట్జ్ జాగ కమీషన్ లోని వారే ఉన్నారు .ఇంటీరియర్ మినిస్టర్ మలాన్  డెలిగేషన్ చైర్మన్ .1927ఫిబ్రవరిలో పరిష్కారానికి నిబంధనలు కేప్ టౌన్ లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కుదిరాయి .ఇందులో పాశ్చాత్య జీవన విధానం కొనసాగాలి .సౌతాఫ్రికాలోని ఇండియన్లు పడమర స్టాండర్డ్ లకు ఇష్టపడితే అవలంబించ వచ్చు .ఇండియన్ సెటిలర్స్ ఉన్నతికి కొన్ని ప్రోగ్రాములు అమలు చేయాలి ..వీరు అక్కడి ఏ వర్గం వారికన్నా వెనక బడి ఉండరాదు .ఇమ్మిగ్రేషన్ బిల్ ను ఉపసంహరించాలి .ఏజెంట్ జనరల్ ఆఫ్ థి ఇండియా గవర్నమెంట్ ను  రెండు ప్రభుత్వాల మధ్య సహకారం కోసం నియమించాలి .ఈ కేప్ టౌన్ అగ్రిమెంట్ ఒక చారిత్రాత్మక విజయం రెండు ప్రభుత్వాలకు .దక్షిణాఫ్రికా ఇండియన్ లు చాలా సంతోషిస్తారని శాస్త్రి ముందే ఊహించాడు .వీడ్కోలు సమావేశంలో శాస్త్రి ‘’మేము కేప్ టౌన్ ను ఎంతో సంతోషంతో సంతృప్తి తో వదిలి వెడుతున్నాం .ఇక్కడి ఇండియన్లు చక్కగా దీన్ని అమలు పరిస్తే భవిష్యత్తు పూర్తీ ఆశావహంగా ఉంటుంది ‘’అన్నాడు డర్బాన్ లో –‘’ఇండియా సౌతాఫ్రికాల మధ్య అనుబంధం పై ఒక నూతన యుగం ఆవిష్కారమౌతోంది .యూనియన్ గవర్నమెంట్ believe in and adhere to the principle that it is the duty of every civilized government  to devise ways and means and take all possible steps for the uplifting of every section of their permanent population to the full extent  of their opportunity and accept the views that ,in provisions of educational and other facilities the considerable number of Indians who will remain part of the permanent population should not be allowed to lag behind other sections of the people ‘’ అంటూ ఒక దార్శనికునిలా శాస్త్రి మాట్లాడాడు .

  భారత ప్రభుత్వం తరఫున మొదటి ఏజెంట్ జనరల్ ను సౌతాఫ్రికా లో నియమించటానికి శాస్త్రి పేరునే అందరూ ఏకగ్రీవంగా  బలపరచారు  .సి ఎఫ్ ఆండ్రూస్ చెప్పినట్లు ‘’Saintly man ,who more than any  other ,by his work of healing and reconciliation made the Cape Town agreement possible ‘’జనరల్ హీర్త్ జాగ్ , డా మలాన్లు కూడా సర్వ సమర్ధుడు శాస్త్రి ఏ అని ఆహ్వానించారు .సౌతాఫ్రికా ఇండియన్లు ఆయన రాకకోసం ప్రార్ధనలు చేశారు .వైస్ రాయ్ కూడా శాస్త్రి వైపే మొగ్గాడు . గాంధీ  శాస్స్త్రి మాత్రమే అంతటి   బాధ్యత నిర్వహించగలడు అని  అభిప్రాయ పడ్డాడు .1927ఏప్రిల్ ఆరున శాస్త్రికి ఒక లేఖ పంపుతూ గాంధీ –‘’జబ్బు తో ఉన్న  మనిషి రాస్తున్న లేఖ ఇది .నిన్ను  బెంగుళూరు లో చూడాలని ,నా దావా పై పట్టుపడ తావని ఆశ పడ్డాను .కానీ అది జరగలేదుఇప్పటికీ .నువ్వు సౌతాఫ్రికాకు వెళ్ళకపోతే అక్కడి ఇండియన్ల హృదయాలు క్షోభిస్తాయి .వైస్రాయ్ ఇర్విన్ ఉన్నంతవరకు ఆటంకాలు ఉండవు ఆయనకు నువ్వు బాగా తెలుసు .నువ్వు మళ్ళీ ఆలోచించి ఒక్క ఏడాది అక్కడ ఉండాల్సి వచ్చినా తప్పకుండా వెళ్ళు ఇది అందరి అభిమతహం ‘.నువ్వు మాత్రమె ఆ ఒప్పందాన్ని సర్వ సమర్ధంగా ప్రారంభించి పూర్తీ చేయగలవు .’’అని రాశాడు ఈ ఉత్తరం శాస్త్రికి వెయ్యేనుగుల బలం వచ్చినట్లయి వెళ్ళ టానికి అంగీకరించాడు .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-7-23-ఉయ్యూరు .  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.